• search
 • Live TV
తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

భయపెడుతున్న ఆ రోడ్డు: చిత్తూరులో అదో మృత్యు మార్గం?.. మరో కుటుంబం బలి..

|
  చిత్తూరులో భయపెడుతున్న మృత్యు మార్గం?.. మరో కుటుంబం బలి.. | Oneindia Telugu

  శ్రీకాళహస్తి: చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి హైవే మృత్యు మార్గంగా మారింది. ఈ మార్గంలో రోజురోజుకు పెరుగుతున్న ప్రమాదాలు వాహనదారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.

  జిల్లాలోని నాయుడుపేట-పూతలపట్టు, పిచ్చాటూరు-శ్రీకాళహస్తి, తడ-శ్రీకాళహస్తి మార్గాల్లో తరుచుగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తిరుమల, శ్రీకాళహస్తి వంటి రెండు ప్రధాన పుణ్యక్షేత్రాలు జిల్లాలో ఉండటంతో.. నిత్యం వేలమంది ప్రజలు జిల్లాకు వస్తుంటారు. దీంతో రద్దీగా ఉండే రోడ్డుపై ప్రమాద ఘటనలు తరుచుగా చోటు చేసుకుంటున్నాయి.

  రోడ్ టెర్రర్:

  రోడ్ టెర్రర్:

  శుక్రవారం శ్రీకాళహస్తి సమీపంలోని ల్యాంకో ఫ్యాక్టరీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ఎదురెదురుగా వస్తున్న లారీ కారు ఢీకొనడంతో.. నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను తమిళనాడు తిరుపూరు జిల్లాలోని అంజేరితలై గ్రామానికి చెందిన సుందరరామ్మూర్తి (55), అతని భార్య సుమతి (49), కుమార్తె ప్రియ (20), కుమారుడు కిరణ్‌ (11)గా గుర్తించారు.

  తిరుపతి పయనమై:

  తిరుపతి పయనమై:

  శ్రీకాళహస్తిలో దర్శనం తర్వాత సుందరరామ్మూర్తి కుటుంబం తిరుపతి బయలుదేరింది. శ్రీకాళహస్తి మండలంలోని ల్యాంకో పరిశ్రమ సమీపంలోకి రాగానే.. ఎదురుగా వస్తున్న కంటైనర్ అదుపుతప్పి కారును ఢీకొంది. ప్రమాద సమయంలో కారును సుందరరామ్మూర్తి నడుపుతున్నారు. కంటైనర్ ఢీకొట్టడంతో రోడ్డు పక్కనే ఉన్న కాలువలోకి కారు బోల్తా కొట్టింది. దీంతో సుందరామ్మూర్తి కుటుంబమంతా ప్రమాదంలో దుర్మరణం పాలైంది.

  సుందరరామ్మూర్తి ప్రైవేట్‌ కంపెనీలో ఎలక్ట్రికల్‌ ఇంజినీరుగా పనిచేస్తుండగా.. కుమార్తె ప్రియ సివిల్‌ ఇంజినీరింగ్‌ నాలుగో సంవత్సరం చదువుతోంది. కుమారుడు కిరణ్‌ ఆరో తరగతి చదువుతున్నాడు. కారును ఢీకొట్టిన కంటైనర్‌ డ్రైవర్‌ పరారీలో ఉన్నాడని సీఐ తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

  ఇటీవలి ప్రమాదాలు:

  ఇటీవలి ప్రమాదాలు:

  జిల్లాలో ఇటీవలి కాలంలో ప్రమాదాల తీవ్రత మరింత పెరిగింది. నాయుడుపేట-పూతలపట్టు రోడ్డులో ఇసుకగుంట సమీపంలో ఫిబ్రవరి 6న ఓ కారు, లారీ ఢొకొన్నాయి. ఈ ఘటనలో నెల్లూరుకు చెందిన కారు డ్రైవర్‌ మహ్మద్‌ఆలీ దుర్మరణం చెందాడు.

  ఫిబ్రవరి 18న మరో ప్రమాదం చోటు చేసుకుంది. చెర్లోపల్లి సమీపంలో రెండుకార్లు ఢీకొనటంతో బెంగళూరుకు చెందిన తిమ్మప్పగౌడ్, అతని అల్లుడు శ్రీనివాసులు మృతి చెందారు. ఏప్రిల్ 1న ఎంపేడు సమీపంలో ఆటోను లారీ ఢీకొనడంతో ఆటో డ్రైవర్‌ రమేష్‌ మృతి చెందాడు.

  జూలై 20న ల్యాంకో సమీపంలో ఓ ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొనటంతో ఒకరు మృతి చెందారు.

   కారణాలేంటి?:

  కారణాలేంటి?:

  నాయుడుపేట-పూతలపట్టు జాతీయ రహదారిని నాలుగు లేన్ల రహదారిగా మార్చాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉంది. జిల్లాలో ఉన్న తిరుమల, శ్రీకాళహస్తి వంటి పుణ్యక్షేత్రాలకు భారీ సంఖ్యలో జనం వస్తుండటంతో రహదారిపై రద్దీ పెరుగుతోంది. దీంతో ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి.

  తిరుమలకు వచ్చే చాలామంది భక్తులు శ్రీవారి దర్శనానంతరం శ్రీకాళహస్తి వెళుతుంటారు. ఇక్కడ రాహుకేతు పూజలు చేయించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తుంటారు. అలా ఈ పుణ్యక్షేత్రానికి ఎప్పుడూ రద్దీ ఉంటుంది.

  పైగా శ్రీకాళహస్తి, సత్యవేడు పారిశ్రామికంగా ప్రాంతాలు కావడం కూడా ప్రమాదాలకు కారణంగీ తెలుస్తోంది. ఈ మార్గంలోని పరిశ్రమలకు వెళ్లేందుకు పూతలపట్టు- నాయుడుపేట రహదారి ఒకటే దిక్కు. మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో వాహనాలన్ని ఈ రోడ్డు గుండానే వెళ్లాల్సిన పరిస్థితి. ఈ క్రమంలోనే లారీలు కార్లను ఢీకొంటున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Four pilgrims died in a ghastly road mishap on Srikalahasti-Tirupati road in front of Lanco Ferrus Factory in Chatterjee Nagar on Friday evening.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more