• search
  • Live TV
అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

స్నేహం పేరుతో ఏడాదిగా బాలికపై లైంగిక దాడి, మద్యం తాగించి గ్యాంగ్ రేప్

By Narsimha
|

అమరావతి:విజయవాడలో స్నేహం ముసుగులో ఓ బాలికపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు నిందితులు.ఫేస్ బుక్ ద్వారా పరిచయం పెంచుకొని మద్యం తాగించి గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు నిందితులు.ఈ ఘటన విజయవాడలో చోటుచేసుకొంది.

ఏడాదిగా ఆ అమ్మాయిపై అత్యాచారం చేస్తున్నాడు.మరో స్నేహితుడితో కలిసి అదే అమ్మాయిని ఊరి బయటకు తీసుకెళ్ళారు. ఇద్దరూ కలిసి బీరు, కల్లు తాగారు. ఆ అమ్మాయికి కూడ తాగించారు. తర్వాత రోడ్డుపై ఒంటరిగా వదిలేశారు. రోడ్డుపై తూలుతూ నడుస్తున్న అమ్మాయిని ఇంటి దగ్గర దింపుతామని నలుగురు కుర్రాళ్ళు బైక్ పై ఎక్కించుకొన్నారు.

మద్యం మత్తులో ఉన్న యువతిపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. విజయవాడలోని గుణదల ప్రాంతానికి చెందిన అఖిల్ హోటల్ మేనేజ్ మెంట్ చదువుతున్నాడు. అమ్మాయిలను మాయమాటలు చెప్పి లోబర్చుకోవడం అతనికి వెన్నతో పెట్టిన విద్య.ఇటీవలే ఫేస్ బుక్ ద్వారా ఆ అమ్మాయితో పరిచయం పెంచుకొన్నాడు.

ఈ నెల 16న, అఖిల్, అజయ్ లు కలిసి ఆ అమ్మాయిని నగర శివార్లలోని ముస్తాబాద్ కు తీసుకెళ్ళారు. ఉదయం నుండి సాయంత్రం వరకు అక్కడ ప్రధాన రహదారికి పక్కనే ఉన్న ఓ వేపచెట్టుకింద గడిపారు. వీరిద్దరూ బీరు, కల్లు తాగారు. వాటిని కూడ ఆ అమ్మాయితో తాగించారు. రాత్రి 7 గంటల తర్వాత ఆమెను బైక్ పై తీసుకొచ్చి భీఆర్టీఎస్ రోడ్డుమీద వదిలిపెట్టి వెళ్ళిపోయారు.

Five persons arrested for gang rape on a girl in Vijayawada

జనసంచారం లేని ప్రాంతంలో ఒంటరిగా తూలుతూ నడుస్తున్న అమ్మాయిని శ్రీకాంత్ అభిషేక్, సునీల్, పవన్ కళ్యాణ్ లు గమనించారు. గుణదలలోని ఇంట్లో దిగబెడతామంటూ బైక్ పై ఎక్కించుకొన్నారు. వారధికి అవతలివైపున ఉన్న మద్యం దుకాణం వద్దకు తీసుకెళ్ళారు.

బీర్లు కొనుగోలు చేశారు. అభిషేక్ ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడు. తల్లి, తండ్రి ఇద్దరూ చనిపోయారు. దీంతో అమ్మాయిని అభిషేక్ ఇంటికి తీసుకెళ్ళారు. రాత్రంతా ఒకరి తర్వాత మరోకరు అత్యాచారం చేశారు. మరునాడు ఉదయం ఆమెను ఏపీ 16 సీఈ 4880 డిస్కవరీ బైక్ పై గుణదల వద్ద వదిలివెళ్ళారు. రాత్రంతా ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు తిడతారని అక్కడి నుండి నాన్నమ్మ ఇంటికి వెళ్ళింది ఆ యువతి.

అదే సమయంలో బైక్ నంబర్ ను గుర్తు పెట్టుకొంది. జరిగిన విషయాన్ని నాన్నమ్మకు చెప్పింది. ఆ తర్వాత తండ్రి పోలీసులకు ఫోన్ చేసి తన కూతురిపై నలుగురు అత్యాచారానికి పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు.

టెక్నాలజీ ఆధారంగా నిందితులను పట్టుకొన్నారిలా

విజయవాడ పోలీసులు ఇటీవలే డాష్ బోర్డును వినియోగంలోకి తీసుకొచ్చారు. ఆ శాఖ అంతర్గత సమాచారంతో పాటు కేసులు, నేరగాళ్ల వివరాలు, వేలిముద్రలు, కేసులు, తీర్పులు నగరంలో ఉన్న వాహానాల నెంబర్లు , వాటి యజమానుల చిరునామాలు పూర్తి సమాచారం అందుబాటులో ఉంచారు. నిందితులు వాడిని ఏపీ 16 సీఈ 4880 నెంబర్ ను చెక్ చేయగానే శ్రీకాంత్ చిరునామా ప్రత్యక్షమైంది. దీంతో పాటుగా సీసీ కెమెరాల పుటేజీని పరిశీలించారు.

అఖిల్, అజయ్ కలిసి అమ్మాయితో పీవీపీ మాల్ దగ్గర బయలుదేరినప్పటి నుండి అదే అమ్మాయిని మరో నలుగురు యువకులు తీసుకెళ్ళడం దాకా దారిపోడవునా ఉన్న సీపీ టీవీ కెమెరాల్లో ఈ దృశ్యాలన్నీ రికార్డయ్యాయి. ఇంటర్నెట్ కేఫ్ వద్ద శ్రీకాంత్ ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా, అభిషేక్, సునీల్, పవన్ కళ్యాణ్ పేర్లు బయటకు వచ్చాయి. ఇక బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలంతో అఖిల్ ను అరెస్టు చేశారు. బాధఇతురాలతో ఉన్న పరిచయం ముసుగులో ఏడాదికాలంగా ఆమెను లైంగికంగా ఉపయోగించుకొంటున్నాడని తేలడంతో అఖిల్ పై కేసు పెట్టారు.

బాధితురాలు మైనర్ కావడంతో 376 (డి), 366, 34 ఐపీసీ తో పాటు పోస్కో చట్టంలోని 6 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితులు రిమాండ్ లో ఉండగానే న్యాయస్థానంలో చార్జీషీట్ దాఖలు చేస్తామని డిప్యూటీ కమిషనర్ పాలరాజు చెప్పారు.అఖిల్ సెల్ ఫోన్ ను పరిశీలిస్తే అతడు కొంతమంది అమ్మాయిలతో రాసలీలలు జరిపిన దృశ్యాలు కన్పించాయి.

English summary
Five persons arrested for gang rape on a girl in Vijayawada . Victim family complaint against six members.this incident happend on May 16th.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X