
కోడిపందాల పుకార్లపై చింతమనేని ఫైర్- లేకుండానే ఉన్నానంటారా ? కేసీఆర్, జగన్ పై పోస్ట్
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో జరిగిన కోడి పందాల్లో తాను పాల్గొని, పోలీసు రైడ్ తర్వాత పారిపోయినట్లు వచ్చిన పుకార్లపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తీవ్రంగా స్పందించారు. కోడిపందాలపై పోలీసులు దాడి చేసిన తర్వాత తాను పారిపోయినట్లు జరుగుతున్న ప్రచారంపై ఆయన ఫేస్ బుక్ ద్వారా ఫైర్ అయ్యారు.
సంగారెడ్డి జిల్లా చినకంజర్ల శివారులో కోడి పందేలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పటాన్ చెరు పోలీసులు నిన్న రాత్రి దాడులు చేసారు. ఆ సమయంలో అక్కడ 70 మంది ఉనట్లు, వీరిలో 21 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు. పట్టుకొన్న వారి నుంచి రూ.13 లక్షల నగదు, 26 వాహనాలు, 27 సెల్ ఫోన్లు, 30 కత్తులు, 30 కోళ్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. అయితే ఇదే సమయంలో ఏపీలో టీడీపీ మాజీ ఎమ్మెల్యేచింతమనేని కూడా పాల్గొన్నారని, పోలీసుల దాడి నేపథ్యంలో ఆయన పారిపోయారని తెలిపారు. ఆయన ఇప్పుడు పరారీలో ఉన్నట్లు వెల్డడించారు. ఈ వాదనపై చింతమనేని ఫేస్ బుక్ లో స్పందించారు.

కోడి పందాల్లో లేని వ్యక్తి నీ ఉన్నట్లు గానే చూపటం మీ జెండా అజెండా.. ఇంత రాక్షస రాజకీయం అవసరమా...? అని చింతమనేని ఫేస్ బుక్ లో ప్రశ్నించారు. రాజకీయాన్ని రాజకీయంగానే ఎదుర్కొండి, ఈ దుర్మార్గపు నీచమైన ప్రచారం ఇకనైన ఆపండి అని కోరారు. ఈ నీచమైన ప్రచారం తోనే కుప్ప కూలే మేడలు కట్టి అధికారంలోకి వచ్చారు, తెలుగు ప్రజల్లో విష బీజాలు నాటి నాడు అధికారంలోకి వచ్చారు ఆ మేడ కూలిపోయే సమయం ఆసన్నమయిందైన్నారు..
మీ అసత్యాలు సాక్షి నీ ప్రజలు కూకటి వేళ్లతో ప్రక్షాళన చేసే సమయం ఆసన్నమయిందన్నారు. ఆ రోజు కొసమే తెలుగు ప్రజలు ఎదురు చూస్తున్నారు ... మీ రాక్షస రాజకీయ వికట ఆట్టహాసానికి ( మీ సాక్షి , కి ) ముగింపు త్వరలో నే.
మీ చింతమనేని ప్రభాకర్ అంటూ తన ఫేస్ బుక్ పోస్టులో ఆయన రాసుకొచ్చారు.