వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విభజనపై సుప్రీంలో అఫిడవిట్‌కు బాబుకు ఉండవల్లి లేఖ

By Narsimha
|
Google Oneindia TeluguNews

రాజమండ్రి: ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ శుక్రవారంనాడు లేఖ రాశారు. ఏపీ రాష్ట్ర విభజనకు సంబంధించి తాను దాఖలు చేసిన పిటిషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని కోరారు.

ఏపీ రాష్ట్ర విభజన అంశంపై సుప్రీంకోర్టులో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు కౌంటర్ దాఖలు చేయలేదు.

Former Rajahmundry MP Undavalli Arun Kumar writes letter to Chandrababu Naidu

అయితే ఏపీ విభజనకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో తాను దాఖలు చేసిన పిటిషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని ఆ లేఖలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడును ఉండవల్లి అరుణ్ కుమార్ కోరారు. ఈ విషయాన్ని గతంలో పలుమార్లు తాను స్థానిక టిడిపి నేతల దృష్టికి కూడ తీసుకెళ్ళానని ఆయన ఆ లేఖలో ప్రస్తావించారు.

కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంతో టిడిపి తెగతెంపులు చేసుకొన్నందున పిటిషన్ దాఖలు చేయాలని ఉండవల్లి అరుణ్ కుమార్ చంద్రబాబునాయుడును ఆ లేఖలో కోరారు. తన పిటిషన్‌పై కేంద్రం అఫిడవిట్ దాఖలు చేయకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు.

ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేస్తే కేంద్రాన్ని నిలదీసేందుకు అవకాశం దక్కుతోందని ఆయన చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగే అవకాశం ఉందని ఉండవల్లి అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు.

English summary
Former Rajahmundry MP Vundavalli Arun kumar wrote a letter to Ap chief minister Chandrababunaidu on Friday. He demanded that Ap government to file affidavite in supreme court over ap bifrucation act.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X