వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పడుకుంటేనే ఉద్యోగం ఇస్తా..!ఎప్పుడు పడుకుంటావ్.. !గుంటూరులో మదమెక్కిన అటవీశాఖ అదికారి..!

|
Google Oneindia TeluguNews

గుంటూరు/హైదరాబాద్ : సమాజంలో మానవత్వం మంటగలుస్తోంది. మానవతా విలువలు కనుచూపు మేరలో కనిపించడం లేదు. కష్టాల్లో ఉన్న వారిని పెద్ద మనసుతో ఆదుకునేది పక్కన పెట్టి సహాయం చేస్తే ప్రతిఫలంగా ఏమిస్తావని ప్రత్యంక్షంగా డిమండ్ చేసే రోజులు వచ్చాయి. మగవారినైతే నిస్సిగ్గుగా సహాయం చేసినందుకు ఎంత డబ్బులిస్తావ్ అని అడుగుతారు.

అదే మహిళలైతే నాదగ్గర పడుకుంటావా అని బహాటంగా అడిగేస్తున్నారు కామాందులు. ఇలాంటి ఉన్మాదులు ఎక్కువగా ప్రభుత్వ శాఖల్లో తిష్ట వేసుకుని కూర్చున్నట్టు తెలుస్తోంది. ఇల్లు గడవట్లేదని ఏదైనా ఉద్యోగం కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్తే చాలు ఒళ్లంతా కొవ్వెక్కిన కామ పిశాచాలు పండగ చేసుకున్నంత పని చేస్తారు. తాజాగా ఇలాంటి ఉదంతమే గుంటూరు అటవీ శాఖలో చోటు చేసుకుంది.

మొబైల్ షాపు ఓనర్ కామపురాణం.. కస్టమర్లతో రాసలీలలు.. ఆపై వీడియోలు..!మొబైల్ షాపు ఓనర్ కామపురాణం.. కస్టమర్లతో రాసలీలలు.. ఆపై వీడియోలు..!

 కొలువు కావాలంటే కోరిక తీర్చాల్సిందే..! గుంటూరు అటవీశాఖలో కొవ్వెక్కిన అదికారి డిమాండ్..!!

కొలువు కావాలంటే కోరిక తీర్చాల్సిందే..! గుంటూరు అటవీశాఖలో కొవ్వెక్కిన అదికారి డిమాండ్..!!

గుంటూరు అటవీ శాఖలో పనిచేస్తున్న అధికారి ఓ వివాహితపై వల వేశారు. భర్త నుంచి విడాకులు తీసుకొని జీవనోపాధి కోసం ఉద్యోగ వేటలో ఉన్న ఆమె నిస్సహాయతను వాడుకొని, లోబరుచుకొన్నారు. 2 లక్షల రూపాయల డబ్బు కూడా ఆమె నుంచి గుంజారు. ఉద్యోగం మాత్రం ఇప్పించలేదు. ఆయన వల్ల అన్నివిధాల కుంగిపోయిన బాధితురాలు మంగళవారం హోంమంత్రి సుచరితను కలుసుకొని తన గోడు వెళ్లబోసుకొన్నారు. గుంటూరు అర్బన్‌ ఎస్పీ, అటవీ శాఖ, ఆ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

 వివాహితపై అటవీ అధికారి వికృత చేష్టలు..! పదేపదే వేధింపులు..!!

వివాహితపై అటవీ అధికారి వికృత చేష్టలు..! పదేపదే వేధింపులు..!!

బాధితురాలి కథనం ప్రకారం, ఎస్టీ సామాజికవర్గానికి చెందిన బాధితురాలిది ప్రకాశం జిల్లా చీరాల ప్రాంతంలోని ఈపూరుపాలెం. 2009లో ఆమెకు వివాహం జరిగింది. వైవాహిక బంధానికి గుర్తుకు పుట్టిన పాపకు ఎనిమిదేళ్లు ఉండగా, భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తి విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం బాధితురాలు తన పాపతో కలిసి తన తల్లి వద్ద ఉంటోంది. తల్లివాళ్లది నిరుపేద కుటుంబం కావడంతో, అందరి పోషణాభారం బాధితురాలిపైనే పడింది. దీనికోసం ఆమె ఉద్యోగ అన్వేషణ ప్రారంభించింది.

 రెండు లక్షలు తీసుకొని మోసం..! మంత్రి సుచరితకి బాధితురాలి గోడు..!!

రెండు లక్షలు తీసుకొని మోసం..! మంత్రి సుచరితకి బాధితురాలి గోడు..!!

గుంటూరులోని అటవీ శాఖ కార్యాలయంలో ఉద్యోగాలు ఉన్నాయని తెలుసుకొని అక్కడకు వెళ్లింది. పేరేచర్లలోని అటవీ శాఖ కార్యాలయానికి వెళ్లి జిల్లా అటవీ శాఖ అధికారి మోహనరావును కలిసి తన బయోడేటా, సర్టిఫికెట్లను అందజేసింది. ఆయన ఆమె ఫోన్‌ నంబర్‌ తీసుకొని తరువాత కలవాలని చెప్పారు. నాలుగు రోజుల తరువాత మోహనరావు ఒకరోజు ఆమెకు ఫోన్‌ చేసి తన కార్యాలయానికి రావాలని కోరారు. కార్యాలయానికి వెళ్లి కలవగా, క్లర్క్‌ ఉద్యోగం ఇస్తానని, దానిని రెగ్యులర్‌ కూడా చేయిస్తానని హామీ ఇచ్చారు.

 సమాజంలో మానవ మృగాలు..! అప్రమత్తంగా ఉంగాలంటున్న మహిళా నేతలు..!!

సమాజంలో మానవ మృగాలు..! అప్రమత్తంగా ఉంగాలంటున్న మహిళా నేతలు..!!

దానికిగాను ఈ ఏడాది ఫిబ్రవరి 24న ఆమె నుంచి ఆయన రూ.రెండు లక్షలు తీసుకున్నారు. ఆ తరువాత కొద్ది రోజులకు ఆమె ఫోన్‌ చేయగా, తన స్వభావం బయటపెట్టుకొన్నారు. 'డబ్బు ఇస్తే చాలదు.. నా కోరిక కూడా తీర్చాలి' అని షరతు పెట్టారు. గత్యంతరం లేని స్థితిలో ఉన్న ఆమెను లొంగదీసుకొన్నారు. ఆ రోజు నుంచి ఏదో నెపం మీద పిలిపించి, తనను వేధిస్తున్నారని తన ఫిర్యాదులో బాధితురాలు వాపోయారు. మోహన్‌రావుపై ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని ఆమె కోరారు.

English summary
An officer working in the Guntur forest department has been caught trapping a married man. She divorced her husband and used her helplessness while on the job hunt for a livelihood.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X