వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రకాశం: మారనున్న రాజకీయం, చక్రం తిప్పనున్న దగ్గుబాటి?

ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు క్రియాశీలక రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు ప్రయత్నాలుదగ్గుబాటి వెంకటేశ్వర్‌రావు నియోజకవర్గంలో తరచుగా రాకపోకలు సాగిస్తున్నారు.గతంలో కీలకంగా వ్యవహరించిన నేతలు 20

By Narsimha
|
Google Oneindia TeluguNews

ఒంగోలు: 2019 ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఎన్నికలు దగ్గర పడుతున్నందున ప్రకాశం జిల్లా రాజకీయాల్లో గతంలో కీలకంగా వ్యవహరించిన నేతలు తిరిగి రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించేందుకు సన్నద్దమయ్యారు. వచ్చే ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. టిడిపిలో, కాంగ్రెస్‌లో క్రియాశీలకంగా వ్యవహరించిన దగ్గుబాటి వెంకటేశ్వర్‌రావు మరోసారి చురుకుగా వ్యవహరించడం ప్రాధాన్యతను కల్గిస్తోంది. మరోసారి ఆయన చక్రం తిప్పే అవకాశాలు లేకపోలేదనే చర్చ ప్రకాశం జిల్లాలో సాగుతోంది.

2014 ఎన్నికలకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకొన్న పరిస్థితుల కారణంగా కొందరు నేతలు క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

అయితే 2019 ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో కూడ మార్పులు చోటుచేసుకొంటున్నాయి. ఈ తరుణంలో వచ్చే ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు పలువురు నేతలు ప్రయత్నాలను చేస్తున్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు పార్టీల్లో కీలకంగా వ్యవహరించిన నేతలు మరోసారి రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు సన్నద్దమౌతున్నారు. వచ్చే ఎన్నికలనాటికి కూడ రాజకీయాల్లో మార్పులు చోటుచేసుకొనే అవకాశాలు లేకపోలేదు.

 మళ్ళీ చక్రం తిప్పనున్న దగ్గుబాటి వెంకటేశ్వర్‌రావు

మళ్ళీ చక్రం తిప్పనున్న దగ్గుబాటి వెంకటేశ్వర్‌రావు

దివంగత ఎన్టీఆర్‌ అల్లుడిగా టీడీపీ ఆవిర్భావం అనంతరం రాజకీయ అరంగేట్రం చేసిన డాక్టర్‌ దగ్గుబాటి వెంకటేశ్వరరావు 1994 వరకు ఆ పార్టీలో చక్రం తిప్పారు. టీడీపీలో సంక్షోభ సమయంలో చంద్రబాబుకు మద్దతు నిచ్చిన ఆయన అనంతరం ఎన్టీఆర్‌ టీడీపీలో, ఆ తర్వాత బీజీపీలో పనిచేసి తదనంతరం కొంతకాలం క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు.ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో 2004లో కాంగ్రెస్ పార్టీలో దగ్గుబాటి వెంకటేశ్వర్‌రావు చేరారు. ఆయన సతీమణి పురంధేశ్వరి బాపట్ల నుండి పోటీచేసి విజయం సాధించారు. 2009 ఎన్నికల్లోనూ ఆయన పర్చూరు నుంచి గెలుపొందారు. గత ఎన్నికల సమయంలో దగ్గుబాటి క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు. ప్రస్తుతం ఆయన సతీమణి పురందేశ్వరి బీజేపీలో ఉన్నప్పటికీ వెంకటేశ్వరరావు ఇటీవల తన సొంత నియోజకవర్గమైన పర్చూరు వైపు దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. తరచూ ఈ ప్రాంతంలో దగ్గుబాటి వెంకటేశ్వర్‌రావు, ఆయన కొడుకు, దగ్గుబాటి భార్య పురంధేశ్వరి విస్తృతంగా పర్యటిస్తున్నారు. దీంతో దగ్గుబాటి మరోసారి ప్రత్యక్ష రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించే అవకాశాలు లేకపోలేదనే చర్చ కూడ సాగుతోంది.

.మహీధర్‌రెడ్డి కూడ క్రియాశీలకంగా

.మహీధర్‌రెడ్డి కూడ క్రియాశీలకంగా

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కిరణ్‌కుమార్ రెడ్డి మంత్రివర్గంలో పురపాలకశాఖ మంత్రిగా పనిచేసిన మహీధర్‌రెడ్డి కూడ మరోసారి రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించే అవకాశాలు లేకపోలేదనే చర్చ సాగుతోంది. కందుకూరు నియోజకవర్గం నుండి ఆయన మూడు దఫాలు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014లో రాష్ట్ర విభజన జరగడంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలు కనుమరుగయ్యారు. ఇందులో మహీధర్‌రెడ్డి కూడ ఉన్నారు. తండ్రి ఆదినారాయణరెడ్డి మరణానంతరం రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఆయన మూ డు పర్యాయాలు కందుకూరు నుంచి ఎమ్మె ల్యేగా గెలుపొందారు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వం లో మంత్రిగా పని చేశారు. నియోజకవర్గంలో తనకంటూ ఒక గ్రూపును కొనసాగిస్తున్న ఆ యన రాష్ట్ర విభజన అనంతరం తొలిసారి జరిగిన గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు

. సేవా కార్యక్రమాలపై కేంద్రీకరించిన ఉగ్ర నరసింహరెడ్డి

. సేవా కార్యక్రమాలపై కేంద్రీకరించిన ఉగ్ర నరసింహరెడ్డి

ప్రకాశం జిల్లా కనిగిరి నుండి గతంలో ప్రాతినిథ్యం వహించిన ముక్కు కాశిరెడ్డి, ఉగ్ర నరసింహరెడ్డిలు కూడ మరోసారి క్రియాశీలకంగా వ్యవహరించనున్నారు.
జడ్పీ చైర్మన్‌గా, కొద్దికాలం మంత్రిగానూ పని చేసిన ముక్కు కాశిరెడ్డి, అదే నియోజకవర్గం నుంచి గతంలో ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించిన డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తదిత రుల పోకడ మళ్లీ వారు క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందన్న విషయాన్ని తేటతెల్లం చే స్తున్నాయి.ఉగ్ర నరసింహరె్డ్డి కాంగ్రెస్‌ తరఫున బరిలోకి దిగినప్పటికీ చివరి క్షణంలో తప్పుకు న్నారు. ఎన్నికల తర్వాత వారంతా సొంత పనులు, వ్యాపారాలపై దృష్టి కేంద్రీకరించారు. ప్రస్తుతం నియోజకవర్గానికే పరిమితమయ్యారు. ప్రతి కార్యక్రమానికీ హాజరువుతున్నారు. ఉదయం 8 గంటల ఉంచి మాచవరంలోని తన ఇంటి వద్ద ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ఆయా కార్యక్రమాలకు వెళ్లినప్పుడు అక్కడి నుంచి వెంటనే వెనుదిరగకుండా ప్రజలతో మమేకమవుతున్నారు

ముక్కు కాశిరెడ్డి కూడ స్పీడ్ పెంచాడు

ముక్కు కాశిరెడ్డి కూడ స్పీడ్ పెంచాడు

కనిగిరి శాసనసభ్యుడిగా మూడు పర్యా యాలు గెలుపొందడంతోపాటు రాష్ట్ర మంత్రి గా, జడ్పీ చైర్మన్‌గా పని చేసిన ముక్కు కాశి రెడ్డి ప్రస్తుతం స్పీడు పెంచారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమై అన్ని ఏర్పాట్లు చేసుకున్న ఆయనకు చివరి క్షణంలో టిక్కెట్‌ ఇవ్వకుండా ఆ పార్టీ అధిష్ఠానం షాక్‌ ఇచ్చింది. దీంతో తీవ్ర నిరాశకు గురైన ఆయన అప్పటి నుంచి రాజకీయాలకు కొంత దూరంగా ఉన్నారు. ఇప్పుడు స్పీడు పెంచారు. తన అనుచరులతో తరచూ సమావేశాలను నిర్వహిస్తున్నారు.

English summary
former Mlas of Prakasam district trying to re entry to active politics for 2019 elections. D.venkateswara rao, mukku kasi reddy, Ugra narasimha reddy, maheedhar reddy are trying to contest for 2019 elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X