వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన మాజీ మంత్రి కన్నా, వైసీపీలో చేరిక వాయిదా?

By Narsimha
|
Google Oneindia TeluguNews

గుంటూరు:మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బుధవారం నాడు అస్వస్థతకు గురయ్యారు. బీపీ, షుగర్‌తో బాధపడుతూ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నా లక్ష్మీనారాయణ చేరారు. ప్రస్తుతం జిజెపిలో ఉన్న కన్నా లక్ష్మీనారాయణ ఇవాళ వైసీపీలో చేరేందుకు ముహుర్తాన్ని పెట్టుకొన్నారు.

బిజెపిలో చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో బిజెపిని వీడి వైసీపీలో చేరాలని కన్నా లక్ష్మీనారాయణ ప్లాన్ చేసుకొంటున్నారని వార్తలు వెలువడుతున్నాయి.ఈ తరుణంలో కన్నా లక్ష్మీనారాయణ ఆసుపత్రిలో చేరారు.

Former minister Kanna Lakshmi narayana admitted in hospital for ill

కన్నా లక్ష్మీనారాయణకు రెండు రోజుల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు.ఈ సూచన మేరకు కన్నా లక్ష్మీనారాయణ విశ్రాంతి తీసుకొంటున్నారు.
2014 ఎన్నికల సమయంలో కన్నాలక్ష్మీనారాయణ కాంగ్రెస్ పార్టీ నుండి బిజెపిలో చేరారు.

అప్పటి నుండి ఆయన బిజెపిలో ఉన్న కన్నా లక్ష్మీనారాయణ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పాలని భావిస్తున్నారు. కన్నా లక్ష్మీనారాయణ బిజెపికి గుడ్ బై చెప్పినట్టుగా కూడ ప్రచారం సాగుతోంది. కానీ, ఈ విషయమై స్పష్టత రావాల్సి ఉంది. వైసీపీలో చేరాలని ముహుర్తంగా పెట్టుకొన్న రోజే అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరడం గమనార్హం.

అనారోగ్యంతో కన్నా లక్ష్మీనారాయణ ఆసుపత్రిలో చేరడంతో వైసీపీలో చేరిక వాయిదా పడినట్టుగా ఆయన అనుచరులు చెబుతున్నారు.

English summary
Former minister Kanna Lakshminarayana admitted in private hospital on Wednesday morning at Guntur. He is suffering from ill.Doctors advised to him take rest for two days
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X