• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మాజీ సీఎం రోశయ్య కన్నుమూత - తెలుగు రాజకీయ భీష్ముడిగా : సీఎం- గవర్నర్ గా...!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి...తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య కన్నుమూసారు. 88 ఏళ్ల రోశయ్య తెలుగు రాజకీయాల్లో భీష్ముడిగా చెప్పుకుంటారు. ఆచార్య ఎన్జీ రంగా శిష్యుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన రోశయ్య అనేక పదవులు నిర్వహించారు. ఎమ్మెల్యే..ఎమ్మెల్సీ..ఎంపీగా చట్ట సభల్లో సుదీర్ఘ కాలం పని చేసారు. ఏపీకి 16 సార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఆర్దిక మంత్రిగా రికార్డులకెక్కారు.

2009 లో వైఎస్ మరణం తరువాత రోశయ్య ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా 2010 నవంబర్ 25 వరకు పని చేసారు. ఆ తరువాత రోశయ్య తమిళనాడు గవర్నర్ గా వ్యవహరించారు. తన పదవులు వీడిన తరువాత రోశయ్య గాంధీ భవన్ కు వచ్చారు. నాడు ఇందిరా గాంధీ నుంచి...కాంగ్రెస్ రాజకీయాల్లో ఆయన కాకాలు తీరిన నేతగా వ్యవహరించారు.

రోశయ్య చనిపోయినట్లుగా వైద్యులు నిర్ధఆరించారు

రోశయ్య చనిపోయినట్లుగా వైద్యులు నిర్ధఆరించారు

ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత కాలం ఆయన మంత్రిగా వ్యవహరించారు. కొంత కాలంగా అస్వస్థతో ఉన్న రోశయ్యకు ఒక్కసారిగా బీపీ డౌన్ కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి వెళ్లగానే రోశయ్య చనిపోయినట్లుగా వైద్యులు నిర్ధఆరించారు. హైదరాబాద్ లోని స్టార్ ఆస్పత్రిలో ఆయన తుది శ్వాస విడిచారు. ఇంటి దగ్గర నుంచి ఆస్పత్రి కి మార్గమధ్యంలోనే రోశయ్య మృతి చెందారని చెబుతున్నారు. రోశయ్య పార్థివ దేహాన్ని అమీర్ పేట వద్ద ఉన్న ధరమ్ కరమ్ రోడ్డలోని ఆయన ఇంటికి తరలిస్తున్నారు. ఆయన మరణ వార్తతో ఒక్క సారిగా సీనియర్ రాజకీయ నేతలంతా షాక్ కు గురయ్యారు.

కాంగ్రెస్ లో కార్యకర్త నుంచి సీఎం దాకా..

కాంగ్రెస్ లో కార్యకర్త నుంచి సీఎం దాకా..

గుంటూరు జిల్లా వేమూరులో జన్మించిన రోశయ్య విద్యార్ధి దశలోనే ఎన్టీ రంగా శిష్యుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసారు. ఆయన 1968,1974, 1980,2009 లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 1994 నుంచి 1996 వరకు ఆయన పీసీసీ అధ్యక్షుడిగా పని చేసారు. 1979లో టంగుటూరి అంజయ్య ప్రభుత్వంలో రవాణ, గృహనిర్మాణం, వాణిజ్య పన్నుల శాఖలు, 1982లో కోట్ల విజయభాస్కరరెడ్డి ప్రభుత్వంలో హోం శాఖ, 1989లో చెన్నారెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, రవాణ, విద్యుత్తు శాఖలు, 1991లో నేదురుమల్లి జనార్ధనరెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్తు శాఖలు, 1992లో కోట్ల విజయభాస్కర రెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్తు శాఖలకు మంత్రిగా పనిచేసారు. 2004, 2009లో వై.యస్. రాజశేఖరరెడ్డి ప్రభుత్వములో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.

ఏపీ లెక్కలు..బడ్జెట్ లో అనుభవ శాలి

ఏపీ లెక్కలు..బడ్జెట్ లో అనుభవ శాలి

రోశయ్య ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ (ఆర్ధిక ప్రణాళిక)ను ఇప్పటికి 15 సార్లు ఆంధ్ర ప్రదేశ్ శాసనసభలో ప్రవేశపెట్టారు. 1995-97 మధ్యకాలంలో ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపిసిసి) అధ్యక్షుడిగా పనిచేశారు. 1998లో నరసరావుపేట నియోజకవర్గం నుండి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆర్థికమంత్రిగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో సుదీర్ఘకాలం పాటు ఆర్థికమంత్రిగా పనిచేసిన రోశయ్య 2009-10 బడ్జెటుతో కలిపి మొత్తం 15 సార్లు రాష్ట్ర బడ్జెటును ప్రవేశపెట్టారు.

ఇందులో చివరి 7 సార్లు వరుసగా ప్రవేశపెట్టడం విశేషం. బడ్జెట్ కూర్పులో రోశయ్య ఘనాపాటిగా పేరుపొందినారు. ముఖ్యమంత్రిగా వై.ఎస్.రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందడంతో 2009, సెప్టెంబర్ 3 న రోశయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసారు. పద్నాలుగు నెలలు అధికారంలో కొనసాగిన అనంతరం 2010 నవంబరు 24 వ తేదీన తన పదవికి రాజీనామా చేసారు.

కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతూ..

కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతూ..

ప్రతిరోజు ఉదయం 5:30 కి ఇంటి వరండాలో కూర్చోవటం రోశయ్యకు అలవాటు. ప్రతిరోజు లాగానే రోశయ్య ను ఈరోజు కూడా కుటుంబ సభ్యులు వరండాలో కుటుంబ సభ్యులు కూర్చోబెట్టారు. 6:30 సమయంలో కుటుంబ సభ్యులు వచ్చేసరికి అపస్మారక స్థితిలోకి వెళ్లిన రోశయ్యను గుర్తించారు. నోటి నుంచి రక్తం రావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. గత కొంతకాలం నుంచి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
ప్రతినిత్యం రోశయ్య పర్యవేక్షించేందుకు ఇద్దరు డాక్టర్లు ఉంటారు. ఆసుపత్రికి తీసుకు వెళ్లే సరికి అప్పటికే చనిపోయినట్టుగా వైద్యులు ప్రకటించారు.

గత కొంత కాలం నుంచి నడవలేని స్థితిలో ఉన్న రోశయ్య ఆరోగ్య పరంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ రోజు ఉదయం ఆయన ఆకస్మికంగా తీవ్ర అస్వస్థతలకు గురి కావటంతో తుది శ్వాస విడిచారు.

English summary
Former Tamilnadu Governor and Former CM Rosaiah passed away 88
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X