• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జగన్‌, చంద్రబాబు కేసుల విచారణ లైవ్‌- సుప్రీంకు ఉండవల్లి లేఖ- బీజేపీ చేతుల్లో రమణ అభిశంసన ?

|

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాజకీయ నేతలపై ఉన్న తీవ్రమైన కేసుల్లో విచారణను ఏడాదిలోగా పూర్తి చేసేందుకు కోర్టులు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలోనూ జగన్ అక్రమాస్తుల కేసు, విపక్ష టీడీపీ అధినేత చంద్రబాబుపై ఓటుకు నోటు కేసు, అక్రమాస్తుల కేసు తెరపైకి వచ్చాయి. ఈ మూడు కేసుల్లో విచారణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర రాజకీయ భవిష్యత్తుతో ముడిపడిన ఈ కేసుల్లో ఏం జరగబోతోందన్న చర్చ సాగుతోంది. కాబట్టి జగన్‌, చంద్రబాబు కేసుల్లో విచారణను ప్రజలు తెలుసుకునేలా ప్రత్యక్ష ప్రసారానికి ఆదేశాలు ఇవ్వాలని కాంగ్రెస్‌ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ సుప్రీంకోర్టుకు లేఖ రాశారు.

జగన్‌, చంద్రబాబు కేసుల విచారణ లైవ్‌- ఉండవల్లి డిమాండ్‌

జగన్‌, చంద్రబాబు కేసుల విచారణ లైవ్‌- ఉండవల్లి డిమాండ్‌

ఏపీలో సీఎం వైఎస్‌ జగన్ పై గతంలో నమోదైన అక్రమాస్తుల కేసు, అలాగే టీడీపీ అధినేత చంద్రబాబుపై నమోదైన అక్రమాస్తుల కేసు, ఓటుకు నోటు కేసులపై ప్రస్తుతం రెగ్యులర్‌గా విచారణ జరుగుతోంది. ఈ కేసుల భవితవ్యం ఈ ఏడాది చివరిలోగా తేలిపోతుందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఏపీ భవిష్యత్తుతో ముడిపడిన ఈ మూడు కేసుల్లోనూ ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఆసక్తి కూడా జనంలో పెరుగుతోంది. దీంతో ఆయా కేసుల విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయాలని కాంగ్రెస్‌ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ కోరుతున్నారు. తాజాగా ఇదే అంశంపై సుప్రీంకోర్టు ఛీఫ్‌ జస్టిస్‌కు లేఖ రాసినట్లు ఉండవల్లి ఇవాళ వెల్లడించారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేసేందుకు ఇది తప్పనిసరి అన్నారు. కోర్టు లైవ్‌ ఇస్తానంటే డబ్బులిచ్చేందుకు చాలా మంది ముందుకొస్తారన్నారు. ఈ కేసుల్లో వచ్చే తీర్పులను వక్రీకరించే అవకాశాలు మెండుగా ఉన్నాయని, అందుకే లైవ్‌ కావాలని కోరినట్లు ఉండవల్లి తెలిపారు.

జగన్‌ లేఖపై చర్చ జరగాల్సిందే..

జగన్‌ లేఖపై చర్చ జరగాల్సిందే..

ఏపీ హైకోర్టులో తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తున్న తీర్పులకు సుప్రీంకోర్టు జడ్జీ జస్టిస్‌ ఎన్వీ రమణే కారణమంటూ సీఎం జగన్‌ లేఖ రాయడం తప్పేమీ కాదని ఉండవల్లి తెలిపారు. అయితే ఆ లేఖను బహిర్గతం చేయడంపైనే ప్రస్తుతం చర్చ జరుగుతోందన్నారు. కానీ ప్రభుత్వం ఆ లేఖను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అనుకుని ఉండొచ్చన్నారు. చట్టం ముందు సామాన్య ప్రజలే కాదు న్యాయమూర్తులు కూడా సమానమేనని, అందుకే జగన్‌ లేఖలో ఎలాంటి తప్పులేదన్నారు. దీనిపై సుప్రీంకోర్టు విచారణ కమిటీని నియమిస్తుందా లేక కేంద్రం అభిశంసన పెడుతుందా అన్న దానిపై ప్రస్తుతానికి ఎలాంటి క్లారిటీ లేదన్నారు. ఛీఫ్‌ జస్టిస్‌కు జగన్ రాసిన లేఖపై ఆయన ఎప్పుడు చర్యలు తీసుకుంటారు, అప్పటికల్లా ఆయన ఉంటారా లేక ఆరోఫణలు ఎదుర్కొంటున్న వ్యక్తి సీఐ అవుతారా అన్నది తేలాల్సి ఉందని ఉండవల్లి తెలిపారు. అంతిమంగా ఈ వ్యవహారాన్ని చల్లార్చాలన్నా, రెచ్చగొట్టాలన్నా కేంద్రం చేతుల్లోనే ఉంటుందన్నారు.

సంజీవయ్య లేఖపై తర్వాత ఏం జరిగిందంటే..

సంజీవయ్య లేఖపై తర్వాత ఏం జరిగిందంటే..

గతంలో హైకోర్టు ఛీఫ్ జస్టిస్‌గా ఉన్న జస్టిస్‌ చంద్రారెడ్డితో పాటు మరో ఇద్దరు న్యాయమూర్తులు జగన్మోహన్‌రెడ్డి, సత్యనారాయణరాజుకు వ్యతిరేకంగా 1961లో మాజీ సీఎం దామోదరం సంజీవయ్య కేంద్రానికి లేఖ రాశారని, దానిపై ఆయన రాజీనామా చేసిన తర్వాత సుప్రీంకోర్టు ఛీఫ్‌ జస్టిస్‌ హైదరాబాద్‌ వచ్చి విచారణ జరిపారని, దీని ఆధారంగా మద్రాసు హైకోర్టు ఛీఫ్‌ జస్టిస్‌గా చంద్రారెడ్డిని బదిలీ చేశారని ఉండవల్లి తెలిపారు. అయితే సంజీవయ్య తర్వాత సీఎం అయిన బ్రహ్మానందరెడ్డి తనకు కేంద్రంతో ఉన్న సంబంధాల కారణంగా చంద్రారెడ్డిని మద్రాసు ఛీఫ్‌ జస్టిస్‌ నుంచి యాక్టివ్ గవర్నర్‌ చేయించారని, ఏపీ హైకోర్టులో చంద్రారెడ్డితో పాటు ఆరోపణలు ఎదుర్కొన్న మరో జడ్జి సత్యనారాయణరాజు ఛీఫ్‌ జస్టిస్‌ అయ్యారని ఉండవల్లి వెల్లడించారు.

జడ్జీలకు దురుద్దేశాలు ఉండకపోవచ్చు...

జడ్జీలకు దురుద్దేశాలు ఉండకపోవచ్చు...

హైకోర్టు గ్యాగ్‌ ఆర్డర్‌ ఇవ్వాల్సిన అవసరమే లేదని ఉండవల్లి తెలిపారు. అమరావతిలో జడ్జీలు భూములు కొనుక్కుంటే తప్పేంటి. అందులో అక్రమాలు జరిగితే విచారణ జరపాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కంటే మేం బలమైన వాళ్లమని హైకోర్టు చెప్పాలనుకుంటే కుదరదని ఉండవల్లి తెలిపారు. విశాఖలో చంద్రబాబును అడ్డుకున్న వ్యవహారంలో డీజీపీని కోర్టుకు పిలిపించి సెక్షన్‌ 151 చదవమన్నారు. రాష్ట్ర పోలీసు బాస్‌తో అలా ఓ సెక్షన్‌ చదివించడం ద్వారా కోర్టు ఏం సందేశం ఇచ్చిందని ఉండవల్లి ప్రశ్నించారు. అయితే హైకోర్టు ఇచ్చిన తీర్పుల విషయంలో దురుద్ధేశాలు ఉన్నాయని తాను భావించడం లేదన్నారు. హైకోర్టు తీర్పులన్నీ సుప్రీంకోర్టుకు వెళ్లినా అవే తీర్పులొచ్చాయని, ఇవన్నీ సుప్రీంలో నారిమన్‌, ఛీఫ్‌ జస్టిస్‌ బెంచ్‌లకే వెళ్లాయిని ఉండవల్లి తెలిపారు. ప్రభుత్వం రూల్‌ ప్రకారం వెళితే కోర్టులు అడ్డుకుంటాయని తాను అనుకోవడం లేదన్నారు. ప్రభుత్వ నిర్ణయం చట్టబద్ధం, రాజ్యాంగబద్ధమైనా కాదని చెప్పే ధైర్యం కోర్టులకు కూడా లేదన్నారు.

బీజేపీ చేతుల్లోనే రమణ అభిశంసన...

బీజేపీ చేతుల్లోనే రమణ అభిశంసన...

బీజేపీకి జగన్‌ మద్దతిస్తున్నందున ఆయనకు ఈ వ్యవహారంలో యూపీఏ మద్దతు ఇవ్వడం కష్టమేనని ఉండవల్లి విశ్లేషించారు. కాబట్టి బీజేపీ తలచుకుంటేనే ఇది జరుగుతుందన్నారు. లోక్‌సభలో 100 మంది, రాజ్యసభల 50 మంది నోటీసులు ఇవ్వాలన్నా బీజేపీ మద్దతు తప్పనిసరి అవుతుందని ఉండవల్లి తెలిపారు. అసలు పార్లమెంటు సమావేశాలు లేకపోవడం జస్టిస్‌ రమణ అభిశంసనకు ప్రధాన అడ్డంకి కానుందని పేర్కొన్నారు. అయితే అభిశంసనే జరుగుతుందా లేక సుప్రీంకోర్టు ఈ ఆరోపణలపై ఓ కమిటీ వేసి దర్యాప్తు చేయిస్తుందా అనేది ఆసక్తికరమేనని ఉండవల్లి వ్యాఖ్యానించారు.

  Telangana Floods: Congress Demands Ex-gratia వరద బాధితులను పట్టించుకోని CM KCR
  జగన్‌ జైలుకెళ్లకపోవచ్చు, జరిమానాయే...

  జగన్‌ జైలుకెళ్లకపోవచ్చు, జరిమానాయే...


  జగన్‌ అక్రమాస్తుల కేసు విషయంలోనూ ఉండవల్లి తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. జగన్‌పై దాఖలైన అక్రమాస్తుల కేసు ఛార్జిషీట్లను తాను తెప్పించుకుని పరిశీలించానన్నారు. ఇందులో క్విడ్‌ ప్రోకో వ్యవహారాల్లో నేరుగా ఆయన పాత్ర ఎక్కడా లేదని, ఆయన తండ్రి వైఎస్ బతికుంటే ఆయనే నిందితుడు అయ్యేవారన్నారు. అయితే ఈ కేసులన్నీ జైలుకెళ్లే నేరాలు కావని, కేవలం జరిమానా మాత్రమే పడుతుంది తాను అంచనా వేస్తున్నట్లు ఉండవల్లి తెలిపారు. జగన్‌ మొండిగా వెళ్లిన కేసులే ఎక్కువ. తన మీద కేసులుంచుకుని కోర్టుల మీదకు వెళ్లాడంటే ఎవరో ఒకరి సలహా తీసుకుని ఉంటారని అనుకుంటున్నట్లు తెలిపారు. చదరంగంలో రాజులా జగన్ ఒక్క అడుగు మాత్రమే వేయాలని, మిగతా వాళ్లలా దూకుడుగా వెళ్లకూడదని ఉండవల్లి సలహా ఇచ్చారు.

  English summary
  former congress mp undavalli arun kumar request supreme court to give live telecast of trail in ys jagan's assets case and chandrababu's cash for vote cases.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X