వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్టీల్లో అంతర్గత చిచ్చులు : ఎన్నికల గుర్తు కోసం అనేక పోరాటాలు

ఎన్నికల గుర్తు ఎవరికి వస్తే రాజకీయంగా వారిదే పై చేయి అయ్యే అవకాశం ఉంది. గతంలో జరిగిన ఘటనలు దీన్ని రుజువు చేశాయి.అందుకే ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల గుర్తు కోసం తండ్రి, తనయులు పోటీ పడుతున్నారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ :సమాజ్ వాదీ పార్టీ ఎన్నికల గుర్తు సైకిల్ కోసం తండ్రీ తనయులు ఎన్నికల కమీషన్ వద్దకు తమ వాదనలు వినిస్తున్నారు. అయితే ఎన్నికల గుర్తు కోసం ఎందుకు వారిద్దరూ ఎందుకు పోటీపడుతున్నారు.ఎన్నికల గుర్తుకు అంత ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నారంటే ఆ గుర్తుకు అంతగా ప్రాధాన్యత ఉంటుంది. గతంలో ఇదే తరహలో పార్టీ ఎన్నికల గుర్తు కోసం గొడవలు జరిగిన సందర్భాలు కూడ ఉన్నాయి.

సమాజ్ వాదీ పార్టీ ఎన్నికల గుర్తు కోసం తండ్రి ములాయం సింగ్ యాదవ్, తనయుడు అఖిలేష్ యాదవ్ లు పోటీపడుతున్నారు.పార్టీ ఎన్నికల గుర్తు సైకిల్ కోసం ఇద్దరూ పోటీపడుతున్నారు. పార్టీ నాయకులంతా మెజారిటీగా అఖిలేష్ కు మద్దతుగా నిలిచారు.అయితే ఎన్నికల గుర్తు కోసం ఎన్నికల సంఘాన్ని ఇద్దరూ ఆశ్రయించారు.

సమాజ్ వాదీ పార్టీ తరహలోనే గతంలో ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కూడ తెలుగుదేశం పార్టీ ఎన్నికల గుర్తు కోసం ఎన్ టిఆర్ , చంద్రబాబుల మద్యలో కూడ ఇలానే గొడవ సాగింది, చివరకు చంద్రబాబు పై చేయి సాధించాడు.

ఎంజిఆర్ చనిపోయిన సమయంలో కూడ పార్టీ ఎన్నికల గుర్తు కోసం కూడ జయలలిత, ఎంజిఆర్ సతీమణి వర్గాలు కూడ ఇదే తరహలో గొడవలు పడ్డారు. అయితే ఎన్నికల గుర్తు దక్కినవారే చివరకు పై చేయి సాధించారు.

 ఎన్నికల గుర్తుకోసం ఎందుకు పోటీ

ఎన్నికల గుర్తుకోసం ఎందుకు పోటీ

దేశంలో ఎక్కువగా నిరక్షరాస్యులు ఉన్నారు.అయితే పార్టీ ఎన్నికల గుర్తు ఆదారంగా ఆయా పార్టీలకు ఓటర్లు ఓటుచేస్తారు.అయితే నిరక్షరాస్యులైన ఓటర్లకు ఎన్నికల గుర్తును తీసుకెళ్ళగలిగితే ఆ పార్టీకి ప్రయోజనం ఉంటుంది. అందుకే పార్టీ నాయకులు ఎన్నికల గుర్తు కోసం తీవ్రంగా పోటీపడుతుంటారు. దక్షిణ భారతదేశంలో ఎన్నికల గుర్తు కోసం పోటీ పడిన సందర్భాలు అనేకం ఉన్నాయి.అయితే ఉత్తర భారత దేశంలో ఎన్నికల గుర్తు కోసం సమాజ్ వాదీ పార్టీ నాయకులు గొడవ పడుతున్నారు. పార్టీలు చీలిన సమయంలో ఎన్నికల గుర్తును దక్కించుకొన్న నాయకులే ఎక్కువగా ప్రయోజనం పొందారు.

 టిడిపిలో సైకిల్ గుర్తు కోసం పోటీ

టిడిపిలో సైకిల్ గుర్తు కోసం పోటీ

1994 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ టి ఆర్ నేతృత్వంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. అయితే ఎన్ టి ఆర్ సతీమణి లక్ష్మీపార్వతి ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకొంటుందన్న కారణంగా ఎన్ టి ఆర్ ను పదవి నుండి తప్పించారు . చంద్రబాబు నాయకత్వంలో పార్టీ ఎంఏల్ఏలు తిరుగుబాటు చేశారు.అయితే ఆ సమయంలో ఎన్ టి ఆర్, చంద్రబాబునాయుడులు ఇద్దరూ కూడ పార్టీ ఎన్నికల గుర్తు కోసం పోటీ పడ్డారు.అయితే చివరకు ఎన్నికల గుర్తు చంద్రబాబుకే దక్కింది.

 రెండు ఆకుల గుర్తు కోసం కూడ పోటీ

రెండు ఆకుల గుర్తు కోసం కూడ పోటీ

1987 లో ఎం జి రామచంద్రన్ మరణించాడు.ఆయన భార్య జానకీ రామచంద్రన్ నేతృత్వంలో ఓ వర్గం, జయలలిత నేతృత్వంలో మరో వర్గం పార్టీ రెండు గ్రూపులుగా చీలిపోయింది. అయితే జయలలితకు మద్దతుగా ఉన్న 33 మంది ఎంఏల్ఏలను పార్టీ నుండి సస్పెండ్ చేసింది జానకీ రామచంద్రన్. అయితే అప్పటివరకు ఆమె ముఖ్యమంత్రిగా ఉన్నారు.దీంతో ఆమె ప్రభుత్వం పడిపోయింది. 1989లో జరిగిన ఎన్నికల్లో ఈ రెండు గ్రూపులు ఎన్నికల గుర్తు కోసం పోటీలు పడ్డాయి.అయితే ఎన్నికల కమీషన్ ఇద్దరికీ రెండు ఆకుల గుర్తును కేటాయించలేదు.జానకీ రామచంద్రన్ వర్గానికి జంటపావురాలు,జయలలిత వర్గానికి కోడిపుంజు గుర్తులు లభించాయి.అయితే ఈ ఎన్నికల్లో జానకీ రామచంద్రన్ వర్గం దెబ్బతింది.దీంతో ఆమె రాజకీయాలకు దూరమైంది.మరో వైపు జయలలిత రాజకీయాల్లో కొనసాగారు. జానకీ రామచంద్రన్ వర్గం కూడ జయలలితతో కలిపిసోయింది.

 డిఎంకె ఎన్నికల గుర్తు కోసం కూడ గొడవ

డిఎంకె ఎన్నికల గుర్తు కోసం కూడ గొడవ

డిఎంకె లో కూడ ఇదే తరహలో గొడవ సాగింది. డిఎంకె చీప్ కరుణానిధి తన వారసుడిగా స్టాలిన్ ను ప్రోత్సహించడాన్ని సహించలేని పార్టీ నాయకుడు వైగో( వై.గోపాలస్వామి) డిఎంకెను చీల్చే ప్రయత్నం చేశాడు. అయితే ఈ విషయాన్ని పసిగట్టిన డిఎంకె ఆయనను పార్టీ నుండి 1993 లో బహిష్కరించింది. ఎల్ టి టి ఈ సహకారంతో కరుణానిధిని చంపేందుకు ప్రయత్నించారనే ఆరోపణలతో ఆయనను పార్టీ నుండి బయటకు పంపారు.వైగోతో పాటు 9 జిల్లాల పార్టీ ల జిల్లాల కార్యదర్శులు ఆయనతో వెళ్ళారు. అయితే పార్టీ ఎన్నికల గుర్తు కోసం వైగో ఎన్నికల కమీషన్ ను ఆశ్రయించాడు.అయితే డిఎంకె పార్టీ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటుచేసి తీర్మానాలు చేసి ఎన్నికల కమీషన్ ను పంపారు. దీంతో డిఎంకె కె ఎన్నికల గుర్తు ఉంది.

 పార్టీ సమావేశాల తీర్మాణాలు అవసరం

పార్టీ సమావేశాల తీర్మాణాలు అవసరం

పార్టీ ఎన్నికల గుర్తును కేటాయించాలంటే ఆయా నాయకులు పట్ల విశ్వాసాన్ని ఉంచుతూ పార్టీ జనరల్ బాడీ సమావేశాల్లో చేసిన తీర్మాణాలు కీలకమైనవి. ఈ తరహ తీర్మాణాలు చేసి పంపడం వల్లే గతంలో డిఎంకె ఎన్నికల గుర్తు వైగో కు దక్కకుండా ఆగిపోయింది. అయితే మెజారిటీ నాయకులు అఖిలేష్ యాదవ్ వైపున్నప్పటికీ ఈ రకమైన తీర్మాణాలు చేసి ఎన్నికల కమీషన్ కు పంపితేనే ఆయన గ్రూపుకు ఎన్నికల గుర్తు దక్కే అవకాశం ఉంటుంది

English summary
the importance of a party symbol in a state like Uttar Pradesh cannot be emphasised enough. with a large illiterate and semi-literate population, the symbol is the single most important asset of any party. even those who have no idea about candidates end up voting for the party, given the familiarity of the symbol.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X