వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బోటు ప్రమాదం వెనుక పెద్దల హస్తం: మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సంచలన ఆరోపణ

|
Google Oneindia TeluguNews

కచ్చులూరు వద్ద గోదావరిలో జరిగిన బోటు ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో పెను విషాదాన్ని నింపింది. ఇంకా ఈ బోటు ప్రమాద మృతులు 16 మంది జలసమాధి లోనే ఉన్నారు. బోటును బయటకు తీయడంలో విఫలమైన నిపుణులు చేతులు పైకెత్తి కొద్దిరోజులు ఆగాలని తేల్చి అక్కడి నుండి వెళ్ళిపోయారు. అయితే బోటు ప్రమాద సమయంలో బోట్ లో ఉన్నవారు 93 మంది అని మాజీ మంత్రి హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఆయన బాటలోనే మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఈ ప్రమాదం వెనకాల చాలా పెద్ద స్కామ్ ఉందని సంచలన ఆరోపణలు చేస్తున్నారు.

ఈ ప్రమాదం గురించి మాట్లాడడం కోసం ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు కొన్ని సంచలన వాఖ్యలు చేశారు.
గోదావరి బోటు ప్రమాద ఘటన వెనుక పెద్దల హస్తం ఉందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇక అదేంటో నిరూపణ కావాలంటే బోటు డ్రైవర్ కాల్ డేటా బయటకు తీయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర పోలీసు యంత్రాంగం ఈ కోణంలో కచ్చితంగా చర్యలు తీసుకోవాలని, డ్రైవర్ కాల్ డేటాను తప్పనిసరిగా పరిశీలించాలని ఆయన పేర్కొన్నారు.

Former MLA Jyothula Nehru sensational comments on boat mishap

అలా చేసినట్లయితే నిజానిజాలు బయటకు వస్తాయని జ్యోతుల నెహ్రూ, బోటు ప్రమాద స్కామ్ నుండి చాలామంది పెద్ద నేతలు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సచివాలయ ఉద్యోగాల భర్తీలో పారదర్శకత చూపించలేదని విమర్శలు గుప్పించిన జ్యోతుల నెహ్రూ రివర్స్ టెండరింగ్ తరహాలోనే రివర్స్ ఎగ్జామ్స్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్‌తో స్నేహం కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టవద్దని , రాష్ట్ర ప్రజల భవిష్యత్తు నాశనం చేయవద్దని చెప్పిన జ్యోతుల నెహ్రూ సీఎం జగన్మోహన్ రెడ్డిని కోరారు.

English summary
Former MLA Jyothula Nehru has made sensational comments on Godavari Boat mishap incident. Speaking to media, he ​​alleges that the politicians hand was involved in the accident. He demanded that the boat driver's call data be pulled out to prove it. He added that the state police must act strictly in this sense and that the driver call data must be examined.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X