కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్సార్ మరణించిన నెల రోజులకు : కర్నూలులో హై అలర్ట్ : దశాబ్దం క్రితం.. తిరిగి నేడు..!

|
Google Oneindia TeluguNews

కర్నూలు లో సరిగ్గా దశాబ్దం క్రితం నాటి పరిస్థితి కనిపిస్తోంది. 2009 నాటి చేదు అనుభవాలు మళ్లీ తప్పదా అనే అందోళన మొదలైంది. తాజాగా కర్నూలుకు వరద ముప్పు పొంచి ఉన్నట్లు కనిపిస్తోంది. అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. తుంగభద్రలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో తుంగభద్ర బోర్డు అధికారులు కర్నూలులోని ముంపు ప్రాంత ప్రజలకు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

2009 అక్టోబర్ 2న...కర్నూలులో

2009 అక్టోబర్ 2న...కర్నూలులో

సరిగ్గా దశాబ్దం క్రితం 2009లో సెప్టెంబర్ 2న ముఖ్యమంత్రి వైయస్సార్ హెలికాఫ్టర్ ప్రమాదంలో కర్నూలు జిల్లా పరిధిలో నల్లకాల్వ దగ్గర మరణించారు. సరిగ్గా నెల రోజులకు అక్టోబర్ 2, 2009లో కర్నూలు నగరం లో చరిత్రలో మర్చిపోలేని రోజు. కర్నాలు వాసులకు కాళరాత్రి. తుంగభద్ర వదర నీరు కర్నూలు నగరాన్ని ముంచెత్తింది. మంత్రాలయం మొత్తం మునిగిపోయింది. కర్నూలు నగరం వదర నీరు..బురద మట్టితో మునిగిపోయింది. ఆ సమయంలో ముఖ్యమంత్రి రోశయ్య..రెవిన్యూ మంత్రి ధర్మాన ప్రసాద రావు సచివాలయంలోనే రాత్రి బస చేసారు. అధికారులను అప్రమత్తం చేసారు. వైయస్సార్ మరణం నుండి నాడు ఏపీ ఇంకా కోలుకోలేదు. నాటి అనుభవాలు ఇంకా కర్నూలు వాసులు మర్చిపోలేదు. తిరిగి ఇప్పుడు మరో సారి హెచ్చరికలు. గుర్తుకొస్తున్నాయి. కర్నూలు మళ్లీ మునిగిపోతుందా అని భయపడుతున్నారు. తుంగ భద్రలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో తుంగభద్ర బోర్డు అధికారులు కర్నూలులోని ముంపు ప్రాంత ప్రజలకు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలన్నారు.

పొంచి ఉన్న వరద ముప్పు..

పొంచి ఉన్న వరద ముప్పు..

కర్నాటక నుండి వస్తున్న వరద నీటిని తట్టుకోవటానికి తుంగభద్ర డ్యామ్ గేట్లు ఎత్తి 50వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేయనున్నారు. దీంతో కర్నూలుకి వరద ముప్పు పొంచి ఉంది. కర్నాటకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎగువ నుంచి వరద నీరు డ్యామ్ లోకి వచ్చి చేరుతోంది. దీంతో ముందు ముందు లక్ష క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసే ఛాన్స్ ఉంది. తుంగభద్ర డ్యామ్ లోకి 2.1 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. డ్యామ్ కెపాసిటీ 100.84 టీఎంసీ అడుగులు. ప్రస్తుతం 76.37 టీఎంసీ అడుగుల నీరు ఉంది. 2009లో కర్నూలుని వరదలు ముంచెత్తాయి. మళ్లీ అలాంటి పరిస్థితి వస్తుందా అని అంతా భయపడుతున్నారు. 2009లో వరద నీరు ముంచెత్తడంతో కర్నూలు మునిగిపోయింది. జూరాల నుంచి శ్రీశైలం వచ్చిన నీరు.. కర్నూలులోని జమ్మిచెట్టు ప్రాంతాన్ని తాకింది. మరోసారి అలాంటి పరిస్థితి వస్తుందా అని అధికారులు, ప్రజలు భయపడుతున్నారు. శ్రీశైలం డ్యామ్ ఇంజినీర్లు అప్రమత్తంగా ఉన్నారు.

సరిగ్గా 2009లో వచ్చిన వరద స్థాయిలోనే..

సరిగ్గా 2009లో వచ్చిన వరద స్థాయిలోనే..

10 ఏళ్ల తర్వాత ఈ స్థాయిలో వరదలు రావడం ఇదే తొలిసారి అని అధికారులు చెప్పారు. దశాబ్ద కాలంలో 2.1లక్షల క్యూసెక్కుల నీరు రావడం రికార్డ్. శ్రీశైలం డ్యామ్ కి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జూరాల నుంచి రికార్డ్ స్థాయిలో 5లక్షల 87వేల 420 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం డ్యామ్ కెపాసిటీ 885 అడుగులు. ప్రస్తుతం 883 అడుగుల వరకు నీరు ఉంది. ఈ డ్యామ్ కెపాసిటీ 215.81 టీఎంసీ అడుగులు. ప్రస్తుతం 204.78 టీఎంసీల అడుగుల నీరుంది. ప్రస్తుతం అధికారులు డ్యామ్ 10 గేట్లు ఓపెన్ చేశారు. 4లక్షల 25వేల 521 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్ కి వదిలారు. శ్రీశైలం ప్రాజెక్ట్ కి వరద ఉధృతి పెరుగుతోంది. శ్రీశైలం ప్రాజెక్ట్ 10 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో..ఇప్పుడు ప్రభుత్వం అప్రమత్తం అయింది. అధికారులకు అదేశాలు జారీ చేసింది. అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు సూచించింది.

English summary
Flood warning for Kurnool city. People of city remembering 2009 situation.On that time flood effected thousands of families. Now Officcers monitoring situation and taking necessary action.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X