గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గుంటూరులో విషాదం: విరుచుకుపడ్డ వీధికుక్కలు.. బాలుడు మృతి

గుంటూరు నగర శివారులోని అడవితక్కెళ్లపాడులో వీధి కుక్కలు రెచ్చిపోయాయి. ఐదేళ్ల బాలుడిపై మూకుమ్మడిగా విరుచుకుపడి అతని ప్రాణాలు బలిగొన్నాయి. కుక్కల దాడి ఘటన గుంటూరులో కలకలం రేపింది.

|
Google Oneindia TeluguNews

గుంటూరు: గుంటూరు నగర శివారులోని అడవితక్కెళ్లపాడులో వీధి కుక్కలు రెచ్చిపోయాయి. ఐదేళ్ల బాలుడిపై మూకుమ్మడిగా విరుచుకుపడి అతని ప్రాణాలు బలిగొన్నాయి. కుక్కల దాడి ఘటన గుంటూరులో కలకలం రేపింది.

వివరాల్లోకి వెళ్తే..రాజీవ్‌ గృహకల్ప సముదాయం వద్ద బాలుడు ఆడుకుంటుండగా కుక్కలన్ని ఒక్కసారిగా అటు వైపు వచ్చాయి. బాలుడు కిందపడటంతో అతని మీద పడి దాడి చేశాయి. బాలుడి ఆర్తనాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. కుక్కల దాడి అనంతరం కదల్లేని స్థితిలో ఉన్న బాలుడిని చూసి స్థానికులు అతని తల్లిదండ్రులకు సమాచారం అందించారు.

five years old boy dies after dogs attack

తల్లిదండ్రులు బాలుడిని చికిత్స నిమిత్తం హుటాహుటిన గుంటూరు నగరంలోని జేజేహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ బాలుడు మృతి చెందాడు. దీంతో బాలుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. కాగా, గతంలోను గుంటూరులో కుక్కల దాడులు అనేకం చోటు చేసుకున్నాయి. గతంలో ఒక పాపపై దాడి చేసి ఆమె మృతికి కారణమయ్యాయి.

English summary
A 5-years-old boy was died after dogs attack on him, incident took place in Gunturu district on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X