వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏలూరు వింత వ్యాధి బాధితులను పరామర్శించిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ .. రాజకీయ వర్గాల్లో ఆసక్తి

|
Google Oneindia TeluguNews

రాజకీయాలలో రాణించాలని ఉద్యోగానికి సైతం రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి వచ్చిన జేడీ లక్ష్మీనారాయణ గత ఎన్నికల తర్వాత పెద్దగా కనిపించకుండా పోయారు . జనసేన నుండి ఎంపీగా ఎన్నికలబరిలోకి దిగి ఓటమి పాలైన లక్ష్మీ నారాయణ తర్వాత సైలెంట్ అయ్యారు. ఇక జనసేనకు రాజీనామా చేశాక అసలే కనిపించకుండా పోయారు. కానీ ఇప్పుడు తాజాగా ఏలూరు లో వింత వ్యాధితో బాధపడుతున్న వారిని పరామర్శించడానికి జేడీ లక్ష్మీనారాయణ రావడం అటు ప్రజల్లోనూ, అటు రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తి రేకెత్తించింది.

ఆ రంగంలో భారత్ ఆదర్శం.. చైనా కాకుండా ఇప్పుడు స్టడీ చెయ్యల్సింది ఇండియానే.. బిల్ గేట్స్ కితాబు

ఏలూరు ఆసుపత్రిలో వింత వ్యాధి బాధితులకు లక్ష్మీ నారాయణ పరామర్శ

ఏలూరు ఆసుపత్రిలో వింత వ్యాధి బాధితులకు లక్ష్మీ నారాయణ పరామర్శ

ఏలూరు ఆసుపత్రిలో వింత వ్యాధి బాధితులను సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పరామర్శించారు. బాధితుల పరిస్థితిని అక్కడి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితులను ఆందోళన చెందవద్దని, ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. వింత రోగానికి కారణాలను కొనుక్కోవలసిన అవసరం ఉందని, ఆ పని త్వరితగతిన చేయాలని జేడీ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ఇటీవల ఏలూరు లో కురిసిన వర్షాలు వరదల కారణంగా తాగునీటిలో ఏమైనా కలిసి ఉండవచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు జేడీ లక్ష్మీనారాయణ. ఇక బాధితుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో ఆరా తీసిన ఆయన మళ్ళీ ప్రజల కోసం బయటకు రావటం ఆసక్తిగా మారింది.

 గత ఎన్నికల్లో ఓటమి , జనసేనకు రాజీనామాతో కనిపించకుండా పోయిన లక్ష్మీ నారాయణ

గత ఎన్నికల్లో ఓటమి , జనసేనకు రాజీనామాతో కనిపించకుండా పోయిన లక్ష్మీ నారాయణ

గత ఎన్నికలకు ముందు జనసేన పార్టీలో చేరిన జేడీ లక్ష్మీనారాయణ, ఈ ఏడాది జనసేన, బీజేపీ పొత్తు తరువాత, రెండు పార్టీల పొత్తు పై హర్షం వ్యక్తం చేశారు . ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చిన జేడీ లక్ష్మీనారాయణ పవన్ మళ్లీ సినిమాల్లో నటించాలని తీసుకున్న నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం నచ్చక జనసేన కు రాజీనామా చేసినట్లు ప్రకటించారు . ఇక అప్పటి నుండి కనిపించకుండా పోయిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తాజాగా ఏలూరు బాధితులను పరామర్శించడం, లక్ష్మీనారాయణ అభిమానులకు ఆనందం కలిగించగా రాజకీయవర్గాలలో ఆసక్తిని రేకెత్తించింది.

Recommended Video

PCC Cheif Decision Should Be Taken To The Coordination Of Everyone In The Party - MLA Jagga Reddy
ఏలూరు బాధితుల పరామర్శతో అభిమానుల్లో , రాజకీయ వర్గాల్లో ఆసక్తి

ఏలూరు బాధితుల పరామర్శతో అభిమానుల్లో , రాజకీయ వర్గాల్లో ఆసక్తి

జేడీ లక్షీ నారాయణ మళ్ళీ ప్రజా క్షేత్రంలోకి రానున్నారా ? తిరిగి రాజకీయాలలో ఆయన చక్రం తిప్పే ఆలోచన ఏమైనా చేస్తున్నారా ? అని అందరూ ఆలోచనలో పడ్డారు . నిజాయితీ పనిచేసే తమ నాయకుడు ఎన్నికల్లో పోటీ చేసినా ఓటమి పాలు కావటంతో బాధ పడిన జేడీ లక్ష్మీ నారాయణ అభిమానులు మళ్ళీ ప్రజల సమస్యల కోసం జేడీ లక్ష్మీ నారాయణ గొంతు విప్పాలని భావిస్తున్నారు . మరి జేడీ లక్ష్మీ నారాయణ మళ్ళీ యాక్టివ్ అవుతారా లేదా అని వేచి చూడాల్సిందే .

English summary
Former CBI JD Lakshminarayana, who resigned from his job to excel in politics and came into the public arena, has largely disappeared after the last election. Lakshmi Narayana became silent after losing the election as an MP from Janasena. After Janasena resigned, he disappeared. But now the recent arrival of Lakshminarayana in Eluru to visit those suffering from a mysterious disease has aroused the interest of both the people and the political circles.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X