ఆ చేతి రాత రిషికేశ్వరిదే: తేల్చిన ఫోరెన్సిక్ నివేదిక, ఎస్పీకి అందజేత
గుంటూరు: ఆచార్య నాగార్జున విశ్యవిద్యాలయంలోని విద్యార్థిని రిషికేశ్వరి ఆత్మహత్య కేసులో రెండో డైరీపై ఫోరెన్సిక్ నివేదిక వెల్లడైంది. సూసైడ్ నోట్‌తో పాటు, రెండో డైరీలోని చేతిరాత రిషికేశ్వరిదేనని నివేదికలో తేల్చింది.
మొత్తం రెండు డైరీలతో పాటు రిషికేశ్వరికి చెందిన మరో నాలుగు నోట్ బుక్స్‌ను ఫోరెన్సిక్ అధికారులు పరీక్షించారు. ఒక లాంగ్ నోట్ బుక్, మరొక స్పైరల్ బుక్, మరో రెండు ఆన్సర్ నోట్ బుక్‌లలోని రిషికేశ్వరి చేతిరాతను ఫోరెన్సిక్ అధికారులు పోల్చి చూశారు.

ఈ నివేదికను ఫోరెన్సిక్ అధికారులు శనివారం గుంటూరు జిల్లా ఎస్పీకి అందచేశారు. ఈ కేసులో మరికొందరి పేర్లను చేర్చే అవకాశం ఉంది. ఛార్జ్ షీట్ వేసేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.
కాగా, సీనియర్ల ర్యాగింగ్ కారణంగా మనస్తాపం చెందిన రిషికేశ్వరి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
ఇది ఇలా ఉండగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిందితులను కఠినంగా శిక్షించాలని రిషికేశ్వరి తండ్రి ఓ లేఖ రాశారు. ఎలాంటి వివక్ష లేకుండా దర్యాప్తు కొనసాగించి తమకు న్యాయం చేయాలని కోరారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications