వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏ రాజకీయ పార్టీలో చేరే ఆలోచన లేదు, హోదా వస్తే ఉపాధి: లక్ష్మీనారాయణ

By Srinivas
|
Google Oneindia TeluguNews

గుంటూరు: తనకు ఏ రాజకీయ పార్టీలో చేరే ఆలోచన లేదని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ గురువారం అన్నారు. ఆయన గుంటూరు జిల్లా యాజిలిలో రైతులతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా వచ్చిన ఆయనను మీడియా పలకరించింది.

ప్రజలు, రైతుల సమస్యలు తెలుసుకొని తాను తన భవిష్యత్తు ప్రణాళికను ప్రకటిస్తానని చెప్పారు. ఏ రాజకీయ పార్టీలో చేరే ఆలోచన లేదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా వస్తే యువతకు ఉపాధి లభిస్తుందని చెప్పారు.

Former JD Laxminarayana to intaract with farmers in Guntur

కాగా, మహారాష్ట్ర అదనపు డీజీపీ సీబీఐ పూర్వ జేడీ లక్ష్మీనారాయణ స్వచ్ఛంద ఉద్యోగ విరమణకు మహారాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. వీఆర్‌ఎస్‌ కోరుతూ లక్ష్మీనారాయణ ఇటీవల మహారాష్ట్ర డీజీపీకి దరఖాస్తు చేసుకున్నారు.

ఈ మేరకు విఆర్‌ఎస్‌కు ప్రభుత్వం బుధవారం ఆమోదం తెలిపింది. ఐపీఎస్ లక్ష్మీనారాయణ గతంలో డిప్యూటేషన్‌పై ఉమ్మడి ఏపీలో సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా పని చేశారు. నిజాయతీ గల అధికారిగా పేరు తెచ్చుకున్నారు. కొన్ని ముఖ్యమైన కేసుల్లో చూపించిన తెగువతో ఎంతోమంది ఆయనకు అభిమానులుగా మారిపోయారు. అనంతరం లక్ష్మీనారాయణ మహారాష్ట్రకు బదిలీ అయ్యారు.

ఓసారి కలిశాం, మెసేజ్‌లు: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణపై పవన్ కళ్యాణ్ఓసారి కలిశాం, మెసేజ్‌లు: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణపై పవన్ కళ్యాణ్

రాజకీయాల్లోకి వచ్చేందుకు లక్ష్మీనారాయణ ఉద్యోగానికి స్వస్తి చెప్పారని మొదటి నుంచి ప్రచారం సాగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని ఆయన ఖండిస్తున్నారు.

English summary
Former JD Laxminarayana to intaract with farmers in Guntur district on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X