వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ రిక్వెస్ట్.. మమతా బెనర్జీతో మాట్లాడా: చంద్రబాబు

రాష్ట్రపతి అభ్యర్థిత్వం ఏకగ్రీవం చేయడానికి సహకరించమని పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీని కోరామని, దీనిపై పార్టీ ముఖ్యనేతలతో చర్చించి నిర్ణయం చెబుతామని ఆమె చెప్పారని ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడించారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

విజయవాడ: రాష్ట్రపతి పదవికి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఎంపికపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. దళితుడిని అత్యున్నత పదవికి ఎంపిక చేయడం గర్వకారణమన్నారు. పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీతో మాట్లాడమని ప్రధాని మోదీ కోరారని, ప్రస్తుతం ఆమె విదేశాల్లో ఉన్నారని చెప్పారు.

చదవండి: కేసీఆర్ సూచన మేరకే రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక: మోడీ ఫోన్

రాష్ట్రపతి అభ్యర్థిత్వం ఏకగ్రీవం చేయడానికి సహకరించమని మమతను కోరామని, దీనిపై పార్టీ ముఖ్యనేతలతో చర్చించి నిర్ణయం చెబుతామని మమత చెప్పారని బాబు వెల్లడించారు.

chandrababu

విశాఖలో భూరికార్డులు ట్యాంపరింగ్‌ అయ్యాయని, ట్యాంపరింగైన భూములు రిజిస్ట్రేషన్ కాలేదని చెప్పారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపిస్తున్నామని, దోషులను వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. ప్రతిపక్షాలు కావాలని తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని, విశాఖ ప్రతిష్టను దెబ్బతీసేలా విపక్షాలు వ్యవహరిస్తున్నాయని చంద్రబాబు ఆరోపించారు.

ఎన్డీయే తరఫున రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌కు ఏపీ సీఎం చంద్రబాబు మద్దతు ప్రకటించారు. ఎన్డీయే తరఫున అభ్యర్థిని ప్రకటించిన అనంతరం ప్రధాని మోదీ చంద్రబాబుకు ఫోన్‌ చేయగా.. తన సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు.

దీంతో పాటు పశ్చిమ్‌బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మద్దతు కూడా కూడగట్టాలని చంద్రబాబును ప్రధాని కోరగా, విదేశాల నుంచి మమతా బెనర్జీ రాగానే ఆమెను సంప్రదిస్తానని ప్రధానికి చంద్రబాబు తెలిపినట్టు సమాచారం.

English summary
Prime Minister Narendra Modi today dialed Andhra Pradesh Chief Minister Chandrababu Naidu to formally seek support for Ramnath Kovind, who has been chosen he presidential candidate of the NDA. He also asked Mr Naidu to help reach out to West Bengal Chief Minister Mamata Banerjee on the issue. Ms Banerjee -- who left this morning for a three-day trip to The Hague, the Netherlands - is one of the opposition leaders who said they could not commit to support the NDA candidate without knowing who it would be. Mr Naidu's office said he praised PM Modi's choice. Mr Kovind, he said, is an "intellectual from the Dalit community and deserves the position of president".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X