వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గన్నవరం ఎయిర్ పోర్టు చంద్రబాబుకు షాక్.. సాధరణ ప్రయాణికుడి వలే చెకింగ్

|
Google Oneindia TeluguNews

Recommended Video

గన్నవరం ఎయిర్‌పోర్టులో చంద్రబాబుకు గోర అవమానం..!! || Oneindia Telugu

వైసీపీ ప్రభుత్వం ఎర్పడిన తర్వాత ప్రతిపక్షంలోకి వెళ్లిన చంద్రబాబుకు మరో షాక్ తగిలింది..ఇప్పటికే చంద్రబాబు కాన్వాయ్‌లో పైలట్, ఎస్కర్ట్ వాహనాలను తొలగించారు. దీంతో తాజాగా ఆయనకు విజయవాడలోని గన్నవరం ఎయిర్‌పోర్టులో మరో చేదు అనుభవం ఎదురైంది.జడ్‌ప్లస్ కేటాగిరి భద్రతలో ఉన్న చంద్రబాబును సాధరణ ప్రయాణికుల వలే ఎయిర్‌పోర్టు భద్రతా సిబ్బంది తనిఖీలు చేశారు.

సాయంత్రం చంద్రబాబు నాయుడు విజయవాడ నుండి హైదరాబాద్ బయలుదేరేందుకు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.అయితే ఎయిర్ పోర్టులో విమానం దగ్గరికి వెళ్లే సమయంలో భద్రతా సిబ్బంది చంద్రబాబుకు తనిఖీలు నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు వాహానం డైరక్టుగా వీఐపీ రూటు నుండి నేరుగా విమానం దగ్గరకు వెళ్లే అవకాశం ఉంటుంది. అయితే చంద్రబాబు నాయుడు ప్రతిపక్షహోదాలో ఉండడంతో ఆ నిబంధనలను సడలించిన అధికారులు ఆయన్ను సాధారణ ప్రయాణికులు వెళ్లే దారి గుండా మాత్రమే అనుమతించారు. దీంతో ఆయన్ను భద్రతా అధికారులు సాధారణ ప్రయాణికులను నిర్వహించినట్టు తనిఖీలు నిర్వహించారు.

Former Chief Minister Chandrababu Naidu was frisked like an ordinary passenger

మరోవైపు విఐపీ లాంజ్ నుండి కాన్వాయ్‌ని అనుమతించకుండా ప్రయాణికులు వెళ్లే బస్సులోనే చంద్రబాబును పంపించారు. అయితే మాజి ముఖ్యమంత్రి కావడంతో పాటు ఆయన జడ్‌ప్లస్ కేటాగిరిలో ఉన్నాడు. దీంతో పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నట్టు సమాచారం.

English summary
Former Chief Minister Chandrababu Naidu was frisked like an ordinary passenger at Vijayawada airport here on Friday. Earlier Chandrababu Naidu went to airport to catch a flight to Hyderabad. The security staff at the airport didn't allow his convoy up to the aircraft. He was asked to get down and go through the regular process of checking
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X