విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నా కూతురు పద్మలత జోలికి రావొద్దని డిఎస్పీని హెచ్చరించా: మాజీ ఎమ్మెల్యే

పోలీస్‌ ఉన్నతాధికారి హోదాలో వున్న దాసరి రవిబాబు, తమ కుటుంబంలో ఒక సభ్యుడిగా మెలిగిన గేదెల రాజు తమను నమ్మించి మోసం చేశారని పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే కాకర నూకరాజు ఆరోపించారు.మంగళవారం చినగుమ్ములూరులోని

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: పోలీస్‌ ఉన్నతాధికారి హోదాలో వున్న దాసరి రవిబాబు, తమ కుటుంబంలో ఒక సభ్యుడిగా మెలిగిన గేదెల రాజు తమను నమ్మించి మోసం చేశారని పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే కాకర నూకరాజు ఆరోపించారు.

మాజీ ఎమ్మెల్యే కూతురుతో సంబంధం, హత్యకు రూ.కోటి, రౌడీషీటర్ హత్య: ఈ డీఎస్పీ మామూలోడు కాదుమాజీ ఎమ్మెల్యే కూతురుతో సంబంధం, హత్యకు రూ.కోటి, రౌడీషీటర్ హత్య: ఈ డీఎస్పీ మామూలోడు కాదు

మంగళవారం చినగుమ్ములూరులోని తన నివాసంలో విలేఖరులతో మాట్లాడారు. తమ కుమార్తె పద్మలత హత్యకు గురైందన్న విషయాన్ని సోమవారం వరకూ నమ్మలేదని, అయితే నగర పోలీసులు పరిశోధించి, ఆమె హత్యకు గురైందని నిర్ధారించడంతో నిర్ఘాంతపోయానన్నారు.

కూతురు జోలికి రావొద్దని అప్పట్లో రవిబాబును హెచ్చరించా

కూతురు జోలికి రావొద్దని అప్పట్లో రవిబాబును హెచ్చరించా

తన కుమార్తె జోలికి రావద్దని పదేళ్ల కిందట అప్పట్లో సీఐగా ఉన్న రవిబాబును తీవ్రంగా హెచ్చరించానని, కానీ అతను చేతులకు మట్టి అంటకుండా, తమ కుటుంబంతో సన్నిహితంగా ఉండే గేదెల రాజును పావుగా వాడుకుని ఆమెను అంతం చేస్తాడని ఊహించలేకపోయానన్నారు.

కుట్రలో భాగమే అనుకుంటున్నాం

కుట్రలో భాగమే అనుకుంటున్నాం

గేదెల రాజు కూడా తమకు అనుమానం రాకుండా పద్మలతను హత్య చేసిన రోజు తన కుమారుడిని కూడా కారులో ఎక్కించుకోవడం అతని కుట్రలోని భాగంగా భావిస్తున్నానని చెప్పారు. తన కుటుంబానికి సంబంధించి ఏ విషయం అయినా డైరీలో రాసుకునే అలవాటు ఉందని నూకరాజు చెప్పారు.

గేదెల రాజు బిర్యానీ పెట్టించాడు

గేదెల రాజు బిర్యానీ పెట్టించాడు

తన కుమార్తె గత ఏడాది సెప్టెంబర్‌ 22న చనిపోయిందని, కానీ అంతకుముందు ఆగస్టు 29న విశాఖ వెళ్లినప్పుడు గేదెల రాజు గాజువాకలోని ఒక హోటల్‌కు తీసుకువెళ్లి బిర్యానీ పెట్టించాడని, అప్పుడే అందులో విషం కలిపి ఉంటాడని అనుమానిస్తున్నట్టు చెప్పారు. హోటల్‌ నుంచి బయటకు వచ్చిన వెంటనే తన కుమార్తె కింద పడిపోయిందని, వెంటనే కారులో ఎక్కించుకుని తీసుకువెళ్లి ఒక ఆసుపత్రిలో చేర్పించాడన్నారు.

విషం తీసుకున్నదని చెప్పాడు

విషం తీసుకున్నదని చెప్పాడు


ఈ విషయం తెలుసుకుని తాము ఆసుపత్రికి వెళ్లామని, పద్మలత ఆత్మహత్య చేసుకోవడానికి విషం తీసుకుందని గేదెల రాజు చెప్పాడని, ఆ తర్వాత తన కుమార్తెను అడిగితే తాను ఏ విషం తీసుకోలేదని చెప్పిందని తెలిపారు. పోలీస్‌ అధికారి రవిబాబు చేసిన మోసం వల్ల ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఉంటుందని అప్పుడు భావించానని, తమ కుటుంబానికి సన్నిహితుడు కావడంతో గేదెల రాజు మీద తనకు అనుమానం రాలేదన్నారు.

ఆ తర్వాత చనిపోవడంతో

ఆ తర్వాత చనిపోవడంతో

సుమారు నెల రోజుల తర్వాత తన కుమార్తె చనిపోయిందని, అనారోగ్యం కారణంగానే మృతి చెందిందని భావించి సహజ మరణంగా భావించానని, కానీ పోలీసుల విచారణలో ఆమెది హత్యే అని వెల్లడి కావడంతో ఆశ్చర్యపోయానన్నారు.

పోలీస్ అధికారిని కఠినంగా శిక్షించాలి

పోలీస్ అధికారిని కఠినంగా శిక్షించాలి

తన కుమార్తెను బలిగొన్న గేదెల రాజు హత్యకు గురికావడం ద్వారా ఇప్పటికే శిక్షింపబడ్డాడని, పోలీస్‌ అధికారి రవిబాబును కఠినంగా శిక్షించాలని కాకర నూకరాజు డిమాండ్‌ చేశారు. ఇటీవల తన కుమారుడితో కలిసి విశాఖ వెళ్లి, పోలీసులు అడిగిన వివరాలను తెలియజేశానని చెప్పారు.

English summary
Former MLA responds on daughter killing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X