వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నంద్యాల ఎఫెక్ట్: శాసనమండలి ఛైర్మెన్‌గా ఫరూక్‌‌ నియామకం

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్మెన్‌గా ఎన్ఎండి ఫరూక్‌ను నియమిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు.

నంద్యాల ఉపఎన్నికల నేపథ్యంలో మాజీ మంత్రి ఫరూక్‌కు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు చంద్రబాబునాయుడు. అయితే ముస్లింలకే శాసనమండలి ఛైర్మెన్ పదవిని కూడ కట్టబెట్టనున్నట్టు ఆయన ప్రకటించారు.

ఈ హమీమేరకు శాసనమండలి ఛైర్మెన్ పదవి ఫరూక్‌కు దక్కింది. గతంలో శాసనమండలి ఛైర్మెన్ పదవిని శిల్పా చక్రపాణిరెడ్డికి ఇస్తానని చంద్రబాబునాయుడు హమీ ఇచ్చారు. అయితే శిల్పా మోహన్‌రెడ్డి టిడిపిని వీడారు. మోహన్‌రెడ్డి పార్టీ మారిన కొన్ని రోజులకు శిల్పా చక్రపాణిరెడ్డి కూడ టిడిపిని వీడి వైసీపీలో చేరారు.

Former minister NMD Farooq got MLC chairman post

వైసీపీలో చేరిన తర్వాత శిల్పా చక్రపాణిరెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు.ఈ రాజీనామాను ఆగష్టు 15, 2017న, ఆమోదం పొందింది. అయితే శిల్పా సోదరులు టిడిపిని వీడడంతో పాటు నంద్యాల ఉప ఎన్నికలు ఫరూక్‌కు కలిసివచ్చింది.

నంద్యాల ఉప ఎన్నికల్లో ముస్లిం ఓట్లు గెలుపుఓటములపై ప్రభావం చూపనున్నాయి.దీంతో చంద్రబాబునాయుడు ఫరూక్‌కు ఎమ్మెల్సీ పదవితో పాటు శాసనమండలి ఛైర్మెన్ పదవిని కట్టబెట్టారు. అమరావతిలో సోమవారం జరిగిన టిడిపి వర్క్‌షాప్‌లో చంద్రబాబునాయుడు ఫరూక్‌కు శాసనమండలి ఛైర్మెన్ పదవిని ఇవ్వనున్నట్టు ప్రకటించారు.

English summary
Former minister NMD Farooq got MLC chairman post.Ap chiefminister Chandrababu Naidu announced this post in Tdp workshop held at Amaravati on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X