అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌కు షాక్: బాబును కలిసిన గురునాథ్‌రెడ్డి, ప్రభాకర్ చౌదరి ఏం చేస్తారు?

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: అనంతపురం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత గురునాథరెడ్డి శనివారం నాడు ఏపీ సీఎం చంద్రబాబునాయుడును కలిశారు. ఆయన త్వరలోనే టిడిపిలో చేరే అవకాశం ఉంది.కొంతకాలంగా వైసీపీలో చోటు చేసుకొంటున్న పరిణామాలతో గురునాథ్ రెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. చంద్రబాబుతో గురునాథ్ రెడ్డి బాబుతో సమావేశం కావడంతో అనంతపురం రాజకీయాల్లో మార్పులకు నాంది పలికే అవకాశం కన్పిస్తోంది.

Recommended Video

వైసిపిలో విభేదాలు, పార్టీ ఆఫీస్‌లో ఫర్నీచర్ ధ్వంసంYSRCP leaders broke the furniture|Oneindia Telugu

జగన్‌కు గుర్నాథర్‌ రెడ్డి షాక్: మిస్సమ్మ బంగ్లా కారణమా?జగన్‌కు గుర్నాథర్‌ రెడ్డి షాక్: మిస్సమ్మ బంగ్లా కారణమా?

2019 ఎన్నికల్లో మరోసారి రాష్ట్రంలో విజయం సాధించే లక్ష్యంతో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వ్యూహలను రచిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇతర పార్టీలకు చెందిన కీలక నేతలను తమ పార్టీలోకి ఆహ్వనిస్తున్నారు.

అంతేకాదు వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ పాదయాత్ర సాగుతున్న సమయంలోనే ఆ పార్టీ నుండి వలసలను ప్రోత్సహించడం ద్వారా మానసికంగా ఆ పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా ఆ పార్టీ నాయకత్వం ప్లాన్ చేస్తోంది.

గురునాథ్‌రెడ్డి టిడిపిలో చేరికకు రంగం సిద్దం

గురునాథ్‌రెడ్డి టిడిపిలో చేరికకు రంగం సిద్దం

అనంతపురం మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి టిడిపిలో చేరికకు రంగం సిద్దమైంది. ఏపీ సీఎం చంద్రబాబునాయుడును గురునాథ్‌రె్డ్డి కలిశారు.తన సోదరులను వెంటబెట్టుకొని మరీ గురునాథ్‌రెడ్డి చంద్రబాబునాయుడును కలిశారు.కొంత కాలంగా గురునాథ్‌రెడ్డి వైసీపీని వీడుతారనే ప్రచారం సాగుతోంది. ఈ తరుణంలో గురునాథ్ రెడ్డి బాబును కలవడం ప్రాధాన్యతను సంతరించుకొంది. త్వరలోనే గురునాథ్ రెడ్డి టిడిపిలో చేరే అవకాశం ఉంది.

గురునాథ్‌రెడ్డి వెనుక జెసి

గురునాథ్‌రెడ్డి వెనుక జెసి


అనంతపురం మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి టిడిపిలో చేరాలనే నిర్ణయం వెనుక అనంతపురం ఎంపీ జెసి దివాకర్ రెడ్డి చక్రం తిప్పారనే ప్రచారం సాగుతోంది. జెసి కూడ గురునాథ్‌రెడ్డి చేరికకు సానుకూలంగా ఉన్నారని సమాచారం. దీంతో జెసి దివాకర్ రెడ్డి కూడ గురునాథ్‌రెడ్డి టిడిపి నాయకత్వంతో చర్చించారని అంటున్నారు. గురునాథ్ రెడ్డి వైసీపీ చీఫ్ జగన్ కు అత్యంత సన్నిహితంగా ఉండేవారు. కారణాలేమిటో గాని ఆయన ఆ పార్టీని వీడాలని నిర్ణయించుకొన్నారని ప్రచారం సాగుతోంది. ఇటీవల అనంతపురం వైసీపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో గురునాథ్ రెడ్డి అనుచరులకు, ఇతరులకు మద్య గొడవ కూడ జరిగింది.

అనంతలో మారనున్న సమీకరణాలు

అనంతలో మారనున్న సమీకరణాలు

అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు మారనున్నాయి. అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి, అనంతపురం ఎంపీ జెసి దివాకర్ రెడ్డికి మద్య పొసగడం లేదు. అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో కొన్ని విషయాల్లో జెసి దివాకర్ రెడ్డికి, ప్రబాకర్ చౌదరికి మద్య విబేధాలు కొనసాగుతున్నాయి. జెసి దివాకర్ రెడ్డి ఒకానొక సందర్భంలో నిరసనకు కూడ దిగారు. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో గురునాథ్ రెడ్డిని టిడిపిలోకి తెచ్చేందుకు జెసి దివాకర్ రెడ్డి తెర వెనుక చక్రంతిప్పారనే ప్రచారం సాగుతోంది.

అనంతలో ఎవరికీ టిక్కెట్టు

అనంతలో ఎవరికీ టిక్కెట్టు

గురునాథ్ రెడ్డి టిడిపిలో చేరితే ఆయన ఏ స్థానం నుండి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారనే విషయమై ఉత్కంఠ నెలకొంది. సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిని కాదని వచ్చే ఎన్నికల్లో గురునాథ్ రెడ్డిని అనంతపురం నుండి బరిలో దింపుతారా..లేక అనంతపురం జిల్లాలో వేరే స్థానం నుండి గురునాథ్ రెడ్డిని పోటీకి దింపే అవకాశం ఉందా అనే చర్చ కూడ లేకపోలేదు. అయితే ఎన్నికల నాటికి ఇంకా రాజకీయాల్లో మార్పులు చోటుచేసుకొనే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు

English summary
Former Anatapuram Mla Gurunath Reddy met Ap chief minister Chandrababu naidu on Saturday at Amaravati. Gurunath Reddy will join in Tdp soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X