వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైఎస్సార్-చంద్రబాబు సహచరుడిగా : చిరంజీవిని రాజకీయాల్లో ఆహ్వనించిన నేతగా రోశయ్య...!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య కు తెలుగు రాజకీయాలతో విడదీయలేని బంధం ఉంది. తొలి నుంచి కాంగ్రెస్ వాదిగా ఉంటూ..చివరి నిమిషం వరకూ ఆ సిద్దాంతాలతోనే రోశయ్య కొనసాగారు. రాష్ట్ర - జాతీయ రాజకీయాల్లో ఆయనకు గుర్తింపు ఉంది. ఎమ్మెల్సీగా...ఎమ్మెల్యేగా..ఎంపీగా.. సీఎంగా..గవర్నర్ గా అనేక శాఖలను నిర్వహించిన మంత్రిగా.. బడ్జెట్ రూపకల్పనలో నిపుణుడిగా రోశయ్యకు పేరుంది. ఇక, రాజకీయాల్లో ఆయన వైఎస్సార్.. చంద్రబాబుతో ఉన్న అనుబంధం ప్రత్యేకం.

చంద్రబాబుతో కలిసి కేబినెట్ లో మంత్రిగా

చంద్రబాబుతో కలిసి కేబినెట్ లో మంత్రిగా

చంద్రబాబు తొలుత కాంగ్రెస్ లో ఉన్న సమయంలో అంజయ్య ప్రభుత్వంలో మంత్రిగా పని చేసారు. అదే కేబినెట్ లో రోశయ్య సైతం మంత్రిగా వ్యవహరించారు. అప్పటి నుంచి రోశయ్య ముఖ్యమంత్రి పదవి వీడే వరకూ చంద్రబాబుతో సహా చట్ట సభల్లో సభ్యుడిగా ఉన్నారు. మండలిలో విపక్ష నేతగా రోశయ్య కీలక భూమిక పోషించారు. ఎన్టీఆర్ హాయంలో రోశయ్య వాగ్దాటిని తట్టుకోలేకనే..నాడు మండలిని రద్దు చేసారనే చర్చ రాజకీయ వర్గాల్లో ఇప్పటికీ వినిపిస్తోంది. ఇక, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నా.. ప్రతిపక్ష నేతగా ఉన్నా..సభలో రోశయ్య వర్సెస్ చంద్రబాబు మధ్య చర్చ ఎప్పుడూ ఆసక్తి కరమే.

అసెంబ్లీలో చంద్రబాబు వర్సెస్ రోశయ్య

అసెంబ్లీలో చంద్రబాబు వర్సెస్ రోశయ్య

వాగ్బాణాలు..చమత్కారాలు..వ్యంగంతో చంద్రబాబును ఇరుకున పెట్టేందుకు రోశయ్య ప్రయత్నించే వారు. ఇక, కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడినా..ఎవరు ముఖ్యమంత్రి అయినా రోశయ్య ఆ కేబినెట్ లో మంత్రిగా ఉండాల్సిందే. ప్రతీ సీఎం వద్దా ఆయన విధేయుడిగా కీలక శాఖలు నిర్వహించారు. 14 శాఖలు నిర్వహించిన ఘనత రోశయ్య కు దక్కింది. అందునా ఆర్దిక- శాసనసభా వ్యవహారాల్లో రోశయ్యకు మంచి అనుభం ఉంది. వైఎస్సార్ సీఎం అయిన తరువాత ఆయనతో మరింత సాన్నిహిత్యం పెరిగింది. రోశయ్య కు ఆర్దిక- శాసనసభా వ్యవహారాలను నాడు వైఎస్సార్ అప్పగించే వారు.

వైఎస్సార్ కు ఆత్మీయుడిగా.. కీలకంగా

వైఎస్సార్ కు ఆత్మీయుడిగా.. కీలకంగా

వైఎస్సార్ పధకాలు..ఆర్దిక నిర్ణయాలు భారమంటూ రోశయ్య అభ్యంతరాలు వ్యక్తం చేసినా...అన్నా.. మీరు టెన్షన్ పడకండి అంటూ వైఎస్సార్ సముదాయించే వారు. ఇక, వైఎస్సార్ మరణ వార్త సైతం రోశయ్య ప్రకటించాల్సి వచ్చింది. ఆ సమయంలో రోశయ్య తీవ్ర ఆవేదనకు గురవుతూ..కన్నీటి పర్యంతమయ్యారు. ఇక, సీఎంగా బాధ్యతలు చేపట్టి.. 14 నెలలు ఆ పదవిలో కొనసాగారు. మెగాస్టార్ చిరంజీవితోనూ రోశయ్య కు సత్సంబంధాలు ఉన్నాయి. చిరంజీవి ప్రజారాజ్యం ఏర్పాటుకు ముందే ఆయన్ను రాజకీయాల్లోకి రావాలంటూ ఆహ్వానించారు. రోశయ్య మరణ వార్త తెలిసిన చిరంజీవి సంతాపం ప్రకటించారు.

కేసీఆర్.. చంద్రబాబు సంతాపం

కేసీఆర్.. చంద్రబాబు సంతాపం


రోశయ్య మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ఆర్ధిక శాఖ మంత్రిగా పలు పదవులకు వన్నె తెచ్చిన రోశయ్య, సౌమ్యుడిగా, సహన శీలిగా, రాజకీయాల్లో తనదైన శైలిని ప్రదర్శించేవారు అని గుర్తు చేసుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కొణిజేటి రోశయ్య మృతి బాధాకరమ‌ని నారా చంద్రబాబునాయుడు అన్నారు. రోశయ్య పరిపాలనాదక్షుడిగా, ఆర్థిక నిపుణుడిగా పేరుప్రఖ్యాతులు గడించారన్నారు. విద్యార్థి సంఘ నాయకుడి నుంచి గవర్నర్ స్థాయికి అంచలంచెలుగా ఎదిగారన్నారని తెలిపారు.

చిరంజీవిని రాజకీయాల్లోకి ఆహ్వానం

చిరంజీవిని రాజకీయాల్లోకి ఆహ్వానం

వివాదరహితుడిగా నిలిచారని తెలిపారు. తనకప్పగించిన ఏ బాధ్యతలనైనా సమర్థవంతంగా నిర్వహించేవారని కొనియాడారు.సుదీర్ఘకాలం ఆర్థిక శాఖ మంత్రిగా కొనసాగి తన సేవలనందించారన్నారు. కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రజా జీవితంలో రోశయ్య ఒక మహోన్నత నేతగా చిరంజీవి అభిర్ణించారు.

రాజకీయ విలువలు, అత్యున్నత సంప్రదాయాలు కాపాడడం లో ఓ రుషి మాదిరిగా సేవ చేశారని కొనియాడారు. రోశయ్య కన్నుమూయడంతో రాజకీయాలలో ఓ శకం ముగిసిందన్నారు. రోశయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసారు. తనను రాజకీయాల్లోకి రావాలని మనస్ఫూర్తిగా ఆహ్వానించారని గుర్తు చేసుకున్నారు. వివాదరహితులుగా, నిష్కళింకితులుగా ప్రజమన్ననలు పొందిన వ్యక్తి రోశయ్య అంటూ చిరంజీవి కీర్తించారు.

English summary
AP former CM Rosaiah who passed away early on Saturday, had a good relation with the late YSR and TDP Chief Chandrababu in assembly. He invited Chiranjeevi into politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X