వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కులాన్ని కులంతోనే ఢీ: జగన్ సర్కార్‌లోకి రిటైర్డ్ సీఎస్ రమాకాంత్ రెడ్డి ఎంట్రీ?

|
Google Oneindia TeluguNews

అమరావతి: ముల్లును ముల్లుతోనే తీయాలని పెద్దలు చెబుతుంటారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదే ప్రాథమిక సూత్రాన్ని అనుసరించేలా కనిపిస్తున్నారు. తన సామాజిక వర్గానికి చెందిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ద్వారా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయించారని బలంగా విశ్వసిస్తోన్న వైఎస్ జగన్ సరికొత్తగా వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. తన సామాజిక వర్గానికి చెందిన మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రమాకాంత్ రెడ్డిని తెర మీదికి తీసుకుని రానున్నట్లు సమాచారం.

వైఎస్‌కు నమ్మకస్తుడిగా..

వైఎస్‌కు నమ్మకస్తుడిగా..

రమాకాంత్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో పలు కీలక శాఖల్లో పనిచేశారు. వైఎస్‌కు నమ్మకస్తుడిగా ఉన్నారు. పదవీ విరమణ చేసిన తరువాత ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికల కమిషనర్‌గా పనిచేసిన అనుభవం కూడా ఆయనకు ఉంది. రాష్ట్ర విభజన అనంతరం ఆయన తెలంగాణ క్యాడర్ కిందికి వెళ్లారు.

కేసుల విషయంలో జగన్‌కు అండగా..

కేసుల విషయంలో జగన్‌కు అండగా..

వైఎస్ జగన్‌పై నమోదైన ఆస్తుల కేసు వ్యవహారంలో రమాకాంత్ రెడ్డి తన అభిప్రాయాలను పలు సందర్భాల్లో వెల్లడించారు. జగన్‌పై నమోదైన ఏ ఒక్క కేసు నిలబడదని, తండ్రి హయాంలో ఆయన ఏనాడూ సచివాలయానికి కూడా రాలేదంటూ బాహటంగా మద్దతు ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆయన అనుభవాన్ని వినియోగించుకోవాలని వైఎస్ జగన్ తాజాగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. సోమవారం సాయంత్రమే రమాకాంత్ రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్‌తో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

స్థానిక సంస్థల ఎన్నికలపై సలహాలు..

స్థానిక సంస్థల ఎన్నికలపై సలహాలు..

ఉమ్మడి రాష్ట్రంలో రమాకాంత్ రెడ్డి ఎన్నికల కమిషనర్‌గా పనిచేసిన అనుభవం ఉన్నందున.. ఇప్పుడున్న పరిస్థితులపై ఆయన సలహాలను వైఎస్ జగన్ స్వీకరించినట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికలు ఆరు వారాల పాటు వాయిదా పడిన నేపథ్యంలో.. నిర్దేశిత గడువులోగా ఎలాగైనా ఎన్నికలను నిర్వహించడానికి ఎలాంటి మార్గాలను అన్వేషించాలనే విషయంపై రమాకాంత్ రెడ్డి.. వైఎస్ జగన్‌కు కొన్ని సలహాలను ఇచ్చారని తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నిక విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన ప్రస్తుత పరిస్థితుల్లో దీనిపై ఎలా ముందుకు వెళ్లాలనే విషయంపై రమాకాంత్ రెడ్డి ముఖ్యమంత్రికి దిశానిర్ధేశం చేశారని అంటున్నారు.

English summary
Retired IAS Officer and Former Chief Secretary of United Andhra Pradesh Ramakanth Reddy is likely to appointed as advisor as YS Jagan Mohan Reddy's government. YS Jagan has already discussed with him about the Local Body Elections postponed in the State.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X