చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిత్తూరులో దారుణం: బాలికపై 4నెలలుగా ఐదుగురు మైనర్ల అఘాయిత్యం!

|
Google Oneindia TeluguNews

చిత్తూరు: ఓవైపు ప్రభుత్వం 'ఆడపిల్లకు రక్షణగా కదులుదాం' అంటూ కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంది. మరోవైపు అత్యాచార ఘటనలకు మాత్రం బ్రేక్ పడటం లేదు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన దాచేపల్లి అత్యాచార ఘటన తర్వాత అనేక అత్యాచార ఘటనలు తెరపైకి వచ్చాయి. తాజాగా చిత్తూరు జిల్లా పుంగనూరులో మరో అమానుషం బయటపడింది. మైనర్ బాలురు ఓ మైనర్ బాలికపై నెలల తరబడి అత్యాచారం చేస్తూ వస్తున్న ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

ఇంతకీ ఏమైంది?:

ఇంతకీ ఏమైంది?:

భర్త చనిపోవడంతో బతుకుదెరువు నిమిత్తం గతేడాది కూతురు(11)తో కలిసి ఓ మహిళ పుంగనూరు వచ్చి స్థిరపడింది. పట్టణంలోని భగత్‌సింగ్‌ కాలనీలో వీరు నివాసం ఉంటున్నారు.

ఇదే క్రమంలో కాలనీకి చెందిన 15ఏళ్ల ఓ బాలుడితో బాలికకు పరిచయం ఏర్పడింది. దాన్ని ఆసరాగా చేసుకుని బాలుడు ఆమెను ఆకర్షించాడు. మూడు నెలల క్రితం తన సెల్‌ఫోన్‌లో అశ్లీల చిత్రాలు చూపించి లొంగదీసుకున్నాడు.

బాలికను లొంగదీసుకుని..:

బాలికను లొంగదీసుకుని..:

బాలికను లొంగదీసుకున్న విషయాన్ని మరో నలుగురు స్నేహితులతో చెప్పిన ఆ బాలుడు.. ఆపై వారికీ సహకరించేలా బాలికను బెదిరించాడు. అంతా కలిసి రెండు నెలలుగా ఆమెపై అత్యాచారం చేస్తున్నారు. విషయం బయటకు పొక్కితే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని ఆమెను బెదిరించారు.

ఇలా వెలుగులోకి:

ఇలా వెలుగులోకి:


ఓరోజు బాధిత బాలిక పట్ల స్థానిక బాలుడు అసభ్యకరంగా ప్రవర్తిస్తుండటాన్ని మరో బాలుడు గమనించాడు. వెంటనే ఆమె తల్లికి చెప్పడంతో దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులు గత నాలుగు నెలలుగా బాలికపై లైంగిక దాడికి పాల్పడుతున్నట్టు తేలింది. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేసింది.

వాళ్లంతా పెద్దగా చదువుకోనివారే:

వాళ్లంతా పెద్దగా చదువుకోనివారే:

బాలికపై అత్యాచారానికి పాల్పడిన మైనర్ నిందితులెవరూ పెద్దగా చదువుకోలేదని గుర్తించారు. తల్లిదండ్రులు కూలీ పనులకు వెళ్తుండటంతో.. ఇంటి వద్ద అల్లర చిల్లరగా తిరుగుతున్నారు. తల్లిదండ్రులు వారిపై దృష్టికి పెట్టకపోవడంతో ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. కాగా, నిందితులు మైనర్లు కావడంతో వారిని తిరుపతిలోని జువైనల్ హోంకు తరలించారు. బాధిత బాలికను వైద్య పరీక్షల నిమిత్తం పలమనేరు ఆసుపత్రికి తరలించారు. ఘటనపై దర్యాప్తు జరుగుతోంది.

గ్యాంగ్ రేప్ కాదన్న పోలీసులు:

గ్యాంగ్ రేప్ కాదన్న పోలీసులు:

ఘటనపై స్పందించిన పోలీసులు.. ఇది గ్యాంగ్ రేప్ ఘటన కాదని చెప్పారు. వారికి అటువంటి అవగాహన కూడా లేదని, తెలిసీ తెలియని తనంతో నేరానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. నిందితులపై పోక్సో చట్టం, నిర్భయ చట్టాల కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఆడపిల్లలకు రక్షణగా కదులుదాం కార్యక్రమం ప్రస్తుతం జిల్లాలోను జరుగుతున్నట్టు చెప్పారు.

English summary
The Palamaner sub-division police on Thursday took five minor boys into custody for their alleged sexual assault on a 12-year-old girl in Punganur. About 50 police personnel from Palamaner and Punganur were pressed into action to make the arrests from Wednesday midnight till the early hours of Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X