వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్ర‌బాబుతో ఆ మాజీ ఎంపి..! క‌లిసి న‌డిచేందుకు సై..!!

|
Google Oneindia TeluguNews

హైద‌రాబాద్ : సంచ‌ల‌న రాజ‌కీయాల‌కు కేరాఫ్ అడ్రెస్ విజ‌య‌వాడ‌. ద‌క్షిణ భార‌తంలో ఏ సంచ‌ల‌నం జ‌ర‌గాల‌న్నా దానికి విజ‌య‌వాడ కేంద్ర‌బింందువు కావాల్సిందే..! కేంద్రానికి స‌రైన సంఖ్య‌లో ఎంపీలను అందించాల‌న్నా.. ప్ర‌భుత్వాల‌ను నిల‌బెట్టాల‌న్నా., ప‌డ‌గొట్టాల‌న్నా ఏపి రాజ‌కీయం ముందుంటుంది. అలాంటి ఏపి రాజ‌కీయాల్లో మ‌రో సంచ‌ల‌నం చోటు చేసుకోబోతోంది. రాజ‌కీయాల‌కు గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా దూరంగా ఉంటున్న ఆ ఎంపీ ఇప్పుడు మ‌ళ్లీ క్రియాశీల రాజ‌కీయాల్లోకి రావాల‌ని ఉవ్విళ్లూరుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపి సీయం చంద్ర‌బాబుతో జ‌ట్టు క‌ట్టేందుకు కూడా రంగం సిద్దం చేసుకుంటున్న‌ట్టు స‌మాచారం.. ఇంత‌కీ ఎవ‌రా ఎపీ..? తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం..!

విజ‌య‌వాడ‌లో వేదెక్కుతున్న రాజ‌కీయం..! సైకిలెక్కేందుకు చెయ్యందిస్తున్న నాయ‌కులు..!

విజ‌య‌వాడ‌లో వేదెక్కుతున్న రాజ‌కీయం..! సైకిలెక్కేందుకు చెయ్యందిస్తున్న నాయ‌కులు..!

విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సంచలనాలకు పెట్టింది పేరని అందరూ అంటుంటారు. ఆయన రాష్ట్ర విభజన జరిగితే రాజకీయాలకు గుడ్ బై చెబుతానని చెప్పి, అదే మాట మీద నిలబడ్డారు. అయితే విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఎప్పటికప్పుడు సర్వేలతో అందరి నోళ్లలో నానుతుంటారు. తనకు సర్వేలు చేయడమంటే ఎంతో ఆసక్తి అని గతంలో వెల్లడించారు. దీనితో పాటు ఆయన రాజకీయపరంగా మంచి వ్యూహాలు రచిస్తారని, ఆయన రచించే వ్యూహాలు తప్పక జరుగుతుంటాయని ఆయన సన్నిహితులు చెబుతుంటారు.

నాలుగేళ్లుగా అజ్ఞాతంలో ఆ ఎంపీ..! రాజ‌కీయాల్లో మ‌ళ్లీ క్రియాశీల పాత్ర‌..!!

నాలుగేళ్లుగా అజ్ఞాతంలో ఆ ఎంపీ..! రాజ‌కీయాల్లో మ‌ళ్లీ క్రియాశీల పాత్ర‌..!!

అయితే ఆయన గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయినా చంద్రబాబు ని ఎప్పటికప్పుడు కలుస్తూ వాస్తవ పరిస్థితులు వివరిస్తుంటార‌ని స‌మాచారం. అయితే ఆయన తెలుగుదేశం లోకి చేరతారని అందరూ అనుకున్నప్పుడల్లా ఆయన ఖండిస్తూ వస్తున్నారు. అదేవిధంగా చంద్రబాబు కూడా ఏనాడూ లగడపాటి ని రమ్మని ఆహ్వానించినట్టుగా వార్తలు కూడా రాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా విజయవాడలోని ఒక సామాజిక వర్గ ప్రముఖులు లగడపాటి తో భేటీ ఐన‌ట్టు తెలుస్తోంది. వారంతా ఏపీ ఇప్పుడు రాష్ట్ర విభజన కంటే ఎక్కువ నష్టాన్ని ఎదుర్కొంటోందని, ఈ సమయంలో రాష్ట్రానికి మద్దతు గా నిలవాలని, తెలుగుదేశం లో చేరితే చంద్రబాబు కి సైతం సాయంగా ఉండొచ్చు అని సూచించినట్టు సమాచారం.

చంద్ర‌బాబుతో ట‌చ్ లో ఉన్నా తెర‌మీద‌కు రాని ఎంపీ..!!

చంద్ర‌బాబుతో ట‌చ్ లో ఉన్నా తెర‌మీద‌కు రాని ఎంపీ..!!

ఈ నేపద్యంలో లగడపాటి డిసెంబర్ లో తెలుగుదేశం లో చేరి, పూర్తిగా రాజకీయాల మీద దృష్టి పెడతాన‌ని వారికి హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. కాగా రాజ్‌గోపాల్ స‌ర్వేల్లో టీడీపీ కి ఎక్కువ అనుకూల వాతావ‌ర‌ణం ఉన్న‌ట్టు స్ప‌ష్ట‌మైంది. ఇక తాజాగా క‌ర్ణాక‌ట ముఖ్య‌మంత్రి కుమార‌స్వామి విజ‌య‌వాడ వ‌చ్చిన‌ప్పుడు ఆయ‌న‌తో పాటు ఉన్న టీడీపీ నాయ‌కుల‌తో రాజ్‌గోపాల్ కూడా కనిపించారు. ఈ ప‌రిణామాలు చూస్తుంటూ ఆయ‌న టీడీపీతోనే ఎక్కువ ట‌చ్‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది.

కాంగ్రెస్ క‌న్నా టీడిపి కే ప్ర‌జాద‌ర‌ణ‌..! అంద‌కే సైకిల్ పై స‌వారి..!

కాంగ్రెస్ క‌న్నా టీడిపి కే ప్ర‌జాద‌ర‌ణ‌..! అంద‌కే సైకిల్ పై స‌వారి..!

గ‌తంలో రాజ్‌గోపాల్ చంద్ర‌బాబును క‌లిసిన‌ప్పుడు ఆయ‌న విజ‌య‌వాడ ఎంపీ సీటు కావాల‌ని కోరిన‌ట్టు సమాచారం.
ప‌ర్వత‌నేని ఉపేంద్ర అల్లుడిగా కాంగ్రెస్‌పార్టీలోకి ప్ర‌వేశించిన లాంకో సంస్థ‌ల అధినేత ల‌గ‌డ‌పాటి రాజకీయాల్లో త‌న‌కంటూ ప్ర‌త్యేక ముద్ర‌ను వేసుకున్నారు. కాంగ్రెస్‌లో వ‌రుస పెట్టి విజ‌య‌వాడ ఎంపీగా కూడా గెలుపు సాధించారు. ఉమ్మ‌డి రాష్ట్రంలోనే కీల‌క‌మైన విజ‌య‌వాడ ఎంపీ సీటు నుంచి ఆయ‌న 2004, 2009 ఎన్నిక‌ల్లో వ‌రుస‌గా గెలుపు దక్కించుకున్నారు. ఇప్పుడు మళ్లీ ఆయన తిరిగి రాజకీయాల్లో ప్రవేశించి చక్రం తిప్పనున్నారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఐతే ఏపిలో కాంగ్రెస్ పార్టీకి జీవం పోసేందుకు సీనియ‌ర్ నేత‌లంద‌రిని ఏక‌తాటిపై తెచ్చే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రంగా జ‌రుగుతున్న త‌రుణంలో చంద్ర‌బాబుతో రాజ్ గోపాల్ ప్ర‌యాణం ఎంత‌వ‌ర‌కూ కొన‌సాగుతుందో చూడాలి.

English summary
interesting political equations are going a head in andhra pradesh. huge discussion taking place in the party cadre that there will be alliance between tdp and congress.in the concern congress farmer vijayavada mp lagadapati raj gopal wants join in tdp. for some years he is in unknown politics. now wants to participate in active politics with help of chandrababu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X