వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జాతీయ రహదారులపై వరద ప్రభావం .. హైదరాబాద్ - విజయవాడ హైవే తోపాటు పలు చోట్ల ట్రాఫిక్ జామ్

|
Google Oneindia TeluguNews

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. వర్షాలు , వరదల కారణంగా వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. మరో మూడు రోజుల పాటు వర్షాలు వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. వర్షాల ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రాంతాలలో ప్రజలను అత్యవసరమైతే మినహాయించి ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు . కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసి వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

ఏపీలో వర్ష బీభత్సం .. తక్షణం ఆదుకోవాలని సీఎం జగన్ కు చంద్రబాబు లేఖఏపీలో వర్ష బీభత్సం .. తక్షణం ఆదుకోవాలని సీఎం జగన్ కు చంద్రబాబు లేఖ

 హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్

హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం కారణంగా జాతీయ రహదారులు సైతం వరద దిగ్బంధంలో చిక్కుకున్నాయి . హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. జాతీయ రహదారిపై కి కూడా నీరు వచ్చి ఉధృతంగా ప్రవహిస్తున్న నేపద్యంలో హైదరాబాద్ శివారు అబ్దుల్లాపూర్ మెట్ సమీపంలో సుమారు 10 కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.

 హైవే లపై కూడా వరదనీరు .. వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బంది

హైవే లపై కూడా వరదనీరు .. వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బంది

జాతీయ రహదారిపై వరదనీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో వాహనాలు ముందుకు కదిలే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో దాదాపు మూడు గంటలపాటు ట్రాఫిక్ స్తంభించినట్లుగా తెలుస్తుంది. అసలు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు మధ్య బస్సు సర్వీసులు నడవకపోవడంతో ప్రయాణం చేయదలుచుకున్న వారంతా సొంత వాహనాలలోనో , ఇతర రవాణా సాధనాల ద్వారానో ప్రయాణం చేస్తున్న పరిస్థితి ఉంది.అంతేకాదు హైదరాబాద్ కర్నూల్ హైవే పై, అలాగే హైదరాబాద్ గుంటూరు హైవేపై కూడా వరద ప్రవాహం ఉధృతంగా ఉంది. దీనితో వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది.

 రహదారులపై విరిగిపడుతున్న చెట్లు .. కొనసాగుతున్న వర్ష బీభత్సం

రహదారులపై విరిగిపడుతున్న చెట్లు .. కొనసాగుతున్న వర్ష బీభత్సం

జాతీయ రహదారిపై విపరీతంగా నీరు రావడంతో వాహనాలు నిదానంగా రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపుసత్తుపల్లి-ఖమ్మం జాతీయ రహదారిలో వరదనీరు ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయమేర్పడింది. కొన్ని ప్రాంతాల్లో వాహనాలు బోల్తాపడ్డాయి. రహదారుల వెంట చెట్లు విరిగిపడి రాకపోకలు స్తంభించాయి. వర్షంతో పాటు భారీగా ఈదురు గాలులు వీస్తుండటంతో అధికారులు, విపత్తు నివారణా సిబ్బంది రంగంలోకి దిగారు. జాతెయ రహదారుల మీద విరిగిపడుతున్న చెట్లను తొలగిస్తూ వాహన రాకపోకలకు అంతరాయం లేకుండా చూస్తున్నారు .

Recommended Video

#Floods: Heavy Rains - Water Logging in Hyderabad భారీ వర్షం.. తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం

English summary
National highways were also blocked by floods due to heavy rains. Hyderabad - Vijayawada National Highway, vehicles were stopped for kilometers. Motorists are having a hard time with this. Vehicles came to a standstill for about 10 km near the Abdullapur Met in the suburbs of Hyderabad on the backdrop of rushing water on the national highway.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X