వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అనుచరులతో కలిసి వైసీపీలో చేరిన కాటసాని రాంభూపాల్ రెడ్డి

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆదివారం నాడు వైసీపీలో చేరారు. వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్రలో భాగంగా కృష్ణా జిల్లాలో యాత్ర సాగుతోంది. ఈ యాత్రలో భాగంగా కనుమూరు సమీపంలో కాటసాని రాంభూపాల్ రెడ్డి జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరారు.

పాణ్యం టిక్కెట్టు నాదే: గౌరు , వచ్చే ఎన్నికల్లో పాణ్యం నుండే పోటీ: కాటసాని, ఏం జరుగుతోంది? పాణ్యం టిక్కెట్టు నాదే: గౌరు , వచ్చే ఎన్నికల్లో పాణ్యం నుండే పోటీ: కాటసాని, ఏం జరుగుతోంది?

నాలుగు రోజుల క్రితం కాటసాని రాంభూపాల్ రెడ్డి బిజెపికి రాజీనామా చేశారు. కాటసాని రాంభూపాల్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు కూడ బిజెపికి గుడ్‌బై చెప్పారు.అనుచరులతో కలిసి కాటసాని రాంభూపాల్ రెడ్డి జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.

Former MLA Katasani Rambhupal Reddy joins in Ysrcp

కాటసాని రాంభూపాల్ రెడ్డికి వైసీపీ కండువాను కప్పి జగన్ ఆయనను పార్టీలోకి ఆహ్వనించారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో పాణ్యం నియోజకవర్గం అభివృద్ది చెందిందని ఆయన గుర్తు చేశారు.వైఎస్ తనయుడు జగన్‌తో కలిసి పనిచేయడం తన అదృష్టమన్నారు.ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో సర్కార్ వైఫల్యం చెందిందని ఆయన విమర్శలు గుప్పించారు.

అనుచరులతో ఏప్రిల్ 18న కాటసాని సమావేశం, బిజెపికి షాకిస్తారా?అనుచరులతో ఏప్రిల్ 18న కాటసాని సమావేశం, బిజెపికి షాకిస్తారా?

మరో వైపు వచ్చే ఎన్నికల్లో తాను పాణ్యం నియోజకవర్గం నుండి పోటీ చేస్తానని కాటసాని రాంభూపాల్ రెడ్డి ప్రకటించారు. పాణ్యం నుండి సిట్టింగ్ ఎమ్మెల్యేగా వైసీపీకి చెందిన గౌరు చరితా రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే పాణ్యం నుండి తనకే టిక్కెట్టు ఇస్తానని వైఎస్ జగన్ హమీ ఇచ్చారని గౌరు చరితారెడ్డి ఇటీవలనే ప్రకటించారు.

English summary
former Bjp leader Katasani Rambhupal Reddy joined in Ysrcp on Sunday at Kanumur village in Krishna district, Katasani Rambhupal Reddy was resigned to Bjp four days back.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X