కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

40 ఏళ్లుగా ఆమె ఆహారం "కాఫీ" మాత్రమే... యోగిని కాదు... కాలేజీ అధిపతి: నమ్మశక్యంగా లేదా?

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

కర్నూలు:సాధారణంగా ఆరోగ్యవంతమైన మనిషి ఆహారం తీసుకోకుండా ఎన్ని రోజులు ఉండగలడు...మహా అయితే ఓ 4,5 రోజులు...అదే ఏమైనా లిక్విడ్స్ ను తీసుకొంటూ ఉండమంటే అలా ఎన్ని రోజులు ఉంటాడు...ఇంకో వారం రోజులు...అంతేనా?...కానీ నేను మీకు ఇప్పుడు ఒక సంథింగ్ స్పెషల్ పర్సన్ ను పరిచయం చేయబోతున్నా!

ఈమె ప్రత్యేకత ఏంటంటే?...40 ఏళ్లుగా ఆమె ఎటువంటి ఘనాహారం తీసుకోవడం లేదు...కేవలం ఒకే ఒక లిక్విడ్ తో తన జీవనాన్ని సౌకర్యవంతంగా గడిపేస్తున్నారు. ఆ లిక్విడ్ కూడా మనకు తెలియనిదేదో కూడా కాదు...మనందరికీ చిరపరిచితమైన "కాఫీ"నే...ఆవిడ ఆహారం. కాఫీ తప్ప ఆహారంగా ఆమె మరేమీ తీసుకోరు... అలాగని ఆమె ఏ యోగిని నో అనుకునేరు...కానే కాదు...ఒక ఆదర్శవంతమైన గృహిణి...ఒక కాలేజీ కి అధిపతి కూడా...నమ్మశక్యంగా లేదా?...అయితే చదవండి....

పరిచయం...ప్రత్యేకత

పరిచయం...ప్రత్యేకత

ఈ సంథింగ్ స్పెషల్ పర్సన్ పేరు ఎస్‌.విజయలక్ష్మమ్మ...ఈమె వయసు 53 సంవత్సరాలు...ఈమె స్పెషాలిటీ...40 ఏళ్లుగా కేవలం కాఫీ తాగుతూ బతికేస్తుండటం... సపోర్ట్ గా ఇంకా ఏమైనా ఆహారం స్వీకరిస్తారంటే...ఛాన్సే లేదు...ఎందుకంటే ఆమెకి కాఫీ తప్ప ఇంక ఏమన్నా తినడం తాగడం అస్సలు ఇష్టం ఉండదు... బలవంతంగా తినిపించాలని చూసినా ఆమెకు చాలా ఇబ్బంది. అందుకే కేవలం కాఫీ నే ఆమె ఆహారం. అలాగని ఆమె కాఫీ తాగి ఓ మూల పడుకుంటారేమో అనుకుంటారేమో!...అదేం కాదు ఆమె భర్త అవసరాలు కనిపెట్టి అన్నింటిని అమర్చి పెట్టే ఒక ఆదర్శ గృహిణి...అంతేకాదు ఒక ఫార్మసీ కాలేజ్ అధిపతి కూడా!

పనిపాటలు...చాలా యాక్టివ్

పనిపాటలు...చాలా యాక్టివ్

కర్నూలులోని ఓ ఫార్మసీ కాలేజ్ అధిపతి అయిన ఎస్‌.విజయలక్ష్మమ్మ సొంతూరు కోవెలకుంట్ల సమీపంలోని కలుగొట్ల. విజయలక్ష్మి వయసు 50 దాటినా ఇటు ఇంట్లో గానీ...అటు కాలేజీలో గానీ పనిపాటుల్లో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఆహారం తీసుకునేది కేవలం ఒక్క కాఫీనే అయినా చలాకీగా పనిచేస్తారు. ఇంట్లోవాళ్లకి అంటే అలవాటయి పోయింది కాని కాలేజీలో వాళ్లు మాత్రం ఒక్క కాఫీనే తాగి అంత యాక్టివ్ గా ఎలా పనిచేస్తారబ్బా!...అని ఆశ్చర్యపోతుంటారు. ఒక బయటివాళ్లు మాత్రం ఈ విషయం తెలియడంతోనే 8 వింతను చూసినట్లు చూస్తుంటారు.

కాఫీనే ఆహారం...ఎందుకలా?

కాఫీనే ఆహారం...ఎందుకలా?

ఐదో తరగతి వరకు సొంతూరు కలుగొట్లలోనే చదివిన విజయలక్ష్మి అప్పట్లో అందరిలాగే తినేవారు. అయితే తమ ఊర్లో హైస్కూల్ లేకపోవడంతో ఆరో తరగతి కోసం పొరుగూరులో చేరడం ఆమె ఆహారపు అలవాటు పూర్తిగా మారిపోవడానికి కారణమైంది. హైస్కూల్ చదువు కోసం రోజూ మూడు కిలోమీటర్లు నడిచి రేవనూరు వెళ్లాలి. ఈ క్రమంలో పుస్తకాల సంచితోపాటు భోజనం క్యారేజీ కూడా మోసుకెళ్లాల్సి వచ్చేది. ఈ క్రమంలో ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. వీరింట్లో పాడిపశువులు సమృద్దిగా ఉండటంతో రోజూ ఉదయాన్ని చిక్కటి కాఫీ తాగే అలవాటు ఉంది. అప్పుడప్పుడూ క్యారేజ్ తీసుకెళ్లకుండా కాఫీ తాగి స్కూల్ కెళ్లడం మొదలుపెట్టిన విజయలక్ష్మికి అలా అలా అదే అలవాటుగా మారిపోయింది. దీంతో ఆ తరువాత ఆమె ఘనాహారం తీపుకోవడం పూర్తిగా మానేశారు. ఆకలైనప్పుడు కాఫీ నే తాగేవారు.

మార్చేందుకు...భర్త ప్రయత్నం

మార్చేందుకు...భర్త ప్రయత్నం

అలా పెళ్లీడు కొచ్చిన విజయలక్ష్మికి ఆమె కాఫీ మాత్రమే తాగుతుందని చెప్పకుండా పెళ్లి చేశారు. అయితే పెళ్లయ్యాక ఫుడ్ సీక్రెట్ తెలిసిన భర్త సుబ్బారెడ్డి ఆమెని అందరిలా ఆహారం తినిపించాలని ప్రయత్నించినా సాధ్యం కాలేదు. అయితే ఆమె అలవాటు...ఆరోగ్యం గురించి భయపడి ఎందుకైనా మంచిదని వైద్యులను సంప్రదిస్తే ఆమె ఆరోగ్యానికేం ఢోకా లేదని...ఆమె శరీర తత్వానికి కాఫీ సరిపోయిందని.. ఏం ఫర్వాలేదని...ఏమీ కాదని చెప్పారు. ఆ తరువాత ఇక భర్త కూడా ఆమె
ఆహారం గురించి ఆందోళన చెందలేదు. ప్రస్తుతం విజయలక్ష్మమ్మ రోజూ ఉదయం 5 గంటలకు లేచి తొలి కాఫీ తాగుతారు.ఆ తరువాత నుంచి గంటగంటకీ ఒక పెద్ద కప్పుతో కాఫీ తాగుతారు. ఇలా రోజూ రెండు లీటర్ల పాలతో 20-30 పైగా కప్పుల కాఫీ తాగుతారు.

వంట...బాగా చేస్తారు

వంట...బాగా చేస్తారు

విజయలక్ష్మమ్మకు దైవభక్తి ఎక్కువ. ఉదయం 4 గంటలకే లేచి పూజలు చేస్తారు. ఆపై భర్తతో కలిసి యోగా చేస్తారు. ఆ తరువాత కాఫీ టిఫిన్, కాఫీ భోజనం ఇలా సాగిపోతుంది. అయితే నాలుగు దశాబ్ధాలుగా కాఫీ తప్ప ఎలాంటి ఆహారం తీసుకోకపోయినా ఇప్పటివరకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాలేదు. తాను అన్నం ముట్టకపోయినా కలెక్టరేట్‌ ప్రజాదర్భార్‌కు వచ్చే వారికి ఉచితంగా భోజనం పెడతారు. ఎవరైనా అచ్చం కాఫీ నేనా మజ్జిగ తాగితే చలవచేస్తుందని చెప్పి తాగించాలని చూస్తే...మజ్జిగ తాగగానే తనకు కడుపులో మంట వస్తుందని చెప్పారామె. ఈమె ఫంక్షనల్లో కూడా ఏమీ ఆహారం తీసుకోరు...తప్పనిసరై తినాల్సివస్తే ఐస్‌క్రీం తిని వచ్చేస్తారు. ఎప్పుడూ ఆహారం ముట్టుకోని విజయలక్ష్మి భర్తకు మాత్రం శుభ్రంగా వండి పెడతారు. ఇదండీ ఈ కాఫీ మేడమ్ గారి స్పెషల్ లైఫ్ స్టయిల్.

English summary
Kurnool:Most people can survive without food for at least a few days, maybe a bit longer. Eventually, however, starvation kills. Yet the limits on how long people can go without eating are complicated; without water people are unlikely to last a week, but the amount of time starvation takes can vary drastically. Take the story of Vijayalakshmamma- for 40 years...this 53-year-old Kurnool lady ate nothing...but just drinks coffee only.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X