వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గోడెలెక్కిన మంత్రులు..వరద నీటితో తేలియాడుతూ: గవర్నర్ ఏరియల్ సర్వే..సాయం ముమ్మరం..!!

|
Google Oneindia TeluguNews

ఎగువన కృష్ణా నది పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో వరద ప్రభావం తీవ్ర స్థాయిలో ఉంది. శ్రీశైలం, నాగార్జున సాగర్‌, ప్రకాశం బ్యారేజీలు నిండుకుండలా మారాయి. అయితే ఎగువ నుంచి భారీ వరదను వదలడంతో ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణానది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ప్రాజెక్టు దిగువ పలు గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి. దీంతో పలుగ్రామాల్లోని ప్రజలు నిరాశ్రయులయ్యారు. వరద పోటెత్తడంతో అధికారులు ఇప్పటికే హై అలర్డ్‌ ప్రకటించారు. కృష్ణా జిల్లాలో 12 మంది గ్రామాలు నీట మునగడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ముంపు ప్రాంతాలను గవర్నర్ ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. మంత్రులు క్షేత్ర స్థాయిలో పర్యటించి..సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

రెండు జిల్లాల్లో వరద ప్రభావం...

రెండు జిల్లాల్లో వరద ప్రభావం...

ఎగువన కృష్ణా నది పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో వరద పోటెత్తుతోంది. కృష్ణా ..గుంటూరు జిల్లాల్లో అనేక ప్రాంతాలు వరద కారణంగా నీట మునిగాయి. ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణానది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ప్రాజెక్టు దిగువ పలు గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి. దీంతో పలుగ్రామాల్లోని ప్రజలు నిరాశ్రయులయ్యారు. వరదల్లో చిక్కుకున్న వారి కోసం ప్రత్యేకంగా పునారావాస కేంద్రాలను కూడా అధికారులు ఏర్పాటు చేశారు. ప్రకటించారు. వరద నేపథ్యంలో రెండు జిల్లాల్లోనూ సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరదను ఎప్పటికప్పడు అంచనా వేస్తూ అధికారులు మందుజాగ్రత్తగా సహాయక చర్యలు చేపడుతున్నారు. పామర్రు నియోజకవర్గంలో 9లంక గ్రామాలు పూర్తిగా జలమయ్యం అయ్యాయి. దీంతో ఆయా గ్రామాల్లో గల 4000 మంది జనాభాను పునారావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. వరద పెరిగే అవకాశం ఉండడంతో చర్యలను మరింత వేగవంతం చేయాలని మంత్రి అనిల్‌ ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

గవర్నర్ ఏరియల్ సర్వే..

గవర్నర్ ఏరియల్ సర్వే..

కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాలను శనివారం గవర్నర్‌ బిస్వభూషన్‌ హరిచందన్‌ ఏరియల్‌ సర్వే ద్వారా పర్యవేక్షించారు. పర్యవేక్షించారు. కృష్ణా నదిలో వరద ప్రవాహం, నీట మునిగిన లంక గ్రామాలను పరిశీలించారు. వరద నివారణ చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. రెండు జిల్లాల అధికారులు గవర్నర్ కు వరద పరిస్థితి పైన నివేదించారు. రెండు జిల్లాల్లోనూ ఫైర్‌, ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది బృందాలుగా ఏర్పడి​ బోట్ల ద్వారా సాయాన్ని అందిస్తున్నారు.వరద ముంపు ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలతో పాటు మెడికల్‌ క్యాంపులు కూడా ఏర్పాటు చేశారు. కృష్ణా జిల్లాలో 12 మంది గ్రామాలు నీట మునగడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఎగువ నుంచి వస్తున్న వరదను ఎప్పటికప్పడు అంచనా వేస్తూ అధికారులు మందుజాగ్రత్తగా సహాయక చర్యలు చేపడుతున్నారు. వరదలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు 10 బోట్లకు పైగా సిద్ధం చేసినట్లు అక్కడి అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు పెనమలూరు పార్థసారథి, కైకలూరులో అనిల్‌కుమార్, అవినగడ్డలో సింహాద్రి రమేష్, మంగళగిరిలో ఆర్కే, నందిగామలో డాక్టర్‌ జగన్‌మోహన్‌రావు, విజయవాడలో మల్లాది విష్ణులు పర్యటించారు.

వరద నీటిలో..గోడెలక్కి మంత్రుల కష్టాలు..

వరద నీటిలో..గోడెలక్కి మంత్రుల కష్టాలు..

వదర ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు పర్యటనలు కొనసాగుతున్నాయి. అధికారలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ.. బాధితులకు అండగా నిలుస్తున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాలో ఆయా నియోజకవర్గాల్లోని మంత్రులు, ఎమ్మెల్యేలు క్షత్రస్థాయిలో పర్యటనలు చేస్తూ.. సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు. పలు ప్రాంతాల్లో వరద బాధితులకు మంచినీళ్లు, ఆహారం అందిస్తూ.. బాధితులను ఆదుకుంటున్నారు. నది ముంపు ప్రాంతాలైన భుపేష్ గుప్తా నగర్, కృష్ణ లంక, బాలాజీ నగర్ ప్రాంతాల్లో ఇళ్లలోకి భారీ ఎత్తున వరద నీరు చేరుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముంపు ప్రాంతాల్లో మంత్రులు కొడాలి నాని, అనిల్‌ కుమార్‌ యాదవ్‌, వెల్లంపల్లి శ్రీనివాస్‌, పేర్ని నాని పర్యటించారు. వరదల్లో చిక్కుకున్న బాధితులను వెంటనే పునారావాస ప్రాంతాలకు తరలించాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అవనిగడ్డ.. నూజివీడు ప్రాంతాల్లో వరద నీటిలోనే మంత్రులు పర్యటన చేసారు. వరద నీరు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మంత్రులు అనిల్..కొడాలి నాని గోడలెక్కి సహాయ చర్యలను పర్యవేక్షించారు.

English summary
Flood resque and releif opertations speed up in Krishna and Guntur dists. Governor Arelad survey in flood effected areas. Ministers monitoring releif measures in Krishna dist.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X