మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిమజ్జనంలో అపశ్రుతి: ఐదుగురు యువకుల మృతి

|
Google Oneindia TeluguNews

 Five youth allegedly fell in water in various incidents and died
కరీంనగర్/మెదక్/నల్లగొండ: తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్, మెదక్, నల్లగొండ జిల్లాల్లో జరిగిన వినాయక నిమజ్జనాల సందర్భంగా ఐదుగురు యువకులు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే... కరీంనగర్ జిల్లా, జమ్మికుంటలో సోమవారం రాత్రి వినాయక నిమజ్జనం చేస్తుండగా మానేరు వాగులో నగురం గ్రామానికి చెందిన చింతలపల్లి సంజీవరావు (30), పోల్సాని శ్రావణ్ కుమార్ (26), మండ రవి (27) అనే ముగ్గురు మృతి చెందారు.

మానేరు వాగులో ఇసుక కోసం తీసిన లోతైన క్వారీలో పడి వీరు మృతి చెందారు. విగ్రహం పట్టుకున్న వారు కొందరు వినాయకుడిని వదిలిపెట్టి ఈదుకుంటూ బయటపడ్డారు. ఆ గుంతలో ప్రవాహం ద్వారా సుడులు తిరగడంతో మృతులు సంజీవరావు, శ్రావణ్, రవి నీట మునిగి బయటికి తేలలేదు. అర్ధరాత్రి రెండు గంటల వరకు వారికోసం గాలించినా ఎంతకూ వారు కనపడలేదు. ఉదయం గ్రామస్థులంతా సంఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చేపట్టేసరికి ఆ ముగ్గురు ఇసుక గుంతలో పడి మృతి చెంది కనిపించారు.

మరో ఘటన మెదక్ జిల్లా కోంటూరు పెద్దచెర్వులో చోటు చేసుకుంది. మెదక్ న్యూమార్కెట్ శివాలయం వద్ద ప్రతిష్ఠించిన వినాయకుడి నిమజ్జనానికి మండలంలోని పెద్ద చెర్వుకు తరలించగా, అక్కడ క్రేన్ లేకపోవడంతో ట్రాక్టర్‌ను చెరువులోకి దించి వినాయకుడిని నీటిలోకి తోసేయగా వెనుకభాగంలో ఉన్న శివకుమార్(22)పై పడింది. దీంతో అతని తలకు తీవ్రగాయమై నీటిలో మునిగి మృతి చెందాడు.

నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్‌లో ఉప్పల్‌కు చెందిన కావేరి రామరాజు(28) 15మందితో సాగర్‌లో నిమజ్జనం కోసం వచ్చాడు. కాగా, ప్రమాదవశాత్తు డ్యాం దిగువ భాగాన కుడివైపున విద్యుత్ ఉత్పత్తి ద్వారా కృష్ణాడెల్టాకు వెళ్తున్న నీటి ప్రవాహంలో మునిగిపోయి మృతి చెందాడు.

English summary
Five youth allegedly fell in water in various incidents and died.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X