వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీడీపీకి మరో షాక్ ... జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి

|
Google Oneindia TeluguNews

స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో టీడీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. మొన్నటికి మొన్న మాజీ మంత్రి డొక్కా మాణిక్య వర ప్రసాద్ వైసీపీ తీర్ధం పుచ్చుకుంటే , ఇటీవల కడప జిల్లా పులివెందులకు చెందిన కీలక నాయకుడు సతీష్ రెడ్డి వైసీపీ బాట పట్టారు. ఇక వీరే కాదు మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు వైసీపీకి జై కొడుతుండగా ఇక మాజీ మంత్రి , టీడీపీ కీలక నేత రామ సుబ్బా రెడ్డి నేడు వైసీపీ లో చేరి చంద్రబాబుకు భారీ షాక్ ఇచ్చారు .

 జగన్ సమక్షంలో వైసీపీ తీర్ధం పుచ్చుకున్న మాజీమంత్రి డొక్కా: చేరికపై ఏమన్నారంటే జగన్ సమక్షంలో వైసీపీ తీర్ధం పుచ్చుకున్న మాజీమంత్రి డొక్కా: చేరికపై ఏమన్నారంటే

వైసీపీలో చేరిన టీడీపీ కీలక నేత రామసుబ్బారెడ్డి

వైసీపీలో చేరిన టీడీపీ కీలక నేత రామసుబ్బారెడ్డి

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో రాజకీయ వలసలకు తెరలేపింది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. టీడీపీని ఎన్నికల సమయంలో దెబ్బ కొట్టే పనిలో ఉంది. టీడీపీలో ఒక అనిశ్చితి వాతావరణం క్రియేట్ చేసి మైండ్ గేమ్ ఆడుతుంది. అందులో భాగంగా భారీగా వలసలను ప్రోత్సహిస్తుంది. దీంతో, తెలుగు దేశం పార్టీ నుంచి క్రమంగా వైసీపీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే టీడీపీ కీలక నేత రామ సుబ్బా రెడ్డి ఫ్యాన్ పార్టీలో చేరారు.

Recommended Video

AP CM Jagan Ties With Ambani | 4 YSRCP Candidates File Nominations For RS Election | Oneindia Telugu
రామసుబ్బారెడ్డికి కండువా కప్పి ఆహ్వానించిన సీఎం జగన్

రామసుబ్బారెడ్డికి కండువా కప్పి ఆహ్వానించిన సీఎం జగన్


ఇక నేడు సాయంత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూటికి చేరారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి రామ సుబ్బారెడ్డి. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ను కలసిన ఆయన జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక సీఎం జగన్ రామసుబ్బారెడ్డికి కండువా కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు . అయితే సుదీర్ఘకాలం పాటు టీడీపీలో కొనసాగిన రామ సుబ్బారెడ్డి టీడీపీలో కీలకంగా పని చేశారు. టీడీపీలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న ఆయన సుదీర్ఘ కాలం పని చేశారు.

 స్థానిక సంస్థల ఎన్నికల వేళ టీడీపీకి మరో షాక్

స్థానిక సంస్థల ఎన్నికల వేళ టీడీపీకి మరో షాక్


తన చిరకాల శత్రువు ఆదినారాయణరెడ్డి టీడీపీలోకి వచ్చినా కూడా టీడీపీలోనే కొనసాగిన రామసుబ్బారెడ్డి ఇంత కాలానికి ఇప్పుడు వైసీపీలో చేరిపోయారు. రామ సుబ్బా రెడ్డి మాత్రమే కాదు చాలా మంది కీలక నాయకులు కూడా టీడీపీ వీడి వైసీపీలో చేరబోతున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. ఎన్నికల సమయంలో చోటు చేసుకున్న ఈ వలసలతో టీడీపీ ఎన్నికలలో ఫెయిల్ అవుతుందనే భావనలో ఉంది వైసీపీ .

English summary
Former minister Rama subbareddy joined in YCP in the presence of CM YS Jagan Mohan Reddy. At the Jagan residence in Tadepally, Rama subbareddy was warmly welcomed into the YCP . He was asked to work for the party. He resigned to the TDP and gave shock to chandrababu at the local body election time . this is a mind game of ycp in the local body election time to defeat tdp .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X