వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీలో చేరడంపై మాజీ మంత్రి కళా వెంకట్రావు క్లారిటీ- ఆ విషయం తెలియదంటూ..

|
Google Oneindia TeluguNews

బీజేపీలో చేరుతున్నానంటూ వస్తున్న వార్తల్ని టీడీపీ మాజీ మంత్రి, ఏపీలో ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు కూడా అయిన కళా వెంకట్రావు ఖండించారు. బీజేపీలో చేరికపై వస్తున్న వార్తలు నిజం కాదన్నారు. బీజేపీలో చేరాల్సిన అవసరం తనకు లేదన్నారు. చివరి క్షణం వరకూ చంద్రబాబుతోనే ఉంటానని కళా స్పష్టం చేశారు.

అంతకు ముందు కళా వెంకట్రావు బీజేపీలో చేరే అవకాశం ఉందని వార్తలొచ్చాయి. రేపు కళా వెంకట్రావును ఆయన నివాసంలో కలిసేందుకు వెళ్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నుంచి లీకులు రావడంతో కళా చేరికపై పుకార్లు వినిపించాయి. సోము వీర్రాజు ఏకంగా కళా వెంకట్రావు ఇంటికి వెళ్లి కలవనున్నట్లు ఆ లీకుల సారాంశం. అయితే సోము వీర్రాజు తన నివాసానికి వస్తున్నట్లు కూడా తెలియదని కళా వెంకట్రావు చెప్పడంతో గందరగోళం నెలకొంది.

former tdp minister kala venkata rao denies rumous on joining bjp

వాస్తవానికి టీడీపీ నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన కీలక నేతలను ఆకర్షించేందుకు బీజేపీ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. ఇదే కోవలో మాజీ మంత్రులు కళా వెంకట్రావు, పడాల అరుణతో పాటు మరో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభాన్ని కూడా వారి ఇళ్లకు వెళ్లి కలిసేందుకు సోము వీర్రాజు సిద్ధమవుతున్నట్లు ఇవాళ వార్తలొచ్చాయి. టీడీపీలో అసంతృప్తిగా ఉన్న కాపు సామాజిక వర్గ నేతలను ఆకర్షించడం ద్వారా పార్టీని బలోపేతం చేసుకునేందుకు సోము వీర్రాజు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే బీజేపీలోకి వెళ్తారని ప్రచారం జరుగుతున్న ముగ్గురిలో కేవలం కళా మాత్రమే ఈ ప్రచారం ఖండించగా.. పడాల, ముద్రగడ స్పందించలేదు.

English summary
former minister kala venkata rao reaction on joining bjp, kala venkata rao denies rumous on joining bjp, kala venkata rao on party change, kala venkata rao on meeting with somu veerraju, kala venkata rao news
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X