వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అన్నవరంలో అన్యమత ప్రచారం: వైసీపీ పిచ్చి పీక్స్ లో: కన్నా లక్ష్మీనారాయణ

|
Google Oneindia TeluguNews

అమరావతి: భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మరోసారి అధికార వైఎస్ఆర్ కాంగ్రస్ పార్టీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అన్యమత ప్రచారాలు, ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ సచివాలయ కార్యలయాలకు వైఎస్ఆర్సీపీ రంగులు వేయడం వంటి చర్యలపై కొద్దిరోజులుగా విమర్శలు చేస్తోన్న ఆయన తాజాగా అలాంటి ఆరోపణలను గుప్పించారు. ప్రఖ్యాత పుణ్యక్షేత్రం అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయం పరిసరాల్లో అన్యమత ప్రచారం సాగుతోందని అన్నారు. భవానీ ఐలండ్ ప్రధాన ముఖ ద్వారంపై మేరీమాత చిత్రాన్ని ఎందుకు అమర్చారని నిలదీశారు.

ఆగ్రాకు ధీటుగా అయోధ్య మాస్టర్ ప్లాన్: ఎయిర్ పోర్ట్, క్రూయిజ్ రైడ్స్, హోటల్స్: కమర్షియల్ చేసేస్తారా?ఆగ్రాకు ధీటుగా అయోధ్య మాస్టర్ ప్లాన్: ఎయిర్ పోర్ట్, క్రూయిజ్ రైడ్స్, హోటల్స్: కమర్షియల్ చేసేస్తారా?

దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను ఆయన బుధవారం ఆయన తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అధికార వైఎస్ఆర్సీపీ నాయకుల పిచ్చి పరాకాష్టకు చేరిందని మండిపడ్డారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా అన్యమత ప్రచారం జరుగుతోందని, దీన్ని నియంత్రించడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలను తీసుకోవట్లేదని విమర్శించారు. వైఎస్సార్సీపీ నాయకులు రంగులు వేయడంలో బడిని, గుడిని వదల్లేదని ధ్వజమెత్తారు. అవకాశం ఉంటే ఇసుకకు, చివరికి ఇంద్రధనస్సుకు కూడా తమ పార్టీ రంగులను వేసేలా ఉన్నారని ఎద్దేవా చేశారు.

 Focus Key words: Bharatiya Janata Party, AP President Kanna Lakshminarayana

అన్నవరంలో సత్యదేవుని ఆలయ సమీపంలో అన్యమత ప్రచారం సాగుతోందని చెప్పారు. భవానీ ఐలండ్ లో ఆర్చిపై మేరీమాత చిత్రపటాన్ని అమర్చడం, భీమిలీ ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ లల్లో అన్యమత ప్రచారానికి సంబంధించిన సామాగ్రిని విక్రయానికి ఉంచారని అన్నారు. ఇవన్నీ ఎలాంటి వాతావరణానికి సంకేతాలు ఇస్తున్నాయని నిలదీశారు. భీమిలీ ఉత్సవ్ లో మతపరమైన స్టాల్స్ ఏర్పాటు వైఎస్సార్సీపీ నాయకుల మతవ్యాప్తిని సూచిస్తున్నాయని ఆరోపించారు. వాటన్నింటినీ నియంత్రించడానికి ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని డిామాండ్ చేశారు.

 Focus Key words: Bharatiya Janata Party, AP President Kanna Lakshminarayana
English summary
Bharatiya Janata Party Andhra Pradesh State president Kanna Lakshminarayana once again attacked on ruling YSR Congress Party in the issue of party's paint and coloring on Government building. He tweeted some photos in this connection.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X