వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

''పవన్ కళ్యాణ్ వల్లే పబ్లిసిటీ'', ''ఏం జరుగుతుందో చూద్దాం''

By Narsimha
|
Google Oneindia TeluguNews

Recommended Video

No Confidence Motion : Undavalli Credits Pawan Kalyan

అమరావతి: కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మాణం ప్రవేశపెట్టాలని వైసీపీ ప్రకటించడాన్ని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్వాగతించారు. అయితే వైసీపీ ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మాణానికి టిడిపి కూడ మద్దతు ప్రకటించాలని అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు.

ఏపీ రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్‌లో నిధుల విషయంలో అన్యాయం జరిగిందని అన్ని పార్టీలు నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి.ఈ తరుణంలో అవిశ్వాస తీర్మాణం తెరమీదికి వచ్చింది. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మాణాన్ని ప్రవేశపెట్టనున్నట్టు వైసీపీ ప్రకటించింది. ఈ ప్రకటనను రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ స్వాగతించారు.

చంద్రబాబునాయుడు మద్దతివ్వాలి

చంద్రబాబునాయుడు మద్దతివ్వాలి

కేంద్ర ప్రభుత్వంపై వైసీపీ ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మాణానికి టిడిపి మద్దతివ్వాలని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ కోరారు. కేంద్రంపై అవిశ్వాస తీర్మాణం ప్రవేశపెట్టాలని వైసీపీ చేసిన ప్రకటనను అరుణ్‌కుమార్ స్వాగతించారు.కేంద్ర ప్రభుత్వంలో టిడిపి భాగస్వామ్య ప్రభుత్వమే అధికారంలో ఉందన్నారు. అయితే భాగస్వామ్యపార్టీలే కేంద్ర ప్రభుత్వ తీరును తీవ్రంగా నిరసించడం పట్ల బిజెపి తీరును తెటతెల్లం చేస్తోందన్నారు.

ఫ్యాక్ట్‌పైండింగ్ కమిటీ ఏం బయటపెట్టనుందో

ఫ్యాక్ట్‌పైండింగ్ కమిటీ ఏం బయటపెట్టనుందో

ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఏ రకమైన విషయాలను బయట పెట్టనుందో చూడాల్సిన అవసరం ఉందని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ చెప్పారు. చట్టంలో చెప్పినవి కేంద్రం ఇవ్వలేదు. చట్టంలోలేనివి ఇచ్చినట్టు బిజెపి నేతలు చెబుతున్నారని ఉండవల్లి అరుణ్ కుమార్ గుర్తు చేశారు.అసెంబ్లీకి వైసీపీ నేతలను పంపి ప్రభుత్వ నుండి సమాచారాన్ని బయటపెట్టేలా ప్రయత్నించాలని ఉండవల్లి అరుణ్‌కుమార్ వైసీపీకి సూచించారు.

పవన్ కళ్యాణ్ ప్రకటన వల్లే

పవన్ కళ్యాణ్ ప్రకటన వల్లే

కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రతిపాదించాలని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రకటించడం వల్లే ఈ విషయమై మంచి పబ్లిసిటీ వచ్చిందని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ప్రకటించారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడకూడదని ఆయన పార్టీలకు సూచించారు.ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో చెప్పినవన్నీ కూడ ఇవ్వలేదన్నారు ఉండవల్లి అరుణ్ కుమార్

అవిశ్వాసాన్ని పెట్టనివ్వండి చూద్దాం

అవిశ్వాసాన్ని పెట్టనివ్వండి చూద్దాం

అవిశ్వాస తీర్మాణాన్ని వైసీపీ పెట్టనివ్వండి చూద్దామని ఏపీ రాష్ట్ర మంత్రి అమర్‌నాథ్ రెడ్డి చెప్పారు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కూడ వైసీపీ అవిశ్వాస తీర్మాణాన్ని ప్రవేశపెడితే ఎంపీల మద్దతును కూడగట్టేందుకు ప్రయత్నిస్తానని ప్రకటించారు. ఈ తరుణంలో మం మంత్రి అమర్‌నాథ్ వ్యాఖ్యానించారు.బోడిగుండు, వెంట్రుకల అంటూ మంత్రి మాణిక్యాలరావు ప్రకటనలు చేయడం సరికాదని మంత్రి అమర్‌నాథ్ అభిప్రాయపడ్డారు.

English summary
Former Rajahmundry MP Undavalli Arun kumar responded on Ysrcrp chief Ys Jagan no confidence motion on Centre governament . vudavalli Arun kumar spoke to media on Tuesday at Rajahmundry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X