వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ సీఎస్ నీలం సాహ్నికి మాజీ సీఎం చంద్రబాబు లేఖ ... ఏ విషయంలో అంటే

|
Google Oneindia TeluguNews

ఏపీలో కరోనా మహమ్మారి ఊహించని విధంగా ప్రబలుతుంది . ఇప్పటికి 893 కి చేరింది ఏపీలో కేసుల సంఖ్య. విపరీతంగా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో మాజీ సీఎం చంద్రబాబు ఏపీ సీఎస్ నీలం సాహ్నికి లేఖ రాశారు. కరోనా నియంత్రణకు ప్రభుత్వం నిరంతరాయంగా కృషి చెయ్యాలని సూచించారు. ఇక ఇప్పటికే ఏపీలో కేసులు పెరిగిపోయాయని వైరస్ వేగం పుంజుకుందని పేర్కొన్న చంద్రబాబు, కరోనా నివారణను సవాల్‌గా తీసుకుని పనిచేయాలని లేఖలో పేర్కొన్నారు .

కువైట్‌లో వారిని ఆదుకోండి: విదేశాంగ మంత్రికి చంద్రబాబు లేఖ కువైట్‌లో వారిని ఆదుకోండి: విదేశాంగ మంత్రికి చంద్రబాబు లేఖ

ఏపీ సీఎస్ నీలం సాహ్నికి టీడీపీ అధినేత చంద్రబాబు రాసిన లేఖలో కరోనాపై పోరాడుతున్న క్షేత్రస్థాయి సిబ్బందికి రక్షణ పరికరాలు ఇవ్వాలని పేర్కొన్నారు . ఇక కేసులను పెరగకుండా చూసేందుకు నియంత్రణా చర్యలపై దృష్టి పెట్టాలని చెప్పారు . ట్రూనాట్‌ కిట్ల సాయంతో కరోనా నిర్దారణ పరీక్షలను వేగవంతం చేయాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఏపీలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోందని ఇది ప్రస్తుతం ఆందోళన కలిగిస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు .

Former CM Chandrababus letter to AP CS Neelam Sahni

ఇంకా 16 వేల పరీక్షల ఫలితాలు పెండింగ్‌లో ఉండటం సబబుకాదని పేర్కొన్నారు చంద్రబాబు . త్వరిత గతిన పరీక్షలను నిర్వహించి ఫలితాలు వచ్చేలా చూడాలని ఆయన లేఖలో అన్నారు . ప్రైవేటు ల్యాబ్‌ల సహకారం తీసుకునే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టలేదని, ఇక ఆ దిశగా కూడా చర్యలు చేపడితే మంచిదని పేర్కొన్నారు. ట్రూనాట్‌ పరీక్షల ఫలితాలను ఆర్టీజీఎస్‌కు అనుసంధానం చేయడం ద్వారా ఎప్పటికప్పుడు వివరాలు ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉంటాయని , వైరస్‌ వ్యాప్తి చెందకుండా నివారించవచ్చని చంద్రబాబు సీఎస్ నీలం సాహ్నికి సూచనలు చేశారు.

English summary
Former CM Chandrababu has written a letter to the AP CS Neelam sahni in the wake of the corona epidemic in AP. Chandrababu said the results of 16,000 tests are in pending. In his letter, he urged the government to conduct rapid tests and see results. He said that the government has not taken any steps towards the cooperation of private labs and that it would be better to take action. truenat kits will help in present situation babu gave suggestion to C.S
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X