వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కండువా కప్పి రాహుల్ ఆహ్వానం, కాంగ్రెస్‌లో చేరిన కిరణ్ కుమార్ రెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ (సమైక్య) చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. గురువారం ఢిల్లీ చేరుకున్న ఆయన ఈ రోజు ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీలోకి తిరిగి వచ్చారు.

Recommended Video

2019లో ఏపార్టీ అధికారంలోకి రావాలన్నా...మేమే కీలకం : కాంగ్రెస్

రాష్ట్ర విభజనకు ముందు ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫునే చివరి ముఖ్యమంత్రిగా ఉన్నారు. విభజన నేపథ్యంలో ఆయన సొంతగా జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టి 2014లో పోటీ చేసారు. ఆయన స్వయంగా పోటీ చేయలేదు. కానీ తన పార్టీ తరఫున పలువురిని నిలబెట్టారు.

 Former Chief Minister N Kiran Kumar Reddy joins Congress in the presence of Rahul Gandhi

ఆ తర్వాత ఆయన కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డిని ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ తర్వాత కిరణ్‌కు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆహ్వానం వచ్చింది. మాజీ సీఎంగా తనకు ఉండాల్సిన ప్రాధాన్యత ఉంటుందని హామీ వచ్చాక ఆ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ రోజు రాహుల్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఢిల్లీలోని రాహుల్ గాంధీ వద్దకు కిరణ్ కుమార్ రెడ్డి వెళ్లగా, ఆ సమయంలో బయటే ఉన్న రాహుల్ ఆయన్ను ఆప్యాయంగా పలకరించి లోనికి ఆహ్వానించారు.

 Former Chief Minister N Kiran Kumar Reddy joins Congress in the presence of Rahul Gandhi
English summary
Congress President Rahul Gandhi welcomes to the Congress, N. Kiran Kumar Reddy, former Chief Minister of Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X