• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

దళితులు,మైనార్టీల ఓట్ల కోసం...టిడిపి కసరత్తు షురూ!

By Suvarnaraju
|

అమరావతి:వచ్చే సాధారణ ఎన్నికల్లో దళితులు,ముస్లింల ఓట్లు గతంలో కంటే ఎక్కువగా రాబట్టుకునే లక్ష్యంతో టిడిపి ప్రత్యేక కసరత్తు చేపట్టింది. ఎపిలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఈ వర్గాల ఓట్లు మరింత కీలకంగా టిడిపి భావిస్తోంది.

కేంద్రంలో బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు నుంచి తాము వైదొలగడం ద్వారా మైనార్టీలు ఎక్కువమంది తమ వెంటే అవకాశం ఉందని టిడిపి అంచనా వేసింది. అయితే వాస్తవ పరిస్థితులు తాము ఊహించినంత ఆశాజనకంగా లేవని టిడిపికి అంతర్గత సర్వేలు,నిఘా వర్గాల ద్వారా తెలిసిందట. ఈ క్రమంలో ఈ నెల 30 నుంచి దళిత తేజం-టిడిపి పేరుతో నెల్లూరులో కార్యక్రమం నిర్వహిస్తున్న తీరులోనే మైనార్టీల కోసం మరో ప్రత్యేక కార్యక్రమం చేపట్టనుందని సమాచారం.

 ఆ ఓట్ల కోసం...దిశా నిర్దేశం

ఆ ఓట్ల కోసం...దిశా నిర్దేశం

దళితుల ఓట్ల కోసం ఇప్పటికే చర్యలు ప్రారంభించిన టిడిపి ఇక మైనార్టీల ఓట్ల కోసం ప్రత్యేక చర్యలు ఆరంభించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. బిజెపితో

తెగతెంపులు చేసుకోవడం, ఆ పార్టీతో వైసిపి అంటకాగుతోందనే ప్రచారం ద్వారా ముస్లిం ఓటర్లు అత్యధికంగా తమ పార్టీకే మద్దతు పలుకుతారని ఆశించిన టిడిపికి క్షేత్ర స్థాయి పరిస్థితుల గురించి ఆరా తీస్తే అనుకున్నంత ఆశాజనకంగా లేవని తేలిందట. ఈ విషయమై వివిధ మార్గాల్లో సేకరించిన సమాచారంతో అప్రమప్తమైన టిడిపి దిద్దుబాటు చర్యలు చేపట్టేందుకు సమాయత్తమైందట.

 ముస్లింల...అసంతృప్తికి కారణాలు

ముస్లింల...అసంతృప్తికి కారణాలు

ముస్లిం జనాభా రాష్ట్రంలో గణనీయంగా ఉన్నప్పటికీ రాష్ట్ర మంత్రి వర్గంలో కనీసం వారి సామాజికవర్గానికి సంబంధించి ఒక్క మంత్రి కూడా లేకపోవడం మైనార్టీల్లో తీవ్ర అసంతృప్తికి కారణమైనట్లు నిఘా వర్గాల ఆరాలోనూ తేలిందట. అంతేకాకుండా వివిధ సందర్భాల్లో నామినేటెడ్‌ పోస్టుల భర్తీకి సంబంధించి పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న మైనార్టీ నేతలకు ఆశించిన పదవులు దక్కపోవడం కూడా ఆ సామాజిక వర్గంలో అసంతృప్తి పెరిగేందుకు దోహదపడిందని తెలిసిందట. దీంతో దిద్దుబాటు కోసం టిడిపి ఒక ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. ముస్లిం ఓటర్లను ఆకట్టుకునేందుకు గాను అన్నింటికంటే ముఖ్యంగా వారి సమస్యల పరిష్కారంపై ప్రధానంగా దృష్టి సారించాలని, వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని నియోజకవర్గ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేస్తున్నట్లు తెలుస్తోంది.

దిద్దుబాటు చర్యలు...దిశానిర్దేశం

దిద్దుబాటు చర్యలు...దిశానిర్దేశం

రాష్ట్రంలో దళితులు,ముస్లిం వర్గాలపై జరిగే ఏ దాడులను తేలిగ్గా తీసుకోరాదని, సామాజిక బహిష్కరణలు,మైనర్‌ బాలికలపై అత్యాచారాలు వంటివి చోటుచేసుకోవడం వంటివి టిడిపికి నష్టం కలిగించే అవకాశం ఉందని ఆ పార్టీలోని సీనియర్ నేతలు విశ్లేషించినట్లు తెలిసింది. ఆ క్రమంలో దిద్దుబాటు చర్యల్లో భాగంగా ఈనెల 30న నెల్లూరులో జరిగే దళిత తేజం మహాసభ ద్వారా దళిత వర్గాల్లో భరోసా కల్పించడం, టిడిపి ప్రభుత్వం వారికి అండగా ఉందనే సంకేతాలిచ్చే విధంగా కార్యక్రమాలు అమలుచేయడం వంటివి చేయాలని సిఎం పార్టీ శ్రేణులను ఆదేశించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అలాగే వైసిపి, బిజెపి, జనసేనల విమర్శలను ఏమాత్రం తేలిగ్గా తీసుకోకుండా వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టాలని పార్టీ నేతలను హెచ్చరించారట. ఈ విషయంలో అలక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని కూడా హెచ్చరించడం జరిగిందట.

వరుస కార్యక్రమాలు...షురూ

వరుస కార్యక్రమాలు...షురూ

గ్రామదర్శిని పేరుతో నేతలు ఇక పల్లెల బాట పట్టాలని, సాధికార మిత్రలతో నేతలు సమన్వయం చేసుకుంటూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పార్టీ అధిష్టానం నుంచి ఇప్పటికే మెచ్చరికలు అందినట్లు తెలుస్తోంది. సాధికార మిత్రలు ప్రతి 35 ఇళ్లకు తిరిగి వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం, వాటిని తక్షణమే పరిష్కరించడం ద్వారా ఓటు బ్యాంక్‌ను పెంచుకోవచ్చని...ప్రస్తుతానికి ఆ పని ఆవశ్యమని టిడిపి పెద్దలు భావనగా తెలిసింది. నేతలందరూ ఇకమీదట తరుచూ తనను కలిసేందుకు రావడం తగ్గించి...ప్రజాసమస్యల పరిష్కారానికి అత్యధిక ప్రాధానత్య ఇవ్వాల్సిందిగా చంద్రబాబు జిల్లాల వారీ సమీక్షల్లో నేతలను ఆదేశించినట్లు తెలిసింది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Amaravati: TDP has taken up special tasks with the objective to gain more Dalits and Muslim votes in the coming general election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more