వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'వారిద్దరే తెలుసు', 'చంద్రబాబు బెదిరిస్తున్నారు, కానీ, డిపాజిట్ రాదు'

మా అబ్బాయితో కలిసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని' మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. వైసీపీ చీఫ్ జగన్ సమక్షంలో ఆయన గురువారం సాయంత్రం తన అనుచరులతో కలిసి వైసీపీలో చేరారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

విజయవాడ: 'మా అబ్బాయితో కలిసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని' మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. వైసీపీ చీఫ్ జగన్ సమక్షంలో ఆయన గురువారం సాయంత్రం తన అనుచరులతో కలిసి వైసీపీలో చేరారు.

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా ఆయన ఇటీవలే రాజీనామా చేశారు. వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకొన్నారు. తన అనుచరులతో కలిసి గురువారంనాడు పార్టీలో చేరారు. అయితే వైసీపీ నేత వంగవీటి రాధాను ఆయన తన అబ్బాయిగా ఈ సభలో పేర్కొన్నారు.

విజయవాడ నగరంలోని పలు డివిజన్ల నుండి తన అనుచరులు కూడ ఆయనతో కలిసి వైసీపిలో చేరారు. అయితే తనపై నమ్మకం ఉంచి పార్టీలో చేరినవారందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. వైఎస్ మరణం తర్వాత రాష్ట్రం అధోగతి పాలైందని విష్ణు అభిప్రాయపడ్డారు.

ఇద్దరు నాయకులే తెలుసు

ఇద్దరు నాయకులే తెలుసు

నాకు ఇద్దరు నాయకులే తెలుసు. ఇద్దరు ఇద్దరేనని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు చెప్పారు. వైసీపలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు.వంగవీటి మోహన‌రంగా, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఇద్దరు నాయకులు తనకు తెలుసునని చెప్పారు. అయితే ఇద్దరి గురించి ఎంత చెప్పినా తక్కువేనన్నారు.తనకు పదవులను ఇచ్చి రాజకీయంగా తన ఎదుగుదలకు తోడ్పడిన నేత వైఎస్ఆర్ అని ఆయన గుర్తుచేసుకొన్నారు.

Recommended Video

Chandrababu Fixed YS Jagan And Pawan Kalyan For 2019 Polls
బంగాళాఖాతంలో కలిపేస్తాం

బంగాళాఖాతంలో కలిపేస్తాం

రానున్న ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వాన్ని వైసీపీ బంగాళాఖాతంలో కలిపేస్తోందని వైసీపీ చీఫ్ జగన్ చెప్పారు. మల్లాది విష్ణు పార్టీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు.ప్రశ్నించే ప్రతి గొంతు వైసీపీ పార్టీదే అవుతోందన్నారు. రాబోయే ఎన్నికలు చంద్రబాబు దుర్మార్గానికి సన్మార్గానికి మధ్య పోరాటమని ఆయన అభిప్రాయపడ్డారు.రానున్న ఎన్నికల్లో పార్టీ విజయం కోసం ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని ఆయన కోరారు.

చంద్రబాబు బెదిరిస్తున్నారు

చంద్రబాబు బెదిరిస్తున్నారు

నంద్యాలలో డిపాజిట్ కూడ దక్కదనే ఉద్దేశ్యంతోనే చంద్రబాబునాయుడు ప్రజలను బెదిరిస్తున్నారని ఆయన ఆరోపణలు చేశారు. విష్ణు అన్నను పార్టీలోకి మనస్పూర్తిగా ఆహ్వనిస్తున్నాను అంటూ జగన్ ప్రకటించారు. విష్ణు అన్నతో పాటు ఆయన సహచరులను కూడ పార్టీలోకి ఆహ్వనిస్తున్నట్టు ఆయన చెప్పారు.మా కుటుంబంలోకే కాదు మా గుండెల్లోకి వస్తున్నారంటూ ఆయన చెప్పారు.

 సువర్ణయుగం తెస్తాం

సువర్ణయుగం తెస్తాం

తమకు అధికారాన్ని కట్టబెడితే రానున్న రోజుల్లో రాష్ట్రంలో సువర్ణయుగాన్ని తెస్తామని వైసీపీ చీఫ్ జగన్ ప్రకటించారు. వైఎస్ఆర్ వేసిన మార్గాన్ని తాము అనుసరిస్తామన్నారు. రాజన్న పాలనను తెచ్చేందుకుగాను నవరత్నాల పాలనను తీసుకువస్తామన్నారు. ఈ పాలన కోసం రాష్ట్రంలో ప్రతి ఇంట్లో ఆశగా ఎదురుచూస్తున్నారని చెప్పారు. చంద్రబాబు దుర్మార్గం, వైసీపీ సన్మార్గానికి మధ్యపోరాటంగా ఆయన పేర్కొన్నారు.

English summary
Former congress leaderFormer MLA Malladi Vishnu joined the YSR Congress party on Thursday in the presence of YSCP president Y S Jagan Mohan Reddy. Mr Malladi Vishnu was a close associate of former Chief Minister, later Y S Rajasekhar Reedy. Mr Vishnu joined the YSRCP along with large number of his followers at a programme held at Tummalapalli auditorium this evening.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X