• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జగన్ కు తొలి షాక్ ఇచ్చిన కేంద్రం .. ఆ ఒప్పందాల రద్దు మీ ఇష్టం కాదు

|

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. ఏపీలో తన మార్క్ పాలన కొనసాగించే ప్రయత్నం చేస్తున్న ఆయన చేసిన వ్యాఖ్యలకు కేంద్రం హితబోధ చేసింది.కేంద్ర ప్రభుత్వం ఏపీ సీఎం జగన్ కు మొట్టమొదటి ఝలక్ ఇచ్చింది . జగన్ సీఎం అయిన తర్వాత చంద్రబాబునాయుడు హయాంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై జగన్ పునః సమీక్ష చేస్తామని, అవసరమైతే వాటిని మార్చేస్తామని ప్రకటించారు. అయితే, ఈ నిర్ణయమే తప్పని కేంద్రం చాలా సున్నితంగా అక్షింతలు వేసింది.

మోడీ కుష్ హువా....!? మోడీ విమానం దిగగానే జగన్ ఎం చేశాడో తెలుసా....

విద్యుత్ ఒప్పందాలను పునః సమీక్షిస్తే పెట్టుబడిదారుల్లో అపనమ్మకం కలుగుతుందన్న కేంద్రం

విద్యుత్ ఒప్పందాలను పునః సమీక్షిస్తే పెట్టుబడిదారుల్లో అపనమ్మకం కలుగుతుందన్న కేంద్రం

ఈ వ్యవహారంలో జగన్ వైఖరి సరికాదని కేంద్రం లేఖ రాసింది. రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యానికి కేంద్ర ఇంధన శాఖ కార్యదర్శి ఆనంద్ కుమార్ రాసిన లేఖలో పీపీఏలను పునఃసమీక్షించడం వల్ల పెట్టుబడిదారుల్లో అపనమ్మకం ఏర్పడుతుందని హెచ్చరించారు . దీంతో భవిష్యత్ లో పెట్టుబడిదారులు పెట్టుబడులు పెట్టేందుకు వెనకాడతారని పేర్కొన్నారు ఆనంద్ కుమార్ . దీని వల్ల భవిష్యత్తులో కంపెనీలు దేశంలోనూ, అలాగే రాష్ట్రంలోనూ పునరుత్పాదక ఇంధన రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి సంశయిస్తాయని ఆ లేఖలో పేర్కొన్నారు .

అవినీతి నిరూపణ అయితేనే పునః పరిశీలనకు అవకాశం .. ఒప్పందాల రద్దు మీ ఇష్టంకాదని కేంద్రం క్లాస్

అవినీతి నిరూపణ అయితేనే పునః పరిశీలనకు అవకాశం .. ఒప్పందాల రద్దు మీ ఇష్టంకాదని కేంద్రం క్లాస్

2022 నాటికి దేశవ్యాప్తంగా 175 గిగావాట్ల పునరుద్పాదక ఇంథనాన్ని ఉత్పత్తి చేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుందని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పీపీఏలను సమీక్షించి వాటిని రద్దు చేస్తే కేంద్రం లక్ష్యం దెబ్బతింటుందని హెచ్చరించింది. రాష్ట్ర ప్రభుత్వం చేసుకునే ఒప్పందాలు ఏవైనా సిటీ రెగ్యులేటరీ కమిషన్ నిబంధనల మేరకే జరుగుతాయని పేర్కొంది. ఇక చేసుకున్న ఒప్పందాల్లో ఏదైనా అవినీతి జరగడం, మితిమీరిన లబ్ధి జరిగిందన్న విషయాలు రుజువైతే తప్ప వాటిని పునః పరిశీలన చేయడానికి అవకాశం లేదని పేర్కొంది. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకున్న ఒప్పందాలను పునఃపరిశీలించడానికి వీల్లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఇక ఈ విషయాలపై వాస్తవాలు అర్థమయ్యేలా జగన్ కు వివరించాలని సి యస్ కు ఇంధన శాఖ సూచించింది.

విద్యుత్ ఒప్పందాల రద్దుకు, మార్పుకు వీలు లేదు అన్న కేంద్ర శక్తివనరుల శాఖ

విద్యుత్ ఒప్పందాల రద్దుకు, మార్పుకు వీలు లేదు అన్న కేంద్ర శక్తివనరుల శాఖ

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యుత్ ఒప్పందాలపై పున పరిశీలన విషయంలో ఒక అడుగు వెనక్కు వేయాల్సిన పరిస్థితి నెలకొంది. విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించి పలు ఒప్పందాల్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం భారీ అవినీతికి పాల్పడింది అని తమ ప్రభుత్వ హయాంలో వాటన్నింటిపైనా సమీక్షిస్తామని, అవసరమైతే రద్దు చేస్తామని ఎన్నికల సమయంలోనే జగన్ ప్రకటించారు. అందుకు తగ్గట్టుగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆ దిశగా అడుగులు వేశారు జగన్. ఇక ఈ నేపథ్యంలోనే జగన్ ఆదేశాల మేరకు విద్యుత్ ఒప్పందాలను వెంటనే సమీక్షించడానికి ప్రభుత్వ కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. దీంతో కేంద్ర శక్తి వనరుల శాఖ కార్యదర్శి ఆనంద్ కుమార్ ఆ ఒప్పందాలను మార్చడానికి వీలు లేదని స్పష్టం చేస్తూ జగన్ ప్రభుత్వానికి సుదీర్ఘమైన లేఖ రాశారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In what can be the first major shock to YS Jagan Mohan Reddy government from the Centre, Union New and Renewable Energy secretary Anand Kumar has shot off a letter to the AP Chief Secretary LV Subramanyam over AP CM's decision to "revisit" renewable Power Purchase Agreements PPAs. In the letter, the union government has advised Jagan-led AP government to resist from his move to revisit PPAs in the renewable energy sector. The union government opined that "such steps" would send wrong signals to investors and would "affect" the investor confidence and the country's renewable energy targets.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more