• search
 • Live TV
కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

వైసీపీకి డీఎల్ రవీంద్రారెడ్డి గుడ్ బై ? జగన్ సర్కార్ పై ఫైర్-సజ్జలపైనా విసుర్లు-వచ్చే ఎన్నికల్లో పోటీ

|
Google Oneindia TeluguNews

వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమకాలీనుడు, మాజీ మంత్రి, కడప జిల్లాకు చెందిన వైసీపీ సీనియర్ నేత డీఎల్ రవీంద్రారెడ్డి త్వరలో ఆ పార్టీకి గుడ్ బై చెప్పే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు రెండేళ్లుగా అసంతప్తిగా ఉన్న ఆయన.. ఇవాళ బహిరంగంగా గొంతు విప్పారు. సొంత పార్టీ విధానాలపై ఇవాళ డీఎల్ రవీంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. సీఎం జగన్ తో పాటు వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డిని డీఎల్ టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది.

సంచలనాల డీఎల్ రవీంద్రారెడ్డి

సంచలనాల డీఎల్ రవీంద్రారెడ్డి

ఎప్పుడో 80వ దశకంలో అప్పటి కాంగ్రెస్ నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డితో పాటు రాజకీయాల్లోకి ప్రవేశించిన డీఎల్ రవీంద్రారెడ్డికి ఫైర్ బ్రాండ్ నేతగా పేరుంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేసిన డీఎల్ రవీంద్రారెడ్డి వైఎస్ మరణం తర్వాత
సైలెంట్ అయ్యారు. ఆ తర్వాత టీడీపీలో చేరిపోయారు. చివరికి మొన్నటి ఎన్నికలకు ముందు వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. అప్పట్లో జగన్ కు ఇచ్చిన హామీ మేరకు కడప జిల్లా మైదుకూరులో వైసీపీ అభ్యర్ధి శెట్టిపల్లి రఘురామిరెడ్డి విజయం కోసం పనిచేశారు. అయితే ఎప్పుడు ఎక్కడ ఉన్నా రవీంద్రారెడ్డి తన సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. కానీ రెండేళ్లుగా ఆయన ఎక్కడా బహిరంగ వ్యాఖ్యలు చేయడం లేదు. ఇవాళ మాత్రం ఒక్కసారిగా సొంత పార్టీ సర్కార్ పై విరుచుకుపడ్డారు.

 జగన్ సర్కార్ పై డీఎల్ ఫైర్

జగన్ సర్కార్ పై డీఎల్ ఫైర్

రెండేళ్లుగా వైసీపీలోనే ఉన్నప్పటికీ ఎక్కడా కనిపించని డీఎల్ రవీంద్రారెడ్డి.. ఇవాళ మాత్రం ఒక్కసారిగా సొంత పార్టీ వైసీపీ సర్కార్ పైనే విరుచుకుపడ్డారు. ఏపీలో దురదృష్టకరమైన పరిస్థితులు నెలకొన్నాయని, వ్యవసాయం సంక్షోభంలో పడిపోయిందని డీఎల్ సంచలన విమర్శలు చేశారు. రైతును పట్టించుకునే నాథుడే లేడని, పొలాన్ని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసే కౌలు రైతు కరువయ్యాడన్నారని అన్నారు. తన సొంత పొలాన్ని కౌలుకు ఇద్దామనుకున్నా ఎవరూ ముందుకు రావడం లేదన్నారు.

 సొంత ఖజానా నింపుకుంటున్న పాలకులు

సొంత ఖజానా నింపుకుంటున్న పాలకులు


వైసీపీ ప్రభుత్వంపై డీఎల్ రవీంద్రారెడ్డి మరో సంచలన ఆరోపణ కూడా చేశారు. ప్రభుత్వాన్ని పాలిస్తున్న పాలకులు సొంత ఖజానా నింపుకోవడమే ధ్యేయంగా పనిచేస్తున్నారని డీఎల్ రవీంద్రారెడ్డి ఆరోపించారు. తద్వారా ఆయన నేరుగా జగన్నే టార్గెట్ చేసినట్లు అర్ధమవుతోంది. సొంత జిల్లాలో ఎదురవుతున్న పరిస్ధితులు, వైసీపీ నేతల తీరుతో మనస్తాపం చెందిన డీఎల్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. అయితే అదే జిల్లాకు చెందిన సీఎం జగన్ పై సొంత ఖజానా నింపుకుంటున్నారంటూ చేసిన వ్యాఖ్యలు మాత్రం కలకలం రేపుతున్నాయి.

సజ్జలపైనా డీఎల్ విసుర్లు

సజ్జలపైనా డీఎల్ విసుర్లు

సీఎం జగన్ తో పాటు ఆయన తర్వాత వైసీపీ సర్కార్ లో నంబర్ టూగా చెలామణి అవుతున్న ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపైనా డీఎల్ ఇవాళ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ఏ శాఖ మంత్రి ఆ శాఖకు సంబంధించి ప్రెస్ మీట్ పెట్టడం లేదని, దారినపోయే వారందరూ మీడియా సమావేశాలు పెడుతున్నారని సజ్జలను ఉద్దేశించి ఘాటుగా విమర్శించారు. ఇప్పటికే సజ్జల దూకుడుపై సొంత పార్టీ నేతలు ఒక్కొక్కరుగా స్వరం పెంచుతున్న నేపథ్యంలో డీఎల్ కూడా అదే అంశాన్ని టార్గెట్ చేస్తూ సజ్జలపై ఈ విమర్శలు చేయడం విశేషం.

  Weather : Heavy Rains Till Oct 17 Due To Low Pressure || Oneindia Telugu
  వైసీపీకి డీఎల్ గుడ్ బై ? వచ్చే ఎన్నికల్లో పోటీ

  వైసీపీకి డీఎల్ గుడ్ బై ? వచ్చే ఎన్నికల్లో పోటీ


  వైసీపీ ప్రభుత్వ విధానాలపై విమర్శలు గుప్పించిన డీఎల్ రవీంద్రారెడ్డి.. సమాజంలో జరుగుతున్న అక్రమాలపై పాలకులనుమీడియా ప్రశ్నించాలన్నారు. రాష్ట్రంలో రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను 2024 ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తానని రవీంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికే వైసీపీలో ఉన్న డీఎల్ పోటీ చేసేందుకు నియోజకవర్గం కూడా ఖాళీ లేదు దీంతో వైసీపీకి గుడ్ బై చెప్పి ఆయన టీడీపీ లేదా మరో పార్టీ తరఫున బరిలోకి దిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మొన్నటి ఎన్నికలకు ముందే వైసీపీలో చేరడంతో పాటు కడప జిల్లాలో వైసీపీ అభ్యర్ధులకు మద్దతు ఇచ్చిన డీఎల్ రవీంద్రారెడ్డి జగన్ తో కలిసి ప్రచారంలోనూ పాల్గొన్నారు. ఈ రెండేళ్లలో మారిన పరిస్ధితుల్లో ఆయన వైసీపీలో ఇమడలేకపోతున్నట్లు ఆయన కామెంట్స్ బట్టి తెలుస్తోంది.

  English summary
  former minister and ysrcp leader dl ravindra reddy on today lambasted on his own party government's policies amid party change rumours.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X