కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గతంలో రెండు సార్లు డిఎల్ వెనక్కి: ఈసారైనా...

By Narsimha
|
Google Oneindia TeluguNews

కడప: 2019 ఎన్నికల్లో కడప జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టేందుకు టిడిపి అధినేత చంద్రబాబునాయుడు వ్యూహలు రచిస్తున్నారు.అయితే మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి టిడిపిలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. గతంలో రెండు దఫాలు డిఎల్ రవీంద్రారెడ్డి టిడిపిలో చేరడాన్ని చివరినిమిషంలో విరమించుకొన్నారు.

టిడిపిలోకి డిఎల్ రవీంద్రారెడ్డి, టిటిడి ఛైర్మెన్‌గా సుధాకర్‌ యాదవ్?టిడిపిలోకి డిఎల్ రవీంద్రారెడ్డి, టిటిడి ఛైర్మెన్‌గా సుధాకర్‌ యాదవ్?


ఇటీవల కడప జిల్లా పర్యటనకు చంద్రబాబునాయుడు వచ్చిన సందర్భంగా డిఎల్ రవీంద్రారెడ్డి సమావేశం కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది. దీంతో డిఎల్ రవీంద్రారెడ్డి టిడిపిలో చేరుతారనే ఊహగానాలకు మరింత బలం చేకూరింది.

కడప జిల్లాలో టిడిపికి బలమైన నాయకుడు అవసరం ఉంది. జిల్లాను సమర్థవంతంగా నడిపే నాయకుడు లేడు. దీంతో ఇతర పార్టీల్లో ఉన్న సమర్ధులైన నేతల కోసం టిడిపి అన్వేషిస్తోంది. ఇందులో భాగంగానే డిఎల్ రవీంద్రారెడ్డిని టిడిపిలోకి ఆహ్వనిస్తోందని సమాచారం.

మైదుకూరు నియోజకవర్గం నుండి 2019 ఎన్నికల్లో డిఎల్ రవీంద్రారెడ్డికి టిడిపి టిక్కెట్టు ఇవ్వడానికి లైన్ క్లియర్ చేస్తున్నారని పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. మైదుకూరు టిడిపి ఇంచార్జీగా ఉన్న పుట్టా సుధాకర్‌యాదవ్‌ను టిటిడి ఇంచార్జీగా నియమించే అవకాశాలున్నాయి.

డిఎల్ రవీంద్రారెడ్డి టిడిపిలో చేరుతారా?

డిఎల్ రవీంద్రారెడ్డి టిడిపిలో చేరుతారా?

2019 ఎన్నికల్లో కడప జిల్లా నుండి ఎక్కువ సంఖ్యలో ఎమ్మెల్యేలను గెలిపించుకోవాలని టిడిపి నాయకత్వం భావిస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు వ్యూహలు రచిస్తున్నారు. మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ నేత డిఎల్ రవీంద్రారెడ్డిని టిడిపిలో చేరేలా వ్యూహలు రచిస్తున్నారు.గతంలో రెండు దఫాలు టిడిపిలో చేరడానికి డిఎల్ రవీంద్రారెడ్డి రంగం సిద్దం చేసుకొన్నారు. చివరి నిమిషంలో డిఎల్ రవీంద్రారెడ్డి టిడిపిలో చేరకుండా కాంగ్రెస్‌లోనే కొనసాగారు.2004 అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాజీ మంత్రి ఎంవి మైసూరారెడ్డితో కలిసి డిఎల్ రవీంద్రారెడ్డి టిడిపిలో చేరుతారని ఆప్పట్లో ప్రచారం సాగింది. అయితే ఎంవి మైసూరారెడ్డి టిడిపిలో చేరారు. కానీ, చివరి నిమిషంలో డిఎల్ రవీంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. 2014 ఎన్నికల సమయంలో కూడ చంద్రబాబునాయుడు డిఎల్ రవీంద్రారెడ్డి చంద్రబాబునాయుడును కలిశారు. టిడిపిలో చేరిడానికి సంసిద్దతను వ్యక్తం చేశారు. కానీ, కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. ప్రస్తుతం డిఎల్ రవీంద్రారెడ్డి టిడిపిలోనే కొనసాగుతారనే ప్రచారం సాగుతోంది. దీంతో ఇప్పుడైనా చేరుతారా లేదా అనేది ఆసక్తి నెలకొంది.

వైఎస్ రాజశేఖర్‌రెడ్డితో పొసగని కారణమే

వైఎస్ రాజశేఖర్‌రెడ్డితో పొసగని కారణమే

కడప జిల్లాలో మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి పొసగని కారణంగానే కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్ళాలనే నిర్ణయం తీసుకొన్నారనే ప్రచారం అప్పట్లో ఉంది. 2004 ఎన్నికల సమయంలో టిడిపిలో చేరాలనే నిర్ణయం తీసుకోవడానికి కూడ ఇదే కారణమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడతారు.టిక్కెట్ల కేటాయింపు విషయంలో వైఎస్ఆర్ తమను అడ్డుకొంటారని, పార్టీలో ప్రాధాన్యత లేకుడా చేస్తారనే కారణంగా మైసూరారెడ్డితో పాటు డిఎల్ రవీంద్రారెడ్డి పార్టీని వీడాలనే నిర్ణయం తీసుకొన్నారనే ప్రచారం అప్పట్లో ఉంది.

 డిఎల్ రవీంద్రారెడ్డి ఎప్పుడో టిడిపిలో చేరేవారు

డిఎల్ రవీంద్రారెడ్డి ఎప్పుడో టిడిపిలో చేరేవారు

2014 ఎన్నికల సమయంలో టిక్కెట్ల కేటాయింపు సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ నుండి టిడిపిలో వలసలు సాగుతున్నాయి. హైద్రాబాద్‌లోని చంద్రబాబునాయుడు నివాసంలో డిఎల్ రవీంద్రారెడ్డి వెళ్ళి చంద్రబాబునాయుడు కలిశారు. టిడిపిలో చేరనున్నట్టు ప్రకటించారు. అయితే టిక్కెట్టు కేటాయింపు విషయంలో మాత్రం స్పష్టత రాలేదు. కడప పార్లమెంట్ స్థానం లేదా మైదుకూరు అసెంబ్లీ టిక్కెట్టు కేటాయిస్తామని ప్రతిపాదన టిడిపి నుండి వచ్చింది. మైదుకూరు అసెంబ్లీ స్థానం వైపే డిఎల్ రవీంద్రారెడ్డి మొగ్గుచూపారు. అయితే అప్పటికే మైదుకూరు ఇంచార్జీగా ఉన్న పుట్టా సుధాకర్‌యాదవ్ పట్టుబట్టడంతో డిఎల్ రవీంద్రారెడ్డి టిడిపిలో చేరకుండా వెనకడుగు వేశారని సమాచారం.

రెడ్యం వెంకటసుబ్బారెడ్డి పరిస్థితి గమ్యం ఏమిటీ?

రెడ్యం వెంకటసుబ్బారెడ్డి పరిస్థితి గమ్యం ఏమిటీ?

మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గంలో టిడిపిలో సీనియర్ నాయకుడుగా ఉన్న రెడ్యం వెంకటసుబ్బారెడ్డి తన రాజకీయ భవిష్యత్‌పై ఆందోళనతో ఉన్నారు.ఎంతోకాలంగా పార్టీని నమ్ముకొని పనిచేసినా ఇంతవరకు తనకు ప్రాధాన్యం దక్కలేదన్న అసంతృప్తి వెంకటసుబ్బారెడ్డిలో వుంది. పార్టీ అధికారంలోకి వచ్చాక ఆయనకు నామినేటెడ్‌ పదవి ఇచ్చి ప్రాధాన్యం కల్పిస్తారని ఆయనతో పాటు ఆయన వర్గీయులు ఆశతో వుంటూ వచ్చారు. కానీ, ఇంతవరకు నామినేట్ పదవి వెంకటసుబ్బారెడ్డికి దక్కలేదు. ఇందుకు తోడు డీఎల్‌ రవీంద్రారెడ్డి టిడిపిలో చేరితే ఇప్పటివరకు ఆయనతో రాజకీయంగా వైరంగా ఉన్న రెడ్యం వెంకటసుబ్బారెడ్డి

ఏ రకంగా స్పందిస్తారనే ఆసక్తి కల్గిస్తోంది.

మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి

మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి

టిడిపిలో చేరే విషయమై మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి ఆచితూచి అడుగులు వేస్తున్నారు. టిడిపిలో డిఎల్ రవీంద్రారెడ్డి చేరుతారనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో డిఎల్ అనుచరులు ఆయనను కలిసిపోతున్నారు. అనుచరుల అభిప్రాయాలు కూడ డిఎల్ రవీంద్రారెడ్డి తీసుకొంటున్నారు.టిడిపిలో చేరితే కలిగే ప్రయోజనాలు ఏమిటి,? ప్రత్యామ్నాయాలున్నాయా? అనే విషయాలపై అనుచరులతో డిఎల్ చర్చిస్తున్నారు.

English summary
Former minister, senior Congerss leader DL Ravindra Reddy may join in Tdp soon. There Was rumour in 2004 and 2014 DL Ravindra Reddy may join in Tdp, But He is contunued in Congress party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X