వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో తొలి జీరో ఎఫ్ఐఆర్ ... కృష్ణా జిల్లాలో నమోదు

|
Google Oneindia TeluguNews

వెటర్నరి డాక్టర్ దిశ గ్యాంగ్ రేప్ అండ్ మర్డర్ కేసులో నింధితులను కఠినంగా శిక్షించాలంటూ దేశమంతటా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్న వేళ జీరో ఎఫ్ఐఆర్ పై దేశవ్యాప్తంగా ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఏదైనా ఘటన జరిగినప్పుడు ఈ పోలీస్ స్టేషన్, ఆ పోలీస్ స్టేషన్ అన్న తేడా లేకుండా ఎక్కడైనా ఫిర్యాదు చేసే విధంగా జీరో ఎఫ్ఐఆర్ ను అందుబాటులోకి తీసుకురావాలని చర్చ జరుగుతున్న వేళ ఏపీ సర్కార్ జీరో ఎఫ్ ఐ ఆర్ అమలు ప్రారంభించింది.

రెండే రెండు మాటల్లో పవన్ కళ్యాణ్ పరువు తీసేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిరెండే రెండు మాటల్లో పవన్ కళ్యాణ్ పరువు తీసేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి

ఏపీలో తోలి జీరో ఎఫ్ఐఆర్ .. బాలుడి అదృశ్యం కేసు

ఏపీలో తోలి జీరో ఎఫ్ఐఆర్ .. బాలుడి అదృశ్యం కేసు

ఏపీలో తొలి జీరో ఎఫ్ఐఆర్ కేసు నమోదైంది. ఒక బాలుడు అదృశ్యం ఘటనలో కృష్ణా జిల్లా పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తెలంగాణలో దిశ ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే . అయితే దిశ ఘటన ఉదంతంలో పోలీసులు త్వరగా కేసు తీసుకోకపోవడం , తమ పరిధిలోకి రాదంటూ బాధిత కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడం వెలుగులోకి వచ్చిన తరువాత దేశవ్యాప్తంగా జీరో ఎఫ్ఐఆర్ ప్రాధాన్యంపై చర్చ జరుగుతోంది.

కంచికచర్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు

కంచికచర్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు

తమ పరిధి తో సంబంధం లేకుండా ఫిర్యాదు స్వీకరించి నమోదు చేసుకునే విధానమే జీరో ఎఫ్ఐఆర్. బాధితులు తమ పరిస్థితిని బట్టి ఎక్కడినుండైనా ఈ ఎఫ్ఐఆర్ ను నమోదు చేయవచ్చు.
ఇక ఈ నేపథ్యంలో ఏపీలో తొలి జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది. తన కుమారుడ్ని కిడ్నాప్ చేశారంటూ కృష్ణా జిల్లా వీరులపాడు మండలం రంగాపురం గ్రామానికి చెందిన రవినాయక్ అనే వ్యక్తి కంచికచర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 రంగంలోకి పోలీసులు .. తెలంగాణలో బాలుడ్ని పట్టుకున్న పోలీసులు

రంగంలోకి పోలీసులు .. తెలంగాణలో బాలుడ్ని పట్టుకున్న పోలీసులు

తమ కుమారుడు కనబడడం లేదని ఫిర్యాదు చేసిన తమ పరిధి కాదని తెలిసినా కంచికచర్ల పోలీసులు కేసు నమోదు చేసుకోవడమే కాదు, బాలుడు తెలంగాణలో ఉన్నట్టు గుర్తించి బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. విచారణలో భాగంగా రెండు బృందాలుగా విడిపోయిన పోలీసులు తీవ్రంగా శ్రమించారు. అటు ఏపీలోనూ, ఇటు తెలంగాణలోనూ బాలుడు కోసం జల్లెడ పట్టిన పోలీసులు బాలుడు మిర్యాలగూడ ప్రాంతంలో ఉన్నట్టు గుర్తించారు.

తల్లిదండ్రులకు అప్పగింత

తల్లిదండ్రులకు అప్పగింత

ఇక ఆ బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో మొత్తమ్మీద ఏపీలో తొలి జీరో ఎఫ్ఐఆర్ నమోదు కావడం తొలి కేసును పోలీసులు ఎంతో బాధ్యతగా పరిష్కరించి విజయం సాధించడం కూడా జరిగిపోయింది. పోలీసులు బాధ్యతాయుతంగా, ఏమాత్రం నిర్లక్ష్యం వహించకుండా పని చేస్తే చాలావరకు నేర నియంత్రణ జరుగుతుందనే భావన ప్రజల్లో ఉంది.

English summary
The first Zero FIR was registered in Krishna District Nandigama Subdivision after the government decided to register the Zero FIR irrespective of jursdiction. FIR has been lodged in connection with the kidnapping case of a Rangapuram boy in Veerulapadu zone. The boy's father Ravinayak has lodged a complaint with the Kanchikacharla police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X