ఒంగోలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజకీయ ఒత్తిళ్లా?: మాజీ ఎమ్మెల్యే అరెస్ట్, విద్యార్థుల హంగామా, ఉద్రిక్తత

By Srinivas
|
Google Oneindia TeluguNews

ఒంగోలు: మాజీ ఎమ్మెల్యే, ప్రకాశం జిల్లా చీమకుర్తిలోని బివీఎస్సార్ ఇంజినీరింగ్ కళాశాల అధినేత బూచేపల్లి సుబ్బారెడ్డి అరెస్టును నిరసిస్తూ ఆయన కళాశాల విద్యార్థులు నానా హంగామా సృష్టించారు. సుబ్బారావు అనే వ్యక్తి ఒంటి పైన కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు.

విద్యార్థిని అనూష ఆత్మహత్యకు, తమ కళాశాల అధినేత సుబ్బారెడ్డికి ఎలాంటి సంబంధం లేదని విద్యార్థులు చెప్పారు. సుబ్బారెడ్డిని వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. కాలేజీ ఎదుట విద్యార్థులు, కళాశాలకు చెందిన సిబ్బంది హంగామా చేసింది.

ఆత్మహత్యకు ప్రయత్నించిన సుబ్బారావు కళాశాలకు చెందిన బస్సు డ్రైవర్‌గా తెలుస్తోంది. ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, సుబ్బారెడ్డి వైసిపి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని, రాజకీయ ఒత్తిళ్లతోనే అతనిని అదుపు చేశారని విమర్శిస్తున్నారు. సోమవారం స్థానికంగా ఉద్రిక్తత కనిపించింది.

Former MLA arrest: Tension at College

కాగా, ప్రకాశం జిల్లా చీమకుర్తిలోని బీవీఎస్సాఆర్ ఇంజనీరింగ్ కళాశాల అధినేత, దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డికి అద్దంకి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. ఆయనను ఒంగోలు ఉపకారాగారానికి తరలించారు.

కళాశాల విద్యార్థిని అనూష ఆత్మహత్య కేసులో ఆయనతో పాటు కళాశాల హెచ్ఓడీ మాలకొండా రెడ్డిని కూడా అరెస్టు చేశారు. అనంతరం కోర్టు ముందు ప్రవేశపెట్టారు. ఆయనకు కోర్టు రిమాండ్ విధించింది.

చీమకుర్తిలోని ఇంజినీరింగ్ కళాశాలలో ఇటీవల ఓ విద్యార్థిని అనూష ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనకు సంబంధించి ఆమె రాసుకున్న సూసైడ్ నోట్లో ఉన్న అంశాల ఆధారంగా సుబ్బారెడ్డని, కళాశాల హెచ్ఓడీ మాలకొండా రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.

English summary
Former MLA Buchepalli Subba Reddy arrest: Tension at College
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X