వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్పీకర్‌ను అముదాలవలస సెంటర్‌లో నిలబెడతాం... టీడీపీ మాజీ ఎమ్మెల్యే

|
Google Oneindia TeluguNews

ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలు రాజకీయా దుమారాన్ని రేపుతున్నాయి. నేరుగా స్పీకర్ స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై చేసిన వ్యాఖ్యలు ఏపీలో హట్‌ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా వారు హాయ్‌ల్యాండ్ భూములను కొట్టేయాలని చంద్రబాబు నాయుడుతోపాటు ఆయన కుమారుడు లోకేష్‌లు కుట్రలు పన్నారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు సైతం తన వద్ద ఉన్నాయని ఆయన చెప్పారు.

 తమ్మినేని రాజీనామా చేయాలి

తమ్మినేని రాజీనామా చేయాలి

దీంతో స్పీకర్ తమ్మినేని సీతారాంపై టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. స్పికర్ స్థాయిలో ఉండి ఒక పార్టీకి కొమ్ముకాస్తున్న ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. స్పీకర్‌కు దమ్ముంటే అగ్రిగోల్డ్ వ్యవహరం పై సభలో చర్చపెట్టాలని డిమాండ్ చేశారు. స్పీకర్ స్థాయిని దిగజార్చి మాట్లాడవద్దని పలువురు నేతలు హితవు పలికారు. ఈనేపథ్యంలోనే టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ విరుచుకుపడ్డారు. స్పీకర్‌కు రాజకీయాలు చేయాలనే కోరిక ఉంటే రాజీనామా చేసి బయటకు రావాలని అన్నారు.

ఉత్తమాటలు చెప్పడంలో స్పీకర్ ‌దిట్టా

ఉత్తమాటలు చెప్పడంలో స్పీకర్ ‌దిట్టా

ఇక స్పీకర్ సీతారాం గురించి మొత్తం శ్రీకాకుళం జిల్లా ప్రజలకు తెలుసని, ఆయన డాంబికాలు కొట్టడడంలో దిట్ట అని పేర్కోన్నారు. సీతారాం చంద్రబాబు గుడ్డలు ఊడబీకడం కాదు... అవసరమైతే స్పీకర్ గుడ్డలు ఊడబీకి అముదాల వలసలో నిలబెడతామని ఆయన హెచ్చరించారు. స్పీకర్‌గా ఉన్న వ్యక్తి ఎప్పుడు ఏ బాష మాట్లాడాలో తెలుసుకోవాలని అన్నారు. రాజ్యంగబద్దమైన పదవిలో ఉండి రాజకీయాలు మాట్లాడితే ప్రజలు క్షమించరని అన్నారు.

 దమ్ముంటే అగ్రిగోల్డ్‌పై సభలో చర్చించండి

దమ్ముంటే అగ్రిగోల్డ్‌పై సభలో చర్చించండి

అగ్రిగోల్డ్ గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీ లేదని రవికుమార్ అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ఆర్ అధికారంలో ఉన్నప్పుడే అగ్రిగోల్డ్ సంస్థ తన కార్యకలాపాలను విస్తృతం చేసిందని అన్నారు. ఇందుకు కారణం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాదా అని ప్రశ్నించారు. అగ్రిగోల్డ్ సంస్థలపై వాస్తవాలను దాచిపెట్టి ప్రజలకు అబద్దాలు చెబుతున్న స్పీకర్‌కు సిగ్గులేదా అంటూ ఆయన ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రితో పాటు పార్టీకి దమ్ముంటే అసెంబ్లీతోపాటు పీఏసీ సమావేశంలో ఎజెండాలో పెట్టి చర్చించాలని ఆయన డిమాండ్ చేశారు. రాజ్యంగబద్దమైన స్పీకర్ పదవిని ముఖ్యమంత్రి పాదల దగ్గర పెట్టారని ఆయని తీవ్రంగా మండిపడ్డారు. కాగా కూన రవికుమార్ స్పీకర్ తమ్మినేనికి మేనళ్లుడు. గత ఎన్నికల్లో రవికుమార్ పై సీతారాం పోటి చేసి గెలుపోందారు.

English summary
AP speaker Tammineni Sitaram comments on agrigold have become a hot topic. he made serious allegations on chandrababu naidu directly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X