వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైసీపీ ఎంపీల రాజీనామా, స్పీకర్ సూచన: సభలోనే టీడీపీ ఎంపీలు, జగన్ సవాల్

|
Google Oneindia TeluguNews

Recommended Video

లోకసభ నిరవధిక వాయిదా పడటంతో వైసీపీ ఎంపీల రాజీనామా!

న్యూఢిల్లీ: పార్లమెంటు ఉభయ సభలు వాయిదా పడిన అనంతరం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలు రాజీనామాలను స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు సమర్పించారు. ఏపీకి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ వారు రాజీనామాలు ఇచ్చారు.

రాజీనామాలపై పునరాలోచన చేయాలని వైసీపీ ఎంపీలకు స్పీకర్ సుమిత్రా మహాజన్ సూచించారు. సభలోనే ఉండి పోరాటం చేయాలని సూచించారు. అయితే తమ రాజీనామాలను ఆమోదించాలని వారు స్పీకర్‌ను కోరారు. రాజీనామా అనంతరం వారు ఏపీ భవన్ వెళ్లి ఆమరణ నిరాహార దీక్షలో కూర్చోనున్నారు.

 Five YSR Congress Party MPs resign over AP spl status issue

మరోవైపు, తెలుగుదేశం పార్టీ ఎంపీలు సభలోనే కూర్చున్నారు. సభ వాయిదా పడినప్పటికీ వారు లోపలే కూర్చొని వీ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. వారు రెండు రోజులుగా ఇలా నిరసన తెలుపుతున్నారు.

టీడీపీకి జగన్ సవాల్

ఇచ్చిన హామీ ప్రకారం తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేశారని వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. టీడీపీ ఎంపీలకు దమ్ముంటే రాజీనామా చేయాలన్నారు. ప్రత్యేక హోదాపై చిత్తశుద్ధి ఉంటే తమతో కలిసి రావాలని సూచించారు. అలాగే, తమతో కలిసి రానందున రెండో అఖిల పక్షానికి హాజరు కావొద్దని వైసీపీ నిర్ణయించింది.

English summary
Five YSR Congress Party MPs resign over AP spl status issue. Gave resignation letters to speaker Sumitra Mahajan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X