విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాకినాడ తీరంలో రెండు విదేశీ కార్గో షిప్ లు .. కరోనా టెన్షన్లో తీరప్రాంత వాసులు

|
Google Oneindia TeluguNews

పెరుగుతున్న కేసులతో పాటు ఏపీవాసులు ఎప్పుడు ఎవరు ఎలా వస్తారో ? ఎవరి ద్వారా కరోనా వ్యాప్తి చెందుతుందో అన్న భయంలో ఉన్నారు. అన్ని సరిహద్దులను మూసివేసిన అధికారులు సముద్ర తీరాలకు ఓడలు రాకుండా మాత్రం నిషేధం విధించలేదు . ముఖ్యంగా విదేశాలకు సంబంధించిన కార్గో షిప్స్ కాకినాడ, విశాఖ తీరాలకు చేరుతున్న నేపధ్యంలో ఉత్తరాంధ్ర వాసుల్లో పెద్ద టెన్షన్ నెలకొంది.

ఏపీలో కరోనా భయం .. విదేశీ షిప్పులతో తీర ప్రాంతాల్లో కలకలం

ఏపీలో కరోనా భయం .. విదేశీ షిప్పులతో తీర ప్రాంతాల్లో కలకలం

ఏపీలో ఊహించని విధంగా కరోనా కేసులు పెరిగాయి . ప్రస్తుతం ఏపీలో కారోనా కేసులు 40కి చేరాయి. ఈ ఒక్క రోజే 17 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కావడం ఏపీలో క‌ల‌క‌లం రేపుతోంది. అయితే ఆ 17 మందిలో చాలా వరకు ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారే ఉన్న‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. ఇక ఇప్పటికి మొత్తం 147 శాంపిళ్ల‌ను పరీక్షిస్తే వాటిలో 17 కేసులు పాజిటివ్ వచ్చినట్లు బులిటెన్ లో వెల్ల‌డించారు. దీంతో ఏపీ వాసుల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయన్న టెన్షన్ నెలకొంది. ఇది ఇలా ఉంటె ఎక్కడైనా విదేశీయులు ఉన్నారు , వస్తున్నారు అంటే జనాలు భయపడి పారిపోయే పరిస్థితి వచ్చింది . ఇక ఏకంగా విదేశాలకు సంబంధించిన షిప్ లు వచ్చాయి అంటే పరిస్థితి ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు .

కాకినాడ తీరంలో రెండు విదేశీ కార్గో షిప్పులు

కాకినాడ తీరంలో రెండు విదేశీ కార్గో షిప్పులు


ఇక ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన కేంద్రం రాష్ట్రాల సరిహద్దులనే కాదు జిల్లాల సరిహద్దులను మూసివెయ్యాలని ఆదేశించింది.కానీ సాగర తీరాలకు యధేచ్చగా చేరుతున్న విదేశీ కార్గో షిప్ లను మాత్రం పట్టించుకోవటం లేదు . ఇక ఈ క్రమంలోనే కాకినాడ తీరంలో హాల్దియా, ఇండోనేషియా కు చెందిన రెండు కార్గో షిప్ లు చేరుకున్నాయి. ఇక ఇండోనేషియాకు, హాల్దియాకు చెందిన షిప్పులు విదేశాలకు సంబంధించిన షిప్పులు కావటంతో స్థానిక ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

14 రోజులు క్వారంటైన్ విధించిన అధికారులు

14 రోజులు క్వారంటైన్ విధించిన అధికారులు

ఇక ఏపీలో కాకినాడ తీరానికి చేరిన ఆ షిప్పుల నుండి ఓడ సిబ్బందిని బయటకు రానీయకుండా అధికారులు షిప్ లోనే ఉంచి వైద్య పరీక్షలు నిర్వహించి 14 రోజులు క్వారంటైన్ విధించారు. షిప్ నుంచి కిందకు దిగవద్దని విదేశీయులకు అధికారులు సూచించారు. కానీ ఇలా విదేశాలకు సంబంధించిన షిప్పులను ఆపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కరోనా ప్రబలుతున్నా ఇలా కార్గో షిప్ లు ఏపీకి వస్తుండటం రాష్ట్ర‌వ్యాప్తంగా హై టెన్ష‌న్ కి కారణం అవుతుంది .

సముద్ర తీరాల్లోనూ నిషేధం విధించాలని కోరుతున్న ప్రజలు

సముద్ర తీరాల్లోనూ నిషేధం విధించాలని కోరుతున్న ప్రజలు

ఇక వీరిని కట్టడి చెయ్యకుంటే రాబోవు రోజుల్లో క‌రోనా మ‌హ‌మ్మారి ఏం స్థాయిలో విస్త‌రిస్తోంద‌న‌నే భ‌యందోళ‌న‌లో ప్ర‌జ‌లు ఉన్నారు.ఓడల రాకపోకలను కట్టడి చెయ్యాలని తీర ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు. ఏ దేశం నుండి ఎవరు కరోనాను పట్టుకు వస్తారో అని ఆందోళన చెందుతున్నారు . తీర ప్రాంతాల్లోనూ నిషేధం విధించాలని కోరుతున్నారు .

English summary
Along with the growing number of cases, how and when do corona victims come? They are afraid of whom the corona will spread. Officials who closed all borders did not prohibit vessels from reaching the shores. Especially in the context of overseas cargo ships reaching the shores of Kakinada and Visakha, there is a huge tension among the people of uttarandhra .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X