హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాంగ్‌లోకి తెరాస మాజీ, శాలువాకప్పిన సబిత(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కాంగ్రెసు పార్టీ అధిష్టానం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడంతో తెలంగాణ ప్రాంతంలో ఆ పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి నుండి బయటకు వచ్చిన మాజీ మంత్రులు విజయ రామారావు, ఎ చంద్రశేఖర్, సీనియర్ నేత రఘునందన రావు శనివారం కాంగ్రెసు పార్టీ సభ్యత్వం తీసుకున్నారు.

ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేతుల మీదుగా ఈ ముగ్గురు నేతలు కాంగ్రెసు పార్టీ ప్రాథమిస సభ్యత్వాన్ని తీసుకున్నారు. గాంధీ భవనంలో జరిగిన ఈ కార్యక్రమంలో బొత్స వారికి సభ్యత్వం ఇచ్చి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ... అనుభవం ఉన్న నేతలు కాంగ్రెసు పార్టీలోకి రావడం సంతోషకరమన్నారు. దళితులు పార్టీలోకి రావడం మంచిదే అన్నారు. కాగా, సిడబ్ల్యూసి తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న తర్వాత తెరాస మెదక్ ఎంపీ విజయశాంతి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెసు పార్టీలో చేరిన విషయం తెలిసిందే.

ఎ చంద్రశేఖర్

ఎ చంద్రశేఖర్

మాజీ తెలంగాణ రాష్ట్ర సమితి మంత్రి, సీనియర్ రాజకీయ నాయకులు ఎ చంద్రశేఖర్‌కు కాంగ్రెసు పార్టీ సభ్యత్వాన్ని అందజేస్తున్న పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ.

మాట్లాడుతున్న బొత్స

మాట్లాడుతున్న బొత్స

తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన మాజీ నేతలు కాంగ్రెసు పార్టీలో చేరుతున్న సందర్భంగా మాట్లాడుతున్న పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ.

సబితను కలిసిన నేతలు

సబితను కలిసిన నేతలు

కాంగ్రెసు పార్టీలో చేరిన అనంతరం మాజీ హోంమంత్రి, కాంగ్రెసు పార్టీ నాయకురాలు సబితా ఇంద్రా రెడ్డిని కలిసిన మాజీ మంత్రి ఎ చంద్రశేఖర్ తదితర నేతలు.

శాలువా కప్పిన సబిత

శాలువా కప్పిన సబిత

కాంగ్రెసు పార్టీలో చేరిన మాజీ తెలంగాణ రాష్ట్ర సమితి మంత్రి ఎ చంద్రశేఖర్‌కు శాలువా కప్పి కాంగ్రెసు పార్టీలోకి ఆహ్వానిస్తున్న మాజీ హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి.

English summary
Three former Telangana Rastra Samithi leaders joined in Congress party in the presence of PCC chief Botsa Satyanarayana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X