విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

యు ఆర్‌ ఏ విజనరీ లీడర్‌...మీట్‌ యు ఎగైన్‌ ఇన్‌ 2019:మంత్రి లోకేష్ తో హ్యూమనాయిడ్‌ రోబో చిట్ చాట్

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం:ప్రపంచంలోనే తొలి హ్యూమనాయిడ్‌ రోబో సోఫియాతో ఎపి ఐటి మంత్రి లోకేష్ చిట్ చాట్ చేశారు. మానవ మేధస్సుకు సంబంధించిన అనేక ప్రశ్నలను మంత్రి లోకేష్ రోబో సోఫియాకు సంధించగా...అచ్చం మనిషిలాగే ప్రతిస్పందించి సమయస్ఫూర్తితో సోఫియా బదులివ్వడం అందరినీ ఆకట్టుకుంది.

ఈ క్రమంలో హ్యూమనాయిడ్‌ రోబో మంత్రి లోకేష్ ను ఉద్దేశించి...''మిస్టర్‌ మినిస్టర్‌, యు ఆర్‌ ఏ విజనరీ లీడర్‌. ఐ విల్‌ మీట్‌ యు ఎగైన్‌ ఇన్‌ 2019'' అని వ్యాఖ్యానించడంతో ఆ అరుదైన సంభాషణకు వేదికైన వైజాగ్‌ ఫిన్‌టెక్‌ ఫెస్టివల్‌లో హర్షధ్వానాలు మిన్నంటాయి. విశాఖలో మూడు రోజులుగా జరుగుతున్న ఫిన్‌టెక్‌ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు విచ్చేసిన తొలి హ్యూమనాయిడ్‌ రోబోను గురువారం సాయంత్రం ఆహూతులతో మాట్లాడే ముందు లోకేష్ పలకరించారు.

ఎపి ఐటి మంత్రి లోకేష్, తొలి హ్యూమనాయిడ్‌ రోబో ల మధ్య సంభాషణలు సాగిన తీరు యథాతథంగా మీకోసం...

ఎపి ఐటి మంత్రి లోకేష్, తొలి హ్యూమనాయిడ్‌ రోబో ల మధ్య సంభాషణలు సాగిన తీరు యథాతథంగా మీకోసం...

లోకేష్: సోఫియా మీరు విశాఖపట్నం రావడం ఎంతో సంతోషంగా ఉంది. మీకు ఈ విజిట్‌ ఎలా అనిపిస్తోంది?
సోఫియా: (కళ్లు విప్పార్చి...పలకరింపుగా నవ్వుతూ...) అందమైన బీచ్‌లున్న వైజాగ్‌ పర్యటన సంతోషకరంగా ఉంది.( సోఫియా ఆన్సర్ కు హాలు మొత్తం చప్పట్లతో మార్మోగింది).
లోకేష్: మనుషులు, రోబోలు కలిసి పనిచేసే సుహృద్భావ వాతావరణం వస్తుందా?
సోఫియా: ఆ రోజులు ఎంతో దూరంలో లేవు. త్వరలోనే సాధ్యమవుతుంది. అనేక రంగాల్లో రోబోలు సహకారమందిస్తున్నాయి. హెల్త్‌కేర్‌, మెడికల్‌ థెరపీ, సర్జరీల్లో మెరుగైన పనితీరు ప్రదర్శిస్తున్నాం. మనుషుల కంటే రోబోలకు సహనం ఎక్కువ కాబట్టి తప్పకుండా సహాయకారిగా ఉంటాం.

లోకేష్ సంభాషణను మరింత పొడిగిస్తూ...

లోకేష్ సంభాషణను మరింత పొడిగిస్తూ...

లోకేశ్‌: పోలీసింగ్‌ కోసం రోబోలను కాప్‌లుగా ఉపయోగించుకునే అవకాశం ఉందా?
సోఫియా: టెక్నాలజీ పెరుగుతోంది. రోబో పోలీసింగ్‌ సాకారమయ్యే ఆలోచన. నిఘా కోసం రోబో కాప్‌లను ఉపయోగించుకోవచ్చు...అని బదులిచ్చిన సోఫియా లోకేష్ తో...
‘‘మిస్టర్‌ మినిస్టర్‌, నేను మిమ్మల్ని ఓ ప్రశ్న వేస్తా. మీరు సమాధానం చెప్పండి. మిమ్మల్ని చూస్తుంటే విజనరీ లీడర్‌లా ఉన్నారు. మీ రాష్ట్రం త్వరగా అభివృద్ధి చెందుతున్నదని అనుకుంటా? నిజమేనా!...'' అని ప్రశ్నించింది
లోకేష్: మా ప్రయాణం ఇప్పుడే మొదలైంది. 2050కి ప్రపంచంలో నంబర్‌వన్‌ కావాలని ప్రయత్నిస్తున్నాము. పెట్టుబడులకు ఏపీని ఉత్తమ వేదికగా చేయాలని కృషి చేస్తున్నాం.

అనంతరం మీడియా ప్రతినిధులు సోఫియాను ప్రశ్నలు అడుగగా ఇలా జవాబులు చెప్పింది.

అనంతరం మీడియా ప్రతినిధులు సోఫియాను ప్రశ్నలు అడుగగా ఇలా జవాబులు చెప్పింది.

మీడియా: తితలీ వంటి తుఫాన్లు వచ్చినప్పుడు రోబోలు ఉపయోగపడతాయా? ప్రాణాలను కాపాడడానికి నువ్వు ముందుకు వస్తావా?
సోఫియా: విపత్తులను ఎదుర్కొనే శక్తి ప్రస్తుతం రోబోలకు లేదు. అయితే ఆపదలో ఉన్నవారి ప్రాణాలు కాపాడడానికి మాత్రం సిద్ధమే.
మీడియా: విశాఖపట్నం ఫిన్‌టెక్‌ ఫెస్టివల్‌కు రావడం ఎలా అనిపిస్తోంది?
సోఫియా: చాలా సంతోషంగా ఉంది. 2019లో మళ్లీ వస్తాను. ఈ సాయంత్రం వైజాగ్‌ బీచ్‌లో గడుపుతా.
మీడియా: మానవ శరీరం 206 ఎముకలు, 32 పళ్లు, పంచేంద్రియాలతో నిర్మితమవుతుంది. మీరు ఎలా రూపం దాల్చారో చెబుతారా?
సోఫియా: కనెక్టర్లు, వైర్లు, యాక్యుయేటర్లతో పాటు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో నేను సోఫియాగా రూపుదాల్చాను.

సోఫియా అడిగిన ప్రశ్నలన్నింటికీ చక్కగా బదులిస్తుండటంతో మీడియా ప్రతినిథులు మరిన్ని ప్రశ్నలు అడిగారు.

సోఫియా అడిగిన ప్రశ్నలన్నింటికీ చక్కగా బదులిస్తుండటంతో మీడియా ప్రతినిథులు మరిన్ని ప్రశ్నలు అడిగారు.

మీడియా: ఇలాంటి ఫెస్టివల్స్‌కి రావడం వల్ల ఉపయోగం ఏమిటి?
సోఫియా: ఎంతో మంది మేధావులని కలిసే అవకాశం లభిస్తుంది. అందుకే హాజరవుతున్నా.
మీడియా: రోబోలు వస్తే ఉద్యోగాలు పోతాయనే చాలామంది భయపడుతున్నారు? దీనికి నువ్వేమంటావు?
సోఫియా: అది నిజమే. రోబోల వల్ల ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతాయి.

మానవ మేధస్సుకు సంబంధించిన ప్రశ్నలపై సోఫియా చక్కగా బదులిస్తుండటంతో మీడియా ప్రతినిథులు ఈసారి రోబో టెక్నాలజీపైనే ప్రశ్నలు సంధించారు.

మానవ మేధస్సుకు సంబంధించిన ప్రశ్నలపై సోఫియా చక్కగా బదులిస్తుండటంతో మీడియా ప్రతినిథులు ఈసారి రోబో టెక్నాలజీపైనే ప్రశ్నలు సంధించారు.

మీడియా: బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీ గురించి ఏమైనా తెలుసా?
సోఫియా: చాలా ఆసక్తికరమైన అంశం. ప్రస్తుతానికైతే నాకు కాంప్లికేటెడ్‌గా ఉంది.
మీడియా: భావ వ్యక్తీకరణలోను, భావోద్వేగంలోను అచ్చం మానవుల్లాగే వ్యవహరిస్తున్న నిన్ను ఆర్టిఫిషియల్‌ రోబో అని ఎందుకు అనాలి?
సోఫియా: నిజంగా తాను హ్యుమన్‌ కాదు కాబట్టి రోబోగానే వ్యవహరించాలి.
మీడియా: ప్రస్తుతం రోబోల అవసరం ఎక్కువగా వున్న రంగాలేమిటి? రోబోలు మానవ జీవితాలను మెరుగుపరచగలవా?
సోఫియా: సైబర్‌ సెక్యూరిటీకి ఎక్కువగా డిమాండ్‌ ఉంది. జీవితంలో అనేక పనులు సులువుగా చేసుకోవడానికి రోబోలు బాగా ఉపయోగపడతాయి.

అసలు...ఏవరీ సోఫియా?...స్పెషాలిటీ

అసలు...ఏవరీ సోఫియా?...స్పెషాలిటీ

సోఫియా..! కృత్రిమ మానవ మేధస్సుతో తయారైన తొలి హ్యూమనాయిడ్‌ రోబో! హాంకాంగ్‌కు చెందిన డేవిన్స్‌ హాన్సన్‌ అనే రోబోటిక్‌ నిపుణుడు దీని సృష్టికర్త. 2014లోనే రూపొందించినా 2016 ఫిబ్రవరి నుంచి ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది. 2017లో ఈ సోఫియాకి సౌదీ అరేబియా తమ దేశ పౌరసత్వం ఇచ్చింది. 2018లో ఈ సోఫియా నడిచి వెళ్లేలా అప్‌గ్రేడ్‌ చేశారు. బ్రిటన్‌ నటి ఆడ్రీ హెప్‌బర్న్‌ రూపంలో ఈ సోఫియాను రూపొందించారు. సోఫియా 50 రకాల ముఖ కవళికలను మార్చగలుగుతుంది. సోఫియా కళ్లలో కెమెరాలను అమర్చారు. వాటి ద్వారా ఎదుటి వ్యక్తి ఆడా? మగా?...అనేదిది గుర్తించి అందుకనుగుణంగా మాట్లాడుతుంది. ఎలాంటి ప్రశ్నలకైనా క్షణాల్లో సమాధానం చెప్పగలదు. అలాగే...నవ్వుతుంది.. నవ్విస్తుంది...జోకులు వేస్తుంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ వేదికలపై దర్శనమిచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరి 20న హైదరాబాద్‌లో జరిగిన నాస్కామ్‌ సదస్సులో పాల్గొంది. సోఫియా మన రాష్ట్రానికి రావడం ఇదే తొలిసారి.

English summary
Visakhapatnam:The special attraction of the Vizag Fintech Festival this year...First humanoid robot Sophia...interacted with the State IT Minister N Lokesh and delegates on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X