వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వచ్చే ఏట నుండే ఐఐఎం విశాఖ: స్మృతితో బాబు ముచ్చట (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

విశాఖ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్టణం శివార్లలోని గంభీరంలో ఐఐఎం భవన నిర్మాణానికి కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి స్మృతీ ఇరానీ శనివారం ఉదయం శంకుస్థాపన చేశారు.

ఈ కార్యక్రమంలో స్మృతీ ఇరానీ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ యువత కలలను సాకారం చేసేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, అశోక్ గజపతిరాజు, రాష్ట్ర మంత్రులు నారాయణ, గంటా శ్రీనివాస రావు పాల్గొన్నారు.

 ఐఐఎం

ఐఐఎం

రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా నవ్యాంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీల అమలులో తొలి అడుగు పడింది. ఐఐఎంకు విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం గంభీరంలో శంకుస్థాపన జరిగింది.

 ఐఐఎం

ఐఐఎం

వచ్చే ఏడాది నుంచే ఇందులో అడ్మిషన్లు జరగనున్నాయి. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతీ ఇరానీ, పట్టణాభివృద్ధి శాఖమంత్రి వెంకయ్య నాయుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం ఐఐఎం-వికి శంకుస్థాపన చేశారు.

 ఐఐఎం

ఐఐఎం

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముగ్గురు నేతలు ప్రసంగించారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న విశాఖపట్నం ఐఐఎంకు బెంగళూరు ఐఐఎం మెంటార్‌‌గా (మార్గదర్శి) వ్యవహరిస్తుందని తెలిపారు.

 ఐఐఎం

ఐఐఎం

ఐఐఎంతో విశాఖలో నూతన శకం మొదలవుతుందని, యువత కలలు సాకారం అవుతాయని స్మృతి ఇరానీ ఆశాభావం వ్యక్తం చేశారు.

 ఐఐఎం

ఐఐఎం

గత బడ్జెట్‌లోనే ఆరు ఐఐఎంలు మంజూరు చేశామని, అందులో విశాఖపట్నంలో తన చేతుల మీదుగా శంకుస్థాపన జరగడం సంతోషాన్ని ఇస్తోందని తెలిపారు.

 ఐఐఎం

ఐఐఎం

విశాఖలో ఐఐఎంను జాతికి అంకితం చేస్తున్నామని, దీనివల్ల ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి చెందుతుందని, తద్వారా దేశమూ ముందుకు వెళుతుందని స్మృతి పేర్కొన్నారు.

 ఐఐఎం

ఐఐఎం

వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఐఐఎం బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం పొందుతామన్నారు. హుధుద్ తుఫాన్‌ తర్వాత విశాఖపట్నం వచ్చిన ప్రధాని మోడీకి విశాఖ ప్రజలు అపూర్వ స్వాగతం పలికారని, మా అమ్మ కూడా ఒకప్పుడు విశాఖలోని నేవీ కాలనీలో ఉండేవారని స్మృతీ ఇరానీ తెలిపారు.

 ఐఐఎం

ఐఐఎం

విశాఖలో చదువుకున్న కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఎప్పుడూ కొత్త మార్పులు కోరుకుంటారని స్మృతి ఇరానీ ప్రశంసించారు.

ఐఐఎం

ఐఐఎం

జాతీయ స్థాయిలో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తామని స్మృతీ ఇరానీ పేర్కొన్నారు. ఉన్నత విద్య కొందరికి మాత్రమే పరిమితం కాకుండా అందరికీ చేరువ చేసేలా చర్యలు చేపడుతున్నామని, ఐఐటీ, ఎన్‌ఐటీలతో సహా దేశంలో ప్రముఖ విద్యా సంస్థలన్నింటిలో త్వరలో ఆన్‌లైన్‌ సర్టిఫికెట్‌ కోర్సులు ప్రవేశపెడతామని, దళితులు, బలహీన వర్గాలు, వికలాంగులకు నామమాత్రపు ఫీజుతోనే ఈ కోర్సులు చదివే అవకాశం కల్పిస్తామని ప్రకటించారు.

 ఐఐఎం

ఐఐఎం

మేక్‌ ఇన్‌ ఇండియాకు పిలుపునిచ్చిన ప్రధాని మోడీ విద్యావ్యవస్థలో సమూల మార్పులు ఆశిస్తున్నారని, ఆ మేరకు నూతన విద్యావిధానం రూపొందిస్తున్నామని తెలిపారు.

ఐఐఎం

ఐఐఎం

దీనిపై సలహాలు, సూచనలు స్వీకరించేందుకు ఈ నెల 26వ తేదీన దేశవ్యాప్తంగా చర్చలు ప్రారంభిస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు.

 ఐఐఎం

ఐఐఎం

విశాఖపట్నాన్ని ప్రపంచస్థాయి విద్య, విజ్ఞాన కేంద్రంగా అభివృద్ధి చేస్తామని, ఐఐఎం ఏర్పాటుతోనే దీనికి నాంది పలుకుతున్నామని చంద్రబాబు ప్రకటించారు.

 ఐఐఎం

ఐఐఎం

విశాఖ జిల్లా చక్కటి ప్రదేశమని దీనిని ప్రపంచ స్థాయి నగరంగా మార్చడానికి అహర్నిశలూ శ్రమిస్తామని చంద్రబాబు చెప్పారు.

 ఐఐఎం

ఐఐఎం

తమ హయాంలో ఏపీని ఐటీకి మరో పేరుగా మార్చామని, ఇప్పుడు ఇంకా ఎంతో చేస్తామని, కుమార మంగళం బిర్లా ఏపీలో సరళ బిర్లా ఇంటర్నేషనల్‌ స్కూల్‌ పెడతామన్నారని, బిట్స్‌ కూడా వస్తుందని, విశాఖ ఐఐఎంలో కొత్త తరహా కోర్సులు పెట్టాలని కేంద్రాన్ని కోరామని తెలిపారు.

 ఐఐఎం

ఐఐఎం

విశాఖ ఐఐఎంలో ఈ జూన్‌లోనే ప్రవేశాలు కల్పిస్తామని చంద్రబాబు ప్రకటించారు. యువతలో నైపుణ్యం పెంపునకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేశామని, త్వరలోనే యూనివర్సిటీ కూడా పెడతామని చంద్రబాబు ప్రకటించారు.

 ఐఐఎం

ఐఐఎం

విశాఖలో ఇంక్యుబేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తామని తెలిపారు. ప్రపంచంలో అత్యుత్తమ విద్యా సంస్థల సహకారంతో ఏపీని విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు.

 ఐఐఎం

ఐఐఎం

విద్యా విధానాల్లో కేంద్ర, రాషా్ట్రల మధ్య సమన్వయం కోసం ఓ టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటుచేయాలని సీఎం చంద్రబాబు కోరగా... వేదికపైనున్న కేంద్ర మంత్రి స్మృతీ ఇరాని వెంటనే ఆమోదం తెలిపారు.

 ఐఐఎం

ఐఐఎం

రాష్ట్రంలో అత్యుత్తమ ప్రతిభ చూపే విద్యార్థులు, ఉపాధ్యాయులను ప్రతిభ పురస్కారాలతో సత్కరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

 ఐఐఎం

ఐఐఎం

యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ప్రపంచంలో ఏ దేశానికి లేని యువ సంపద ఇండియాకు ఉందన్నారు.

 ఐఐఎం

ఐఐఎం

2020కి సగటు వయస్సు 29 ఏళ్లు అవుతుందని, వారందరికీ చక్కటి విద్యను అందించేందుకు తాము కృషి చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు.

 ఐఐఎం

ఐఐఎం

ప్రధాని మోడీ ఇండియా ప్రతిష్ఠను పెంచుతున్నారని, వెంకయ్య నాయుడు పట్టుదల గల మనిషి అని, స్మృతి ఇరానీ యువ మంత్రి అని చంద్రబాబు ప్రశంసించారు. స్మృతీ ఇరానీ ప్రసంగాన్ని విశాఖ ఎంపీ హరిబాబు తెలుగులోకి అనువదించారు.

English summary
Union HRD Minister Smriti Irani laid the foundation stone for IIM-Visakhapatnam at Gambheeram village near here on Saturday in the presence of Union Minister of Urban Development M Venkaiah Naidu, Chief Minister N Chandrababu Naidu and others.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X