విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టిడిపిలో చేరుతా, కానీ, వైఎస్ఆర్, బాబుపై ప్రశంసలు, పవన్కు కొణతాల ఫోన్

ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం పోతోందనుకొంటే తాను టిడిపిలో చేరే విషయాన్ని ఆలోచిస్తానని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ చెప్పారు.కొంత కాలంగా ఆయన టిడిపిలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. తాజాగా ఆయన చేసిన ప్రకటనతో మరో

|
Google Oneindia TeluguNews

విశాఖపట్టణం: ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం పోతోందనుకొంటే తాను టిడిపిలో చేరే విషయాన్ని ఆలోచిస్తానని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ చెప్పారు.కొంత కాలంగా ఆయన టిడిపిలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. తాజాగా ఆయన చేసిన ప్రకటనతో మరోసారి ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.

కొంతకాలంగా మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ టిడిపిలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. అయితే ఆయనను టిడిపిలో చేర్చుకొనేందుకుగాను ఆ పార్టీ నాయకత్వం కూడ సిద్దంగానే ఉంది. అయితే ఆయన ఇటీవల ఉత్తరాంధ్ర అభివృద్ది కోసమంటూ చర్చా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

టిడిపిలో చేరేందుకు అన్ని సానుకూలంగా ఉన్నప్పటికీ ఆ పార్టీలో చేరడానికి ఆయన వెనకడుగు వేస్తున్నాడు. టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు సహా పార్టీలో ఇతర నాయకులు కూడ ఆయనను పార్టీలోకి తీసుకొనేందుకు సానుకూలంగానే ఉన్నామనే సంకేతాలు ఇచ్చారు.

వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత ఆయన రాజకీయాలకు కొంత దూరంగా ఉన్నారు. అయితే టిడిపిలో చేరేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నారని ప్రచారం సాగింది. అయితే ప్రస్తుతం ఉత్తరాంధ్ర అభివృద్ది, విశాఖలో ప్రజాసమస్యలపై ఆయన చర్చకార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

అలా అయితే టిడిపిలో చేరేందుకు సిద్దమే

అలా అయితే టిడిపిలో చేరేందుకు సిద్దమే

ఉత్తరాంధ్ర అభివృద్ది కోసం టిడిపిలో చేరేందుకు కూడ సిద్దమేనని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ వ్యాఖ్యానించారు.మహనాడుకు రెండు రోజుల ముందు టిడిపిలో చేరితే మహనాడు వేదికపై ఉత్తరాంధ్ర సమస్యలపై కొణతాలకు మాట్లాడే అవకాశం కల్పిస్తామని మంత్రి అయ్యన్నపాత్రుడు ప్రకటించారు.


అయితే ఈ ప్రకటన తర్వాత కొణతాల తాజాగా చేసిన ప్రకటన మరోసారి రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.తాను టిడిపిలో చేరితే ఉత్తరాంధ్ర అభివృద్ది జరుగుతోందనుకొంటే ఆ పార్టీలో చేరే విషయాన్ని పరిశీలిస్తానని ఆయన చెప్పుకొచ్చారు.

 పవన్ కు కొణతాల ఫోన్

పవన్ కు కొణతాల ఫోన్


ఉత్తరాంధ్ర వెనుకబాటుతనంపై నిర్వహించే చర్చా వేదికకు హాజరుకావాలని జనసేన చీఫ్, సినీ నటుడు పవన్ కళ్యాణ్ ను తాను కోరినట్టు కొణతాల రామకృష్ణ చెప్పారు.అయితే తాను పవన్ కళ్యాణ్ ను నేరుగా కలవలేదని చెప్పారు. అయితే ఈ చర్చ వేదికలో పాల్గొనేందుకు పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించారని చెప్పారు. తాను భేషజాలు లేకుండా అన్నిపార్టీల నాయకులను కలుపుకొని ఉత్తరాంధ్ర అభివృద్దికోసం పనిచేస్తున్నట్టు చెప్పారు.ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం పోయేంతవరకు పోరాటం సాగిస్తానని చెప్పారు.

వైఎస్, బాబుపై ప్రశంసలు

వైఎస్, బాబుపై ప్రశంసలు

పోలవరం ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఈ పనులను చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజల గుండెల్లో నిలిచిపోతారని కొణతాల చెప్పారు. ఏ రాజకీయపార్టీ అండదండలేకుండా సుజలస్రవంతి సాధన కమిటీ ద్వారా సాగునీటి ప్రాజెక్టుల సాధనకు పోరాటం చేస్తున్నట్టుచెప్పారు.ఉత్తరాంధ్ర సుజల స్రవంతి తొలిదశకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 2114 కోట్లు మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

స్థానికేతరుల వల్లే సెంట్రల్ యూనివర్శిటీ తరలిపోయింది

స్థానికేతరుల వల్లే సెంట్రల్ యూనివర్శిటీ తరలిపోయింది


గతంలో విశాఖ ఎంపీగా పురంధరేశ్వరీ ఉన్న సమయంలో సెంట్రల్ యూనివర్శిటీ మంజూరైందన్నారు. అయితే ఈ యూనివర్శిటీ అనంతపురానికి తరలిపోయిందన్నారు. కొంతమంది ప్రజాప్రతినిధులు స్థానికేతరులు కావడం వల్లే ఇలా జరిగిందని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడినుండైనా పోటీచేయవచ్చన్నారు.అయితే గెలిపించిన ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలని ఆయన కోరారు.విశాఖకు ప్రత్యేక రైల్వేజోన్, గిరిజన యూనివర్శిటీ, ఎయిమ్స్, మెట్రో రైలు, సాగునీటి ప్రాజక్టులు పూర్తి చేయాలని ఆయన కోరారు.

ఉత్తరాంధ్ర వెనుకబాటుతనంపై అఖిలపక్షం

ఉత్తరాంధ్ర వెనుకబాటుతనంపై అఖిలపక్షం


ఉత్తరాంధ్ర వెనుకబాటుతనంపై త్వరలోనే అఖిలక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమానికి హాజరుకావాలని వైసీపీ అధినేత జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ, టిడిపి నాయకులకు ఆహ్వానాలు పంపినట్టు చెప్పారు.విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో కూడ వెనుకబాటుతనంపై చర్చావేదికలు నిర్వహిస్తామన్నారు.

English summary
Former minister Konathala Ramakrishna will conduct a meeting on Uttarandhra backwardness soon. He invited YSRCP chief YS Jagan, Janasena chief Pawan kalyan, Tdp and Bjp party leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X